OTT: ‘ఏ బాయ్ కాల్డ్ క్రిస్మస్’ మూవీ రివ్యూ
వండర్‌ల్యాండ్‌కు వెళ్లడం ఎవరికైనా ఇష్టమే. వండర్‌ల్యాండ్‌కు వెళ్లే సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. అదే వరుసలోని సినిమా ‘ఏ బాయ్ కాల్డ్ క్రిస్మస్’(A Boy Called Christmas). ఇందులో నికోలస్ అనే 13 ఏళ్ల కుర్రాడు ఏకంగా ఫార్ నార్త్ వరకు ట్రావెల్ చేసి ‘ఎఫెల్మ్’ అనే వండర్ ల్యాండ్‌కి వెళ్ళి తన క్రిస్మస్ విష్ పూర్తి చేసుకుంటాడు. అదెలాగో ఇప్పుడు చెప్పుకుందాం. నికోలస్ అనే కుర్రవాడు వడ్రంగి కొడుకు. వాళ్లు పెద్ద అడవిలో ఉంటారు. రెండేళ్లకు ముందు నికోలస్ తల్లిని ఓ ఎలుగుబంటి చంపేస్తుంది. దాంతో తండ్రి కొడుకు మాత్రమే ఉంటారు. (చదవండి: 'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..?)ఓ రోజు రాజు ఆ రాజ్యంలోని ప్రజలందరికీ ఓ మాట చెబుతాడు. ఎవరైతే ఏదైనా అద్భుతం చేసి రాజ్యంలోని అందరికీ నవ్వు తెప్పిస్తారో వాళ్ళకి మంచి ప్రైజ్ ఉంటుందని అనౌన్స్ చేస్తాడు. ఆ విషయం విని నికోలస్ తండ్రి తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫార్ నార్త్‌లో ఉన్న ఫాంటసీ ఐలాండ్ కి వెళ్ళి అక్కడి నుండి ఏదైనా తీసుకువద్దామని అనుకుంటాడు. (చదవండి: ఆ హీరోయిన్ కంటే ఆమె తల్లే ఎక్కువ ఇష్టం : ఆర్జీవీ)నికోలస్‌కు అతని పిన్ని కార్లట్టాను తోడుగా ఉంచి వెళతాడు.. కాని ఆ పిన్ని చాలా సెల్ఫిష్. నికోలస్ని ఇంటి నుంచి బయటకు వెళ్ళగొడుతుంది. అప్పుడు నికోలస్ తన తల్లి ప్రెజెంట్ చేసిన మఫ్లర్‌ను చూసుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. అనుకోకుండా ఆ మఫ్లర్లో వండర్ ల్యాండ్ ‘ఎఫెల్మ్’కు వెళ్ళే మాప్ కుట్టి ఉంటుంది. ఎలాగైనా తన ఫాదర్‌ని కలవాలని విష్ చేసుకుని ఎఫెల్మ్కు తన జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఈ జర్నీలో ఓ చిన్న ఎలుక కూడా ఉంటుంది. అంతే కాదు ఎలుక చక్కగా మాట్లాడుతూ భలే ఉంటుంది. వండర్ ల్యాండ్ ఎఫెల్మ్లో ఎన్నో మ్యాజిక్స్‌తో సూపర్ గా ఉంటుంది. మరి నికోలస్ విష్ పూర్తవుతుందా అంటే మీరందరూ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఫాంటసీ కిడ్స్ మూవీ ‘ఏ బాయ్ కాల్డ్ క్రిస్మస్’ని చూడాల్సిందే. – ఇంటూరు హరికృష్ణ