BR-V
-
హోండా కార్ల ధరలు పెరిగాయ్..
సాక్షి, న్యూఢిల్లీ : హోండా కార్ల ఇండియా కూడా తన మోడల్స్ ధరలను పెంచేసింది. జీఎస్టీ సెస్‌కు అనుగుణంగా ధరలను పెంచుతున్నట్టు ఈ కంపెనీ కూడా ప్రకటించింది. సిటీ, బీఆర్-వీ, సీఆర్-వీ మోడల్స్‌పై రూ.7,003 నుంచి రూ.89,069 మధ్యలో ధరలను పెంచుతున్నట్టు తెలిపింది. సెప్టెంబర్ 11 నుంచి ఈ సమీక్షించిన ధరలు అమల్లోకి తెస్తున్నామని హోండా కార్ల ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. జీఎస్టీలో 2-7 శాతం అదనపు సెస్ భారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. తన మిడ్‌సైజు సెడాన్ సిటీ ధరలు వేరియంట్లను బట్టి రూ.7,0003 నుంచి రూ.18,791 వరకు పెరిగాయి. ఎస్యూవీ బీర్-వీ ధరలను రూ.12,490 నుంచి రూ. 18,242 మధ్యలో పెంచింది. అదేవిధంగా ప్రీమియం ఎస్యూవీ సీఆర్-వీ ధరలను రూ.75,304 నుంచి రూ.89,069 వరకు పెంచుతున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ వారం ప్రారంభంలో టయోటా కిర్లోస్కర్ మోటార్ కూడా ఎంపికచేసిన మోడల్స్‌పై ధరలను రూ.13వేల నుంచి రూ.1.6 లక్షల వరకు ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వం సెస్‌ను పెంచడంతో మిడ్‌సైజు కార్ల జీఎస్టీ రేటు 45 శాతం, పెద్ద కార్ల జీఎస్టీ రేటు 48 శాతం, ఎస్యూవీ రేటు 50 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. -
మార్కెట్లోకి హోండా చౌక ఎస్యూవీ ... బీఆర్-వీ
ధరలు రూ.8.75 లక్షల నుంచి రూ.12.9 లక్షల రేంజ్లో ఎస్యూవీ ప్రత్యేకతలు...: 4 వేరియంట్లలలో లభ్యమయ్యే ఈ ఎస్‌యూవీలో బ్లాక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, స్టార్ట్/స్టాప్ బటన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ తదితర ఫీచర్లున్నాయి. పెట్రోల్ వేరియంట్ మైలేజీ 16 కిమీ కాగా... డీజిల్ వేరియంట్ 21.9 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది. న్యూఢిల్లీ: హోండా కార్స్ ఇండియా... బీఆర్-వీ మోడల్‌తో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ) సెగ్మెంట్లో ప్రవేశించింది. ఈ ఎస్‌యూవీని పెట్రోల్ డీజిల్ వేరియంట్లలో అందిస్తున్నామని హోండా కార్స్ ఇండియా తెలిపింది. పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ.8.7 లక్షల నుంచి రూ.11.84 లక్షలు, డీజిల్ వేరియంట్ల ధరలు రూ.9.9 లక్షల నుంచి రూ.12.9 లక్షల రేంజ్లో ఉన్నాయని హోండా కార్స్ ఇండియా(హెచ్‌సీఐఎల్) ప్రెసిడెంట్, సీఈఓ యోచిరో యుఇనో పేర్కొన్నారు. ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.11.99 లక్షలని (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) పేర్కొన్నారు. హ్యుందాయ్ క్రెటా, రెనో డస్టర్ ఎస్‌యూవీలకు ఈ బీఆర్-వీ ఎస్యూవీ గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి.