boycatt
-
PAC పదవిలో కూడా రాజకీయమా? కూటమి నిర్ణయంపై ఎమ్మెల్యే చంద్రశేఖర్
-
అలిగిన గ్రామీణం.. ఎన్నికల బహిష్కరణ మంత్రం
Rajasthan elections 2023: ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మిజోరాం, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఇప్పటికే ఎన్నికలు పూర్తవ్వగా తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఐదేళ్లకు ఒక సారి వచ్చే ఎన్నికల ద్వారా తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. అయితే ప్రభుత్వాల ఉదాసీనత, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో విసుగు చెందిన పలు గ్రామాలు ఏకంగా ఎన్నికలనే బహిష్కరిస్తున్నాయి. శనివారం జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను ఆ రాష్ట్రంలోని అనేక గ్రామాలు బహిష్కరించాయి. తాగునీటి సమస్యపై.. హనుమాన్‌గఢ్ జిల్లాలోని టిబ్బి తహసీల్ పరిధిలోని దౌలత్పురాలో తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు జిల్లా అదనపు కలెక్టర్ కపిల్ యాదవ్‌కు మెమోరాండం సమర్పించారు. గ్రౌండ్ లెవల్లో దెబ్బతిన్న వాటర్ ట్యాంక్, ఫిల్టర్లను పునర్నిర్మించకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోమని మెమోరాండంలో పేర్కొన్నారు. అలాగే శ్రీగంగానగర్ జిల్లాలోని సూరత్‌గఢ్ తహసీల్‌కు చెందిన తుక్రానా పంచాయతీ ఫరీద్సర్ గ్రామ ప్రజలు కూడా తాగునీటి సమస్యపై నిరసనగా ఓటింగ్‌ను బహిష్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ విషయాన్ని వారు సూరత్‌గఢ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సందీప్ కుమార్‌కు మెమోరాండం ద్వారా తెలియజేశారు. ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజా ప్రతినిధులపై ఆగ్రహంతో కూడిన వాతావరణం కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం భిల్వారా జిల్లా నుంచి తొలగించి షాపురా జిల్లాలో చేర్చిన ఎనిమిది గ్రామ పంచాయతీల ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించారు. భిల్వారాను విభజించి షాపురా జిల్లాను ఏర్పాటు చేసినప్పుడు మండల్గర్ సబ్‌డివిజన్‌లోని 16 పంచాయతీలు షాపురా జిల్లాలో చేర్చారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనల తరువాత, ప్రభుత్వం వీటిలో ఎనిమిది పంచాయతీలను తిరిగి భిల్వారాలో చేర్చింది. మిగిలిన ఎనిమిది షాపురాలోనే ఉన్నాయి. దీంతో ఆ గ్రామాల ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించి రాజకీయ పార్టీల నేతలను గ్రామాల్లోకి రానివ్వకుండా పోస్టర్లు అంటించి నిరసనలు చేపట్టారు. ఏకంగా 50 గ్రామాలు ఇక జైసల్మేర్ జిల్లాలోని సోను గ్రామంలో గత రెండు నెలలుగా సమ్మె చేస్తున్న ట్రక్కు డ్రైవర్లకు సంఘీభావంగా 50 గ్రామాలు ఎన్నికల బహిష్కరణను ప్రకటించాయి. సోను గనుల నుంచి సున్నపురాయిని రవాణా చేయడానికి ఈ ప్రాంతంలో దాదాపు 400 ట్రక్కులు ఉన్నాయి. ట్రక్కు డ్రైవర్లు సరుకు రవాణా ఛార్జీలను టన్నుకు రూ.3 పెంచాలని కోరుతున్నారు. అయితే రాజస్థాన్ స్టేట్ మైన్స్ అండ్ మినరల్స్ లిమిటెడ్ కాంట్రాక్టర్ డిమాండ్‌ను అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు సమీపంలోని 50 గ్రామాల ప్రజలు లారీ డ్రైవర్లకు మద్దతుగా నిలిచారు. సికార్ జిల్లాలోని నీమ్ కా థానా తహసీల్‌కు చెందిన లాడి కా బస్ గ్రామస్థులు తమ గ్రామ పంచాయతీని అజిత్‌గఢ్ పంచాయతీ సమితి నుంచి తొలగించి పటాన్ పంచాయతీ సమితిలో తిరిగి చేర్చాలని కోరుతూ ఎన్నికల బహిష్కరణ ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ డిమాండ్‌ను లేవనెత్తుతూ గ్రామస్తులు ఆరుసార్లు ఎన్నికలను బహిష్కరించారు. రోడ్డు సమస్య.. ఝలావర్ జిల్లాలోని ఓద్పూర్ గ్రామస్థులు రాష్ట్ర రహదారికి సరైన రహదారిని అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తూ ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించారు. అదేవిధంగా కోటా జిల్లాలోని సంగోడ్ తహసీల్‌లోని లాడ్పురా రైతులు తమను చంబల్ నది నుంచి నీటిని వాడుకునేందుకు అనుమతించకపోవడంతో ఎన్నికలను బహిష్కరించారు. టోంక్ జిల్లాలోని డియోలి గ్రామస్తులు తమ రోడ్డును బాగు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు ప్రధాన మార్గాల్లో కాంక్రీట్ రోడ్లు నిర్మించకపోతే బహిష్కరిస్తామని టోంక్ జిల్లాలోని సీసోలా ప్రజలు హెచ్చరించారు. అదే విధంగా ధోల్పూర్ జిల్లా బసేరి అసెంబ్లీ నియోజకవర్గం చంద్రావళి గ్రామ ప్రజలు దశాబ్ద కాలంగా తమ గ్రామ రహదారికి మరమ్మతులు చేపట్టలేదని బహిష్కరించాలని నిర్ణయించారు. ఇక భిల్వారాలోని 43వ వార్డు ప్రజలు ఎన్నికల బహిష్కరణను ప్రకటించడమే కాకుండా రాజకీయ నేతలను తమ వార్డులోకి రాకుండా అడ్డుకున్నారు. రాజకీయ నేతలను హెచ్చరిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. జైపూర్ జిల్లాలోని పాలావాలా జతన్ గ్రామస్థులు ఆ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికలను బహిష్కరించారు. ఒక్క ఓటరు కూడా పోలింగ్ బూత్‌వైపు కన్నెత్తి చూడలేదు. తమ గ్రామాన్ని సమీపంలోని తూంగా గ్రామంతో కలుపుతూ రోడ్డు వేయాలని పాలావాలా జతన్ గ్రామస్తులు అనేక ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడే కాదు.. గత ఏడు పర్యాయాలుగా ఈ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరిస్తూనే ఉన్నారు. -
డొమినో ఎఫెక్ట్ గురించి ఆందోళన చెందడం లేదు!!
బీజింగ్: బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యపరమైన బహిష్కరణల "డొమినో ఎఫెక్ట్" గురించి తాము ఆందోళన చెందడం లేదని చైనా పేర్కొంది. ఈ మేరకు పశ్చిమ ప్రాంతమైన జిన్జియాంగ్లో చైనా మానవ హక్కుల "దౌర్జన్యాలు" కారణంగా చైనాలో జరుగుతున్న ఒలింపిక్ క్రీడలకు తమ ప్రభుత్వ అధికారులు హాజరుకావడం లేదని అమెరికా దౌత్యపరమైన బహిష్కరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాము డొమినో ప్రభావం గురించి ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ అన్నారు. అంతేకాదు ప్రపంచంలోని చాలా దేశాలు బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు మద్దతు తెలిపాయంటూ సమర్థించే ప్రయత్నం చేశారు. అయితే దేశాలన్ని రాజకీయాలకు అతీతంగా ఈ అంతర్జాతీయ క్రీడలకు ఏకంకావాలని పిలువపునివ్వడమే కాక అందుకై 170కి పైగా దేశాలు చేసిని తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి ఆమోదించిన విషయాన్ని వాంగ్ ప్రస్తావించారు. అంతేకాదు కొంతమంది విదేశీ నాయకులు, రాజ కుటుంబాల సభ్యులు ఈ ఒలింపిక్ క్రీడలకు హాజరు కావడానికి నమోదు చేసుకున్నారని ఆయన చెప్పారు. ఈ క్రమంలో చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ప్రధాన దేశానికి బహిరంగంగా ఆహ్వానాన్ని అంగీకరించిన ఏకైక నాయకుడు అని ప్రశంసించారు. అమెరికా మాదిరిగానే బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తమకు బ్రిటన్, కెనడా దేశాల అధికారులను క్రీడలకు ఆహ్వానించే ఆలోచన చైనాకు లేదని వాంగ్ స్పష్టం చేశారు. అంతేకాదు అమెరికా దాని మిత్ర దేశాలు తమ రాజకీయ ఎత్తుగడ కోసం ఒలింపిక్ క్రీడలను వేదికగా ఎంచుకున్నాయని, అందుకు ఆయా దేశాలు తగిన మూల్యం చెల్లించుకుంటాయని వాంగ్ విరుచుకుపడ్డారు -
అమెరికా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ
US Diplomatic Boycott Of Beijing Winter Olympics: అమెరికా 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యసంబంధమైన బహిష్కరణ(డిప్లొమేటిక్ బాయ్‌కాట్) చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీసీ) పేర్కొంది. ఈ మేరకు దౌత్యవేత్తలు అయిన ప్రభుత్వ అధికారుల ఉనికి ప్రతి దేశ ప్రభుత్వానికి పూర్తిగా రాజకీయ నిర్ణయం అని అందువల్ల ఆయా దేశాల రాజకీయ తటస్థ వైఖరిని పూర్తిగా గౌరవిస్తాం అని ఐఓసీ ప్రతినిధి అన్నారు. (చదవండి: దేనికైనా రెడీ అంటూ!... సింహానికి సవాలు విసురుతూ... ఠీవిగా నుంచుంది కుక్క!!) అయితే ఈ దౌత్యపరమైన బహిష్కరణ అనేది యూఎస్ అథ్లెట్లు పోటీ పడకుండా నిరోధించే చైనా మానవ హక్కుల రికార్డుకు క్రమాంకనం చేసిన మందలింపు చర్యగా యూఎస్ అభివర్ణించింది. అంతేకాదు దౌత్యపరమైన బహిష్కరణ అంటే ఈ ఒలింపిక్ క్రీడలు ప్రారంభ, ముగింపు కార్యక్రమాల్లో అమెరికా దౌత్య అధికారులను పంపకుండా ఒలింపిక్ ప్రాధాన్యతను తగ్గించేలా చైనాతో నేరుగా ఢీ కొనే పరంపరలో అమెరికా తీసుకున్న తొలి నిర్ణయం ఇది. వాయువ్య జిన్జియాంగ్ ప్రాంతంలో ఉయ్ఘర్ ముస్లింలపై చైనా మారణకాండకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే వింటర్ ఒలింపిక్స్ క్రీడలపై ఎటువంటి నిర్ణయం తీసకువాలని వాషింగ్టన్ నెలల తరబడి తర్జనభర్జనలు పడిన తర్వాత ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. ఈ మేరకు ఐఓసీ కూడా అమెరికా ప్రభుత్వ ప్రకటన మేరకు ఒలింపిక్ క్రీడలు, అథ్లెట్ల భాగస్వామ్య రాజకీయాలకు అతీతమైనదని, పైగా దీనిని తాము స్వాగతిస్తున్నాం అని తెలపడం విశేషం. అంతేకాదు యూఎన్ జనరల్ అసెంబ్లీలో దాదాపు 193 సభ్య దేశాల ఏకాభిప్రాయంతో 173 సభ్య దేశాలు సహకారంతో ఈ తీర్మానాన్ని ఆమోదించినట్లు ఐఓసీ తెలిపింది. అయితే చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అటువంటి బహిష్కరణ అమలు చేస్తే "నిశ్చయమైన ప్రతిఘటన" ఉంటుందంటూ ముందుగానే బెదిరించింది. (చదవండి: ఆ షార్క్ చేప వాంతి చేసుకోవడంతోనే మిస్టరీగా ఉన్న హత్య కేసు చిక్కుముడి వీడింది!!) -
వైఎస్ఆర్సీపీ నిర్ణయం.. చరిత్రాత్మకం
-
వైఎస్ఆర్సీపీ నిర్ణయం.. చరిత్రాత్మకం
సాక్షి, శ్రీకాకుళం : ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ నిర్ణయం చరిత్రాత్మకమని ఆ పార్టీ నేత తమ్మినేని సీతారాం అభివర్ణించారు. సోమవారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపక్ష సభ్యుల పేర్లను, స్థానాలను అసెంబ్లీ ప్రకటించాల్సిన అవసరం ఉందని అన్నారు. లేకపోతే కళంకిత స్పీకర్ గా కోడెల చరిత్రలో మిగిలిపోతారని తమ్మినేని తెలిపారు. పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధమన్న ఆయన, అలాంటివాళ్లు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటే ప్రజల తీర్పును అగౌరవపరిచినట్లేనన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న వారి తీరుకు నిరసనగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ నిర్ణయం తీసుకుందన్నారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించటం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఫిరాయింపులపై మీడియా ముందుకు చర్చకు రావాలని ఆయన సవాలవిసిరారు. 3 వేల కిలోమీటర్ల పాదయాత్రతో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ప్రజా సంఘాలతో మొత్తం 185 సమర్వేశాలు నిర్వహిస్తామని.. రచ్చబండ, పల్లెనిద్ర ద్వారా ప్రతీ పౌరుడికి చేరువవుతామని తమ్మినేని ప్రకటించారు. -
ఖాళీబిందెలతో రాస్తారోకో
– కొందుర్గులో రెండు గంటల పాటు ఆందోళన – నీటి సమస్య తీర్చాలని రోడ్డెక్కిన గ్రామస్తులు – భారీగా నిలిచిన వాహనాలు – వారంరోజుల్లో సమస్యను పరిష్కరిస్తాం : అధికారులు కొందుర్గు : గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తు సోమవారం మండల కేంద్రంలోని ముఖ్య కూడలిలో గ్రామస్తులు రోడ్డెక్కారు. మహిళలు ఖాళీబిందెళతో రోడ్డుపై బైఠాయించారు. ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు రాస్తారోకో చేశారు. దీంతో రోడ్డుపై వెళ్లే వాహనాలు వందల సంఖ్యలో నిలిచిపోయాయి. ఈ ఆందోళన కార్యక్రమానికి బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు బోయ శంకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దత్తత తీసుకున్న గ్రామంలోనే నీటి సమస్య ఇలా ఉంటే పట్టించుకునేవారే కరువయ్యారని ఆరోపించారు. కొందుర్గు గ్రామానికి పక్కనే ఉన్న పరిశ్రమల్లో పుష్కలంగా నీళ్లు ఉంటాయి.. కాని కొందుర్గులో తాగడానికి మంచి నీళ్లు దొరకని దుస్థితి నెలకొందన్నారు. గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో తీవ్ర నీటి సమస్య నెలకొన్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నీటి సమస్య తీర్చేవరకు కదిలేదిలేదని బీష్మించుకొని కూర్చున్నారు. దీంతో తహసీల్దార్ పాండు, ఎంపీడీఓ యాదయ్య, ఈఓఆర్డీ యాదగిరిగౌడ్ పంచాయతీ కార్యదర్శి అనూష, వీఆర్ఓ శ్రావణ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తహసీల్దార్ పాండు, ఎంపీడీఓ యాదయ్య గ్రామస్తులతో మాట్లాడారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మానమ్మ, బీజేపీ నాయకులు ప్రేమ్‌కుమార్, సత్యనారాయణ, శేఖర్, శ్రీశైలం, శ్రీనన్న యువసేన నాయకులు శ్రీకాంత్, బీఎస్పీ నాయకులు రామస్వామి తదితరులు ఉన్నారు.