బ్రెజిల్ కరెన్సీ ఉందన్న అనుమానంతో ఇద్దరు అరెస్ట్
నేరేడ్మెట్(హైదరాబాద్): బ్రెజిల్ దేశానికి చెందిన కరెన్సీ నోట్లు ఉన్నాయన్న అనుమానంతో ఇద్దరు వ్యక్తులను నగరంలోని నేరేడ్మెట్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరు ఉప్పల్ భరత్ నగర్‌కు చెందిన రియల్టీ వ్యాపారి నక్కా నవీన్(38), సత్య రాఘవేంద్ర కాలనీకి చెందిన ఫణీశ్వరరావు(40)గా పోలీసులు వెల్లడించారు. శనివారం నేరేడ్మెట్ చౌరస్తా గ్రీన్ బావార్జి హోటల్ దగ్గర వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి బ్రెజిల్ దేశానికి చెందిన 196 కరెన్సీ నోట్ల(ఒక్కోటీ వెయ్యి రూపాయల విలువైన)ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.