Brand factory
-
బ్రాండ్ ఫ్యాక్టరీ అన్‌లాక్ సేల్ మోడళ్లు సందడి
-
బ్రాండ్ ఫ్యాక్టరీ.. 2 కొంటే 3 ఉచితం
హైదరాబాద్: ఫ్యూచర్‌గ్రూప్ స్టోర్స్ బ్రాండ్ ఫ్యాక్టరీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కస్టమర్లకు ఆఫర్‌ను ప్రకటించింది. బ్రాండ్ ఫ్యాక్టరీలో ‘‘2 కొంటే 3 ఉచితం’’ ఆఫర్‌ను ప్రారంభిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్ట్ 16వరకు కొనసాగే ఈ ఆఫర్లో భాగంగా 200కు పైగా విదేశీ, దేశీయ బ్రాండ్లను తక్కువ ధరకే అందిస్తున్నట్లు పేర్కొంది. కస్టమర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని అసిస్టెడ్ షాపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు బ్రాండ్ ఫ్యాక్టరీ సీఈవో సురేష్ నద్వానీ తెలిపారు. ఇందుకు కస్టమర్లు 7506313001కి మిస్‌కాల్ ఇచ్చి అపాయింట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని నద్వానీ పేర్కొనారు. -
షాపులోకి వెళ్లాలంటే ఎంట్రీ ఫీ కట్టాలి
ముంబై : అశోక్ బియానీ ఫ్యూచర్ గ్రూప్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. మరే ఇతర రిటైలర్ అవలంభించని విధానాన్ని ఫ్యూచర్ గ్రూప్ సంస్థ ప్రవేశపెడుతోంది. ఈ ఏడాది ప్రమోషన్ క్యాంపెయిన్ నిర్వహించే ఐదు రోజుల్లో బ్రాండ్ ఫ్యాక్టరీ ప్రవేశానికి ప్రత్యేక ఫీజులు విధించనున్నట్టు పేర్కొంది. రూ.100-250 మధ్యలో ఈ ఫీజులు ఉండబోతున్నాయని తెలిపింది. నవంబర్ 22 నుంచి 26 వరకు బ్రాండ్ ఫ్యాక్టరీలో భారీ డిస్కౌంట్లతో ఆఫర్లు ప్రకటించింది. రూ.5000 విలువైన వస్తువులను రూ.2000కే ఇవ్వనుంది. ఉచిత వాణిజ్యం, గిఫ్ట్వోచర్లు, క్యాష్‌బ్యాక్ రూపంలో కంపెనీ ఈ నగదును తిరిగి అందించనుంది. ప్రవేశ ఫీజులను రిడీమ్ చేసుకొనే అవకాశం కూడా కల్పించింది. 'మేం డబ్బు తిరిగి చెల్లిస్తున్నాం కాబట్టి ప్రవేశ ఫీజులను వసూలు చేస్తున్నట్టు కాదు' అని సంస్థ సీఈవో కిశోర్ బియాని చెప్పారు. ఇది ఆన్లైన్లో ఫ్రీ బుకింగ్ వంటిదన్నారు. సీరియస్ కస్టమర్ల సౌలభ్యం కోసమే ప్రవేశ ఫీజులను విధిస్తున్నామని, వారికి ప్రత్యేకంగా సేవలు అందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. గతేడాది ఆఫర్ల రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న జనాలుబ్రాండ్ ఫ్యాక్టరీ స్టోర్లకు పోటెత్తారు. జనాలు భారీ ఎత్తున్న రావడంతో, వారందరికీ సేవలు అందించడం కష్టమైందని తెలిపారు. ఈ ఈవెంట్లో భాగంగా బ్రాండు ఫ్యాక్టరీ అవుట్లెట్లకు 12 లక్షల మంది వినియోగదారులు వస్తారని అంచనా. గతేడాది ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయని, కస్టమర్లందరికీ సేవలందించడం కుదరలేదని బ్రాండ్ ఫ్యాక్టరీ బిజినెస్ హెడ్ సురేశ్ సాధ్వాని చెప్పారు. తమ నమ్మకమైన వినియోగదారులకు మంచి షాపింగ్ అనుభూతి కల్పించేందుకే ప్రవేశ ఫీజులను విధిస్తున్నామని తెలిపారు. ఐదు రోజుల షాపింగ్ ప్రీ-షాపింగ్ డేస్‌లో రూ.200 కోట్ల అమ్మకాలను చేధించాలని బ్రాండ్ ఫ్యాక్టరీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. -
బ్రాండ్ ఫ్యాక్టరీలో మేనేజర్ వికృత చేష్టలు
హైదరాబాద్: బాత్రూమ్లో ఉండగా అమ్మాయిలను మేనేజర్ చిత్రీకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మేనేజర్ వికృతచేష్టలు ఎల్బీనగర్ బ్రాండ్ ఫ్యాక్టరీలో చోటు చేసుకున్నాయి. బ్రాండ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఐదుగురు అమ్మాయిలను బాత్ రూమ్ లో ఉండగా చిత్రీకరించి, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఎల్పీనగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మేనేజర్ సాగర్ వేరే అమ్మాయితో వీడియోలు తీయించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్రీకరించిన వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఎల్బీనగర్ పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది.