Braslets
-
టేప్ రోల్ మాదిరి బ్రాస్లెట్..ఖరీదు ఏకంగా..!
కొన్ని ప్రముఖ బ్రాండ్లు ఉత్పత్తి చేసే ప్రొడక్ట్‌లు చాలా లగ్జరియస్‌గా ఉంటాయి. వాటి ధరలు చూస్తే కళ్లు చెదిరిపోతాయి. అయితే ఒక్కోసారి అంత ప్రముఖ బ్రాండ్లు కూడా ఎంత విచిత్రాతి విచిత్రమైన ప్రొడక్ట్‌లను ఉత్పత్తి చేస్తాయో చూస్తే మాత్రం ఇదేంటీ? అనిపిస్తుంది. అలాంటి మాదిరి ప్రొడక్టనే మార్కెట్లోకి విడుదల చేసంది ప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్ కంపెనీ. అయితే ప్రొడక్ట్‌ని చూసిన జనం మండిపడుతున్నారు. ఎందుకంటే.. హై ఎండ్ ఫ్యాషన్ బ్రాండ్లకు పేరుగాంచిన బాలెన్సీగా ఓ విచిత్రమైన ప్రొడక్టను విడుదల చేసింది. ఈ నెల ప్రారంభంలో పారిస్ ఫ్యాషన్ వీక్ ఫాల్/వింటర్ 2024 సందర్భంగా సరికొత్త ఫ్యాషన్ బ్రాసెలెట్ని మార్కెట్లోకి విడుదల చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో బ్రాస్లెట్ చూడటానికి ఎలా ఉందంటే.. టేప్రోల్ మాదిరిగి ఉండటంతో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇదేం బ్రాస్లెట్ అని సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. ఇంత లగ్జరియస్ బ్రాండ్ మరీ ఇంత చీఫ్‌గా ఇలాంటి ప్రొడక్ట్‌లను తీసుకొస్తుందా అని మండిపడ్డారు. పైగా ఆ బ్రాస్‌లెట్‌పై బ్రాండ్ లోగో క్లియర్‌గా ఉంది. కాబట్టి ఆ ఫ్యాషన్ కంపెనీ ప్రొడక్టే అని క్లియర్‌గా తెలుస్తుంది. ధర ఏకంగా రూ. 3 లక్షలకు పైగా పలకడం మరింత చర్చలకు దారితీసింది. నిజంగా ఈ బ్రాస్లెట్ స్పష్టమైన టేప్ రోల్‌ని పోలి ఉంది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఇదేం ఫ్యాషన్ అంటూ తిట్టిపసోస్తున్నారు. మరీ ఇంత చెత్త ప్రొడక్ట్లనా ఆ బ్రాండ్ తీసుకొచ్చేది. ఇదేం బ్రాండ్ అంటూ విమర్శలు చేస్తూ కామెంట్లు పెట్టారు. ఇంతకు ముందు కూడా ఈ బాలెన్సీగా ఇలానే ఓ చెత్త బ్యాగ్‌లా కనిపించే లెదర్ పర్సుని తీసుకొచ్చింది. పైగా దాని ధర కూడా లక్షల్లోనే పలకడం విశేషం. ఏదీఏమైన ఒక్కొసారి ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్లు కూడా లేటెస్ట్ ఫ్యాషన్ తీసుకురావడంలో చతకిలపడతాయోమో కదూ..! This Balenciaga Tape bracelet costs an absurd $4400!!😂😂 pic.twitter.com/GUaMMJlL2S — Rosy (@rose_k01) March 25, 2024 (చదవండి: అందం కోసం పాము రక్తమా? ఎక్కడో తెలుసా!) -
ఆర్టీసీ కండక్టర్ నిజాయితీ
శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళం రెండవడిపోకు చెందిన ఏపీ 30 వై 5677 నంబరు బస్సులో కొత్తూరు నుంచి శ్రీకాకుళానికి బయలుదేరిన ప్రయాణికుడు తన బంగారు బ్రాస్లెట్(రెండు తులాలు)ను బస్సులో పోగొట్టుకున్నాడు. బస్సు శ్రీకాకుళం కాంప్లెక్స్‌కు చేరుకున్న తర్వాత ప్రయాణికులందరూ దిగిపోయాక కండక్టర్ ఒకసారి బస్సును పరిశీలించగా అందులో బ్రాస్లెట్ దొరికింది. వెంటనే బ్రాస్లెట్ను శ్రీకాకుళం రెండో డిపో మేనేజర్ నంబాళ్ళ అరుణకుమారికి అందజేసి తన నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళి తే...శ్రీకాకుళంనకు చెందిన పి.రమణ మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో కొత్తూరులో బస్సు ఎక్కి శ్రీకా కుళం టికెట్ తీసుకున్నాడు. బస్సు శ్రీకాకుళం కాంప్లెక్స్ చేరుకునేటప్పటికి సాయంత్రం 4.30 గంటలు అయ్యింది. బస్సు దిగే తొందరలో తన చేతికి ఉన్న బంగారు బ్రాస్లెట్ బస్సులో పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత కండక్టర్ కె.ఎస్.చలం బస్సును పరిశీలించగా రెండు తులాల బంగారు బ్రాస్ లెట్ దొరికింది. దానిని రెండో డిపో మేనేజర్ అరుణకుమారి కి కండక్టర్ అప్పగించారు. రమణ ఇంటిదగ్గరకి వచ్చిన తర్వాత బ్రాస్లెట్ లేకపోవడంతో బస్సులో పడిపోయి ఉంటుందని భావించి డిపో మేనేజర్‌కు విషయం చెప్పారు. వివరాలను నిర్ధారించుకున్న తర్వాత రమణకు బ్రాస్లెట్ను అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ టీఐ–3 కె.ఎస్.రాజు, సెక్యూరిటీ హెడ్ గార్డు ముకుందరావు, సెక్యూరిటీ గార్డు జనార్దన్ డీసీ రమేష్ తదితరులు ఉన్నారు. -
వృద్ధుల కోసం జీపీఎస్ బ్రాస్లెట్లు..
సాధారణంగా ఒక వయసు వచ్చిన వ్యక్తులకు మతిమరుపు రావడం చాలా సహజం. అది ఒక పరిధి వరకైతే ఒకే కానీ తమ సొంత ఇంటి అడ్రస్‌ను సైతం మర్చిపోయేలా ఉంటే మాత్రం ఎంతో ప్రమాదం. కాబట్టి మతిమరుపు లాంటి సమస్యలతో బాధ పడుతున్న వృద్ధుల కోసం చైనా అధికారులు ఓ కొత్త ఆలోచన చేశారు. ఇంటి నుంచి బయటకెళ్లిన వృద్ధులు మళ్లీ ఇళ్లు చేరడంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు గుర్తించి.. వారికి ప్రత్యేక బ్రాస్లెట్లు ఇవ్వాలని నిర్ణరుుంచారు. జీపీఎస్‌తో కూడిన ఆ బ్రాస్లెట్లను వృద్ధులు ధరిస్తే వారు దారి తప్పిపోరుున లేక అడ్రస్ మర్చిపోయిన వారిని గుర్తించడం సులభమవుతుందని బీజింగ్ డిప్యూటీ మేయర్ వాంగ్ నింగ్ తెలిపారు. మతిమరుపు సమస్యలున్న 12,000 మంది వృద్ధులకు త్వరలోనే ఈ బ్రాస్లెట్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. వృద్ధులకు సంబంధించిన వారు తమ స్మార్ట్ ఫోన్లలో యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా వారి ఆచూకీని తెలుసుకోగలరని తెలిపారు. అంతే కాదు ఆ బ్రాస్లెట్తో వృద్ధులు ఎమర్జెన్సీ కాల్స్ సైతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2015లోని సమాచారం ప్రకారం చైనా జనాభాలో 22 కోట్ల మంది 60 ఏళ్లకు పైబడినవారే.