boxing association
-
Paris Olympics: పర్వీన్ హుడాపై నిషేధం.. విశ్వ క్రీడలకు దూరం
Parveen Hooda suspended- భారత మహిళా బాక్సర్ పర్వీన్ హుడా పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను కోల్పోయింది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) సస్పెన్షన్ వల్లే ఆమె పారిస్ విశ్వక్రీడలకు దూరం కానుంది.‘వాడా’ రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్టీపీ) నియమావళి ప్రకారం ఆమె ఎప్పుడు ఎక్కడ ఉన్నారనే సమాచారాన్ని ఇవ్వడంలో విఫలమైంది. గత 12 నెలలుగా మూడుసార్లు పరీ్వన్ ఈ సమాచారాన్ని ఇవ్వలేకపోవడంతో ‘వాడా’ ఆమెపై 22 నెలలు నిషేధం విధించింది. పర్వీన్ ఈ తప్పిదాన్ని ఉద్దేశపూర్వకంగా చేయలేదని ‘వాడా’ అధికారులకు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) వివరణ ఇచ్చింది.దాంతో ‘వాడా’ ఈ నిషేధాన్ని 14 నెలలకు కుదించింది. శుక్రవారంతో మొదలైన ఈ నిషేధం వచ్చే ఏడాది జూలై వరకు కొనసాగుతుందని బీఎఫ్ఐ తెలిపింది. గత ఏడాది హాంగ్జౌలో జరిగిన జరిగిన ఆసియా క్రీడల్లో మహిళల 57 కేజీల కేటగిరీలో పర్వీన్ కాంస్య పతకం సాధించి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇక పర్వీన్‌పై నిషేధం నేపథ్యంలో ఇప్పుడు 57 కేజీల విభాగంలో బెర్త్ ఖాళీ అయింది. ఈ క్రమంలో.. పర్వీన్ స్థానంలో జాస్మిన్ లాంబోరియాను బీఎఫ్ఐ.. వరల్డ్ క్వాలిఫయర్-2 బరిలో దించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల, పురుషుల విభాగాలలో ఏడు చొప్పున ఒలింపిక్ వెయిట్ కేటగిరీలు ఉండగా... భారత్ నుంచి ఇప్పటికే ముగ్గురు మహిళా బాక్సర్లు (నిఖత్ జరీన్–50 కేజీలు; ప్రీతి–54 కేజీలు; లవ్లీనా బొర్గొహైన్–75 కేజీలు) పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. పురుషుల విభాగంలో భారత్ నుంచి ఎవరూ అర్హత సాధించలేదు. పర్వీన్‌పై నిషేధం కారణంగా... ఈనెల 23 నుంచి జూన్ 3 వరకు బ్యాంకాక్‌లో జరిగే వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ మహిళల విభాగంలో మూడు వెయిట్ కేటగిరీల్లో (57, 60, 66 కేజీలు), పురుషుల విభాగంలో ఏడు వెయిట్ కేటగిరీల్లో పోటీపడుతుంది. -
బతుకమ్మ కవిత.. బాక్సింగ్ నేత!!
తెలంగాణ జాగృతి.. బతుకమ్మ పండుగలు.. తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక పోరాటం.. ఇన్ని రకాల పాత్రలలో ఒదిగిపోయిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు మరో సరికొత్త పాత్ర పోషించబోతున్నారు. తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్‌కు ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడా సంఘాలలో జరిగిన మార్పులలో ఇదే మొదటిది. తెలంగాణ ఉద్యమానికి స్థానిక సంస్కృతిని జోడించడంలో కవిత ఒకరకంగా విజయం సాధించారనే చెప్పుకోవచ్చు. అంతకుముందు కూడా బతుకమ్మ పండుగను ఎవరికి వారుగా తెలంగాణ ప్రాంతంలో చేసుకునే అలవాటు ఉన్నా, ఉద్యమంలో భాగంగా ఆ పండుగకు కూడా ఒక సామూహిక ఉనికిని తీసుకొచ్చి, బహిరంగ ప్రదేశాలలో బతుకమ్మలు ఆడటం, పూర్ణకుంభ స్వాగతాలకు బదులు బతుకమ్మలతో స్వాగతం పలకడం లాంటి వాటిని ప్రవేశపెట్టి, 'తెలంగాణ సంస్కృతి'ని కవిత బాగా ప్రమోట్ చేశారు. ఇది కూడా తెలంగాణ ఉద్యమానికి మంచి ఊపునిచ్చింది. అలాంటి కవిత.. ఇప్పుడు తెలంగాణ బాక్సింగ్ సంఘానికి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ ఎంపీగా లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె, శుక్రవారం జరిగిన బాక్సింగ్ సంఘ ఎన్నికలలో విజయం సాధించారు. సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎం ధనుంజయ్ గౌడ్ వ్యవహరిస్తారు. దీంతో బతుకమ్మ పండుగ నుంచి బాక్సింగ్ రింగ్ వరకు కవిత ప్రస్థానం సాగినట్లయింది.