ముగిసిన సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
అమరాపురం : మండలంలోని హేమావతిలో సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. గత నెల 24న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు పది రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముగింపు రోజు శయనోత్సంలో భాగంగా స్వామివారికి అర్చకులు, సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం తదితర పూజలు చేశారు. అనంతరం భక్తులు తెచ్చిన వివిధ పూలతో ప్రత్యేకంగా అలంకరించి మహామంగళహారతి ఇచ్చారు. భక్తులు పరస్పరం రంగులు చల్లుకొని సంబరాలు చేసుకున్నారు. బ్రహ్మోత్సవాల విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆలయ ఈఓ శ్రీనివాసులు, సర్పంచ్ సదాశివ కృతజ్ఞతలు తెలిపారు.