బీపీటీ కౌన్సెలింగ్లో 498 సీట్ల భర్తీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఐదు ఆన్లైన్ కేంద్రాల్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న పారా మెడికల్ కౌన్సెలింగ్లో భాగంగా ఆదివారం జరిగిన బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెర పీ) కౌన్సెలింగ్లో 498 సీట్లు భర్తీ అయినట్లు క్యాంపు అధికారి డాక్టర్ టి.మురళీమోహన్ తెలిపారు.
జేఎన్టీయూ (హైదరాబాద్) కేంద్రంలో 394, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 236, ఏయూ (విశాఖపట్నం)లో 83, ఎస్వీయూ(తిరుపతి)లో 147, కాకతీయ యూనివర్సిటీ (వరంగల్) కేంద్రంలో 93 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. హెల్త్ యూనివర్సిటీలో రెండో విడత ఎంపీటీ (ఫిజియోథెరపీ) కౌన్సెలింగ్ ముగిసింది. సోమవారం బీఎస్సీ (ఎంఎల్టీ) కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.