సీఎం పర్యటనలో స్వల్ప మార్పు
చిత్తూరు (అగ్రికల్చర్): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఒక ప్రకటనలో తె లిపారు. ముందుగా నిర్ణయిం చిన ప్రకారం సీఎం కుప్పం బ్రాంచి కెనాల్ పనుల ఏరియల్ సర్వే, బంగారుపాళెంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా వీటిని రద్దుచేశారు. ముఖ్యమంత్రి తాజా పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. సీఎం బెంగళూరు నుంచి శనివారం ఉదయం 11.30 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు మదనపల్లెలోని కోళ్లబైలు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.15 నుంచి 1.30 గంటల వరకు హంద్రీ-నీవా కాలువ పనులు పరిశీలిస్తారు. కాలువ పనులకు సంబంధించి ఏర్పాటు చేసి న ఫొటో ప్రదర్శనను తిలకిస్తారు. 1.30 నుంచి 2 గంటల వరకు రిజర్వు చేశారు. 2.30 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి చిత్తూరు మెసానికల్ గ్రౌండులోని హెలిపాడ్‌కు చేరుకుంటారు.
అక్కడి నుంచి 2.35 గంటలకు బయలుదేరి 2.45 గంటలకు నగరంలోని పుత్తూరు రోడ్డులో ఉన్న ఆర్ఎల్ కల్యాణమండపానికి వెళతారు. అక్కడ నీటి సంరక్షణ పనులపై అవగాహన సదస్సులో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4.35 గంటలకు మెసానిక్ గ్రౌండులోని హెలిపాడ్‌కు చేరుకుంటారు. 4.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5.15 గంటలకు తిరుపతి ఎన్టీఆర్ మైదానం చేరుకుంటారు. 6.30 నుంచి 7.30 గంటల వరకు రిజర్వు చేశారు. 7.30 గంటలకు బయలుదేరి 8.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని 8.30 గంటలకు విజయవాడకు బయలుదేరి వెళతారని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం చిత్తూరుకు విచ్చేస్తున్న సందర్భంగా అధికారులు, పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు. రెండు రోజుల క్రితం చిత్తూరు కోర్టు ఆవరణలో సంభవించిన బాంబు పేలుడు సంఘటన దృష్ట్యా గట్టి భద్రతా ఏర్పాట్లను పోలీసులు చేపట్టారు. చిత్తూరులోని మెసానికల్ గ్రౌండుకు హెలికాప్టర్ ట్రయల్‌ను నిర్వహించారు. గ్రౌండు నుంచి కల్యాణ మండపం వరకు సీఎం కాన్వాయ్ ట్రయల్‌ను నిర్వహించారు.