borrowing money
-
రిలయన్స్ రిటైల్ రుణ పరిమితి పెంపు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం ఆర్ఐఎల్ గ్రూప్ కంపెనీ రిలయన్స్ రిటైల్.. రుణ సమీకరణ పరిమితిని రెట్టింపునకు పెంచేందుకు వాటాదారుల అనుమతిని కోరనుంది. వెరసి రూ. లక్ష కోట్ల రుణ పరిమితి ప్రతిపాదనను ఈ నెల 30న నిర్వహించనున్న వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో వాటాదారుల ముందు ఉంచనుంది. ప్రస్తుతం కంపెనీ రుణ సమీకరణ పరిమితి రూ. 50,000 కోట్లుగా ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో వాటాదారులు ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2022 మే 5న సమావేశమైన కంపెనీ బోర్డు రుణ సమీకరణ పరిమితిని రూ. లక్ష కోట్లకు పెంచేందుకు ప్రతిపాదించింది. తద్వారా బిజినెస్ అవసరాలకు అనుగుణంగా కంపెనీ సమయానుగుణ రుణ సమీకరణకు వీలు చిక్కనున్నట్లు ఏజీఎం నోటీసులో పేర్కొంది. 2022 మార్చి 31కల్లా రిలయన్స్ రిటైల్ స్థూల రుణ భారం రూ. 40,756 కోట్లుగా నమోదైంది. గత నెలలో జరిగిన ఆర్ఐఎల్ ఏజీఎంలో రిలయన్స్ రిటైల్ ఎఫ్ఎంసీజీ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు వెల్లడించిన నేపథ్యంలో తాజా ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఏర్పడింది. గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో రిటైల్ బిజినెస్‌పై ఆర్ఐఎల్ రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. -
నిజామాబాద్‌లో దారుణం.. మద్యం తాగాక ఫోన్.. రూ.వెయ్యి తక్కువ ఇచ్చాడని..
నిజామాబాద్ అర్బన్: నగరంలోని దుబ్బ ప్రాంతంలో గత రెండు రోజుల కిందట జరిగిన హత్య వివరాలను ఏసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. నగరంలోని తన ఛాంబర్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేవలం వెయ్యిరూపాయల కోసం జరిగిన గొడవలో యువకుడు హత్యకు గురైనట్లు తెలిపారు. బాన్సువాడ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన మహ్మద్ వసీమోద్దీన్, షేక్‌సమీయోద్దీన్ ఇద్దరూ అన్నదమ్ముళ్ల పిల్లలు. వీరు నిజామాబాద్‌లోని ముస్తాఫా ఫ్లవర్ మర్చంట్‌లో పనికోసం చేరారు. ముస్తఫా వద్ద వసీయోద్దీన్ రెండు సంవత్సరాల క్రితం సమీయోద్దీన్ సమక్షంలో రూ.45వేలు అప్పుగా తీసుకున్నారు. వసీయోద్దీన్ పనిమానివేయడంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ముస్తఫా డిమాండ్ చేశారు. దీంతో ఈనెల 24న వజీయోద్దీన్ ఒక్కడే ముస్తాఫా వద్దకు వెళ్లి రూ.44వేలు కట్టాడు. అనంతరం వసీయోద్దీన్, సమీయోద్దిన్ కాలూరు చౌరస్తాకు వెళ్లి అక్కడ మద్యం కొనుగోలు చేసి తాగారు. (చదవండి: ‘నుడా’ మాస్టర్ ప్లాన్‌కు ప్రభుత్వం ఆమోదం.. ప్లాన్‌లోకి వచ్చిన గ్రామాల జాబితా ఇదే!) అంతలోనే మజాస్ అనే వ్యక్తి సమీయోద్దీన్‌కు ఫోన్‌చేసి రూ.45వేలకుగాను రూ.44వేలు మాత్రమే చెల్లించాడని, రూ.వెయ్యి తక్కువగా ఇచ్చాడని తెలిపాడు. దీంతో డబ్బులు ఎందుకు తక్కువ ఇచ్చావంటూ వసీయోద్దీన్, సమీయోద్దీన్‌ల మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో వసీయోద్దీన్ తన వద్ద ఉన్న కత్తితో సమీయోద్దీన్‌ను ఇష్టంవచ్చినట్లు పోడిచాడు. గొడవను అలీం ఆపేందుకు ప్రయత్నంచేయగా అతన్ని కూడా చంపుతానని బెదిరించాడు. వెంటనే అలీం పారిపోయాడు. సమీయోద్దీన్ అక్కడికక్కడే మరణించాడు. వసీయోద్దీన్ పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న వసీయోద్దీన్‌ను నిజాంసాగర్ బస్టాండ్‌లో పట్టుకొని విచారించారు. హత్యచేసినట్లు అతడు ఒప్పుకోవడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో సీఐ కృష్ణ, ఎస్సై భాస్కరచారి, తదితరులు పాల్గొన్నారు. (చదవండి: మెను ఏదైనా నోరు ఊరాల్సిందే.. అట్లుంటది టేస్ట్ మరి!) -
రాష్ట్రాలకు రూ.1.1 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కింద రాష్ట్రాలకు ఆదాయలోటును పూడ్చేందుకు కేంద్రమే రుణ సమీకరణ చేసేందుకు ముందుకు వచ్చింది. జీఎస్టీ వసూళ్లలో లోటు కారణంగా.. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం పరిహారాన్ని సర్దుబాటు చేయాల్సి ఉంది. అయితే, ఈ మొత్తాన్ని మార్కెట్ నుంచి రుణాల రూపంలో రాష్ట్రాలే తీసుకోవాలని కేంద్రం కోరగా.. కేంద్రం తన పద్దుల కిందే తీసుకుని తమకు నిధులు సమకూర్చాలని కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. అయితే, రాష్ట్రాల తరఫున రుణ సమీకరణకు కేంద్రం నిర్ణయించింది. రూ.1.1 లక్షల కోట్లను రాష్ట్రాల తరఫున కేంద్ర ప్రభుత్వం రుణం కింద సమీకరించి వాటికి సర్దుబాటు చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లో జీఎస్టీ వసూళ్లు ఆశించిన మేర లేవన్న విషయం తెలిసిందే. కరోనా ముందు నుంచే దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడం కూడా వసూళ్లపై ప్రభావం చూపించింది. దీంతో రాష్ట్రాల బడ్జెట్లపై ప్రభావం పడింది. జీఎస్టీ ముందు అయితే లోటును భర్తీ చేసుకునేందుకు వ్యాట్, స్థానిక పన్నులను రాష్ట్రాలు అస్త్రాలుగా వినియోగించుకునేవి. కానీ, ఇప్పుడు ఆ అవకాశాలు చాలా పరిమితం. ‘‘లోటును భర్తీ చేసుకునేందుకు రాష్ట్రాల బడ్జెట్ పరిమితులకు అదనంగా రూ.1.1 లక్షల కోట్ల మేర రుణ సమీకరణకు ప్రత్యేక విండోను ఆఫర్ చేశాము. అంచనా లోటు రూ.1.1 లక్షల కోట్లను అన్ని రాష్ట్రాల తరఫున కేంద్ర ప్రభుత్వమే రుణాలుగా.. పలు విడతల్లో తీసుకుంటుంది. జీఎస్టీ పరిహారం కింద ఆయా రుణాలను రాష్ట్రాలకు బదిలీ చేస్తాము’’ అని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. అయితే, ఈ రుణాలకు వడ్డీ, అసలు చెల్లింపులు ఎవరు చేస్తారన్న విషయాన్ని ఇందులో ప్రస్తావించలేదు. రాష్ట్రాల తరఫున కేంద్ర ప్రభుత్వం రుణాలు తీసుకోవడం వల్ల ఒకటే వడ్డీ రేటుకు వీలు పడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ప్రత్యేక విండో కింద రుణ సమీకరణ ద్రవ్యలోటుపై ఏ మాత్రం ప్రభావం చూపించదని స్పష్టం చేసింది. -
అదనపు రుణ వినియోగంపై ఆంక్షలు లేవు
న్యూఢిల్లీ: రాష్ట్రాలు అదనంగా తీసుకునే 2 శాతం రుణాల వినియోగంపై ఆంక్షలు లేవని కేంద్రం తెలిపింది. అవసరాలకు తగినట్లుగా రాష్ట్రాలు వాడుకోవచ్చంది. ఎప్పటి మాదిరిగా 3శాతం రుణ వినియోగంపై ఆంక్షలు లేవని, అదనంగా ఉండే 2 శాతంలో ఒక శాతం పౌర కేంద్రక సంస్కరణల అమలుకు ఖర్చుపెట్టాల్సి ఉంటుందని ఆర్థికశాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘సాధారణ పరిమితి 3 శాతంపై ఎటువంటి ఆంక్షలు లేవు. స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి(జీఎస్డీపీ)లో అదనంగా పొందే 2 శాతం రుణంలో 0.50 శాతానికి ఎటువంటి నిబంధనలు లేవు. 1 శాతంలో మాత్రం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ఒక్కో సంస్కరణ(వన్ కార్డ్, వన్ నేషన్, స్థానిక సంస్థల బలోపేతం, విద్యుత్ రంగం వంటివి)కు 0.25 శాతం చొప్పున అదనంగా వినియోగించుకోవచ్చు. కేంద్రం సూచించిన ఏవైనా మూడు సంస్కరణలు అమలు చేస్తే మిగతా 0.50 శాతం రుణం అదనంగా వాడుకోవచ్చు’అని ఆ అధికారి వివరించారు. అదేవిధంగా, కేంద్ర పన్నుల్లో ఏప్రిల్, మే నెలలకు గాను రాష్ట్రాల వాటా కింద రూ.92,077 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాలకు ఆసరాగా ఉండేందుకు 2020–21 బడ్జెట్లో ప్రకటించిన మేరకు ఈ మొత్తం విడుదల చేశామని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
పెంటపాడు: పెంటపాడులో ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు పెంటపాడు పోలీసులు తెలిపారు. హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన బొబ్బిలి బాలగంగాధర్‌తిలక్ (33) స్వగ్రామం కొవ్వూరు. ఎనిమిదేళ్లుగా పెంటపాడులో నివాసముంటూ వ్యాన్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా బాలగంగాధరతిలక్ అప్పుల బాధతో సతమతమవుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం భార్యాపిల్లలను కృష్ణా పుష్కరాలకు పంపాడు. రాత్రి ఇంట్లోని గదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందాడు. సమీపంలో ఉండే అతని మేనత్త తలుపు కొట్టగా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించి స్థానికుల సాయంలో తలుపులు పగులకొట్టారు. మృతదేహానికి గూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య వెంకటలక్ష్మి, దుర్గ, మానస అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎస్సై కె.గుర్రయ్య ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు.