ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడి గొడవ
ఆదిలాబాద్ : సాదారణంగా ప్రియుడి ఇంటి ముందు పెళ్లి చేసుకోమని ప్రియురాలు గొడవ చేయడం, మౌనపోరాటం చేయడం మనం వింటుంటాం, చూస్తుంటాం. ఆదిలాబాద్ జిల్లాలో సీన్ రివర్స్ అయింది. ఇక్కడ పెళ్లి చేసుకోవాలని ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడు గొడవకు దిగాడు.
మందమర్రి మండలం రామకృష్ణాపూర్లో యువతీయువకులు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి యువతి నిరాకరించింది. దాంతో ఆ యువకుడు ప్రియురాలి ఇంటి ఎదుట గొడవకు దిగాడు. తనను పెళ్లి చేసుకోవాలని తన మిత్రులతో కలిసి గొడవ చేశాడు. యువతి కుటుంబ సభ్యులు ఆ యువకుడికి దేహశుద్ధి చేసి పంపారు.