కేవీపీపై చర్యలు తీసుకోండి : టీడీపీ
హైదరాబాద్: అసెంబ్లీలో శుక్రవారం చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. దివంగత సీఎంవైఎస్ ఫొటో తొలగింపుపై ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పీకర్‌ను కించపరుస్తూ లేఖ రాశారని, సభా హక్కుల ఉల్లంఘన కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.
సెప్టెంబర్ రెండున అసెంబ్లీ లాబీల్లో వైఎస్ ఫోటోలను అతికించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యురాలు అనిత స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ రెండు అంశాలనూ సభా హక్కుల సంఘం పరిశీలనకు పంపిస్తామని స్పీకర్ ప్రకటించారు.