brahmostavaalu
-
ఘనంగా కోదండరామస్వామి ధ్వజారోహణం
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి
సాక్షి,అమరావతి/తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ఏటా నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌లు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వారు సీఎం వైఎస్ జగన్‌ను గురువారం కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు శ్రీవారి ప్రసాదాలు అందజేసి, బ్రహ్మోత్సవాలకు హాజరై సంప్రదాయం ప్రకారం స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించాలని ఆహ్వానించారు. వారి వెంట టీటీడీ అడిషనల్ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఉన్నారు. (చదవండి: రూ. 23.78 కోట్ల జీఎస్టీ రద్దు చేయండి) శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ ఈ నెల 19 నుంచి 27 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం శుక్రవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య అంకురార్పణ జరగనుంది. ఈ సందర్భంగా వేదపండితులు శ్రీ విష్వక్సేనుల వారిని రంగనాయకుల మండపంలోకి వేంచేపు చేస్తారు. వైఖానస ఆగమనాన్ని పాటించే తిరుమల, ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒకరోజు ముందు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే, బ్రహ్మోత్సవాలకు 19న సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు పెద్దశేష వాహన సేవ ఉంటుంది. కరోనా నేపథ్యంలో ఈ బ్రహ్మోత్సవాలను టీటీడీ ఏకాంతంగా నిర్వహించనుంది. టీటీడీలో కొత్తగా 8 పోస్టులు మరోవైపు అమరావతి బోర్డ్ నిర్ణయం మేరకు ప్రభుత్వం టీటీడీలో కొత్తగా 8 పోస్టులు సృష్టించింది. టీటీడీ నగలు విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు బోర్డు ఇప్పటికే కొత్తగా చీఫ్ జ్యుయెలరీ ఆఫీసర్, జ్యుయెలరీ ఆఫీసర్, రెండు ఏఈఓ, 4 జ్యుయెలరీ అప్రైజర్ పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. -
కల్పవృక్షంపై కమలాకాంతుడు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు గురువారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారు కోర్కెలు తీర్చే కల్పవృక్ష వాహనంపై తిరువీధుల్లో విహరించారు. చర్నాకోలు చేతబట్టి రాజమన్నార్ అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. గజరాజులు, అశ్వాలు ఠీవీగా ముందు కదులుతుండగా, మంగళవాయిద్యాలు, వేదఘోష, అశేష భక్తుల గోవిందనామస్మరణ నడుమ వాహనసేవ కనులపండువగా సాగింది. భక్తుల కోలాటాలు, కళా ప్రదర్శనలు కట్టిపడేశాయి. రాత్రి ఉభయ దేవేరులతో కలసి సర్వ భూపాల వాహనంపై విహరిస్తూ స్వామివారు భక్తులను కటాక్షించారు. –తిరుమల సాక్షి, తిరుపతి : తుమ్మలగుంటలో బ్రహ్మోత్సవం కనుల పండువగా సాగుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం ఉదయం కల్పవృక్షం, రాత్రి సర్వభూపాల వాహనాలపై స్వామివారు దర్శనమిచ్చారు. ఉదయం కల్పవృక్ష వాహన సేవలో భక్తులు అధిక సంఖ్యలో కనిపించారు. రాత్రి సర్వభూపాల వాహన సేవలో అంతకంటే ఎక్కువ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. వాహనసేవలో వీఐపీలు తుమ్మలగుంట కల్యాణ వెంకన్నను గురువారం పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, బ్రహ్మర్షి ఆశ్రమ పీఠాధిపతి గురువానంద గురూజీ, ఎంపీ రెడ్డెప్ప దర్శించుకున్నారు. వెంకన్న ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రభుత్వ విప్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. చెవిరెడ్డితో కలిసి వారు కల్యాణ వెంకన్నకు ప్రత్యేక పూజలు చేశారు. కల్పవృక్ష వాహన సేవలో పెద్దిరెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం ఉదయం కల్ప వృక్ష వాహన సేవలో పాల్గొన్నారు. సర్వ భూపాల వాహన సేవలో నారాయణస్వామి, గురువానంద గురూజీ గురువారం రాత్రి సర్వభూపాల వాహన సేవలో సీ.రామాపురం బ్రహ్మర్షి ఆశ్రమ పీఠాధిపతి గురువానంద గురూజీ, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ రెడ్డెప్ప పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు వాహన సేవల ముందు సంగీత, సాంస్కృతిక కళాబృందాల ప్రదర్శనలు భక్తులను కట్టిపడేస్తున్నాయి. భజన కళాకారుల నృత్యాలు, డప్పువాయిద్యాలు, తాళం వేస్తూ ఒకరికొకరు పోటీ పడుతూ భక్తి పారవశ్యంలో ముంచెత్తారు. నేడు గరుడసేవ బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజు గరుడవాహనంపై స్వామి దర్శనమిస్తారు. శుక్రవారం రాత్రి 7గంటలకు ఈ వాహన సేవ ప్రారంభమవుతుందని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తిరుపతి వెస్ట్ డీఎస్పీ నరసప్ప ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. -
నేటి నుంచి రాజన్న బ్రహ్మోత్సవాలు
కరీంనగర్ (వేములవాడ): కరీంనగర్ జిల్లా వేములవాడలోని రాజన్న సన్నిదిలో పార్వతి పరమేశ్వరుల కల్యాణం ఆదివారం అంగరంగవైభవంగా ప్రారంభమైంది. ఐదురోజుల పాటు జరిగే రాజన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శివ పార్వతుల వివాహవేడుక జరగనుంది. ముక్కంటి కళ్యాణాన్ని తిలకించడానికి ఉదయం నుంచే లక్షలాది భక్తులు వేములవాడ రాజన్న ఆలయంలో బారులు తీరుతున్నారు.