ఔరంగాబాద్‌లో రొట్టెల బ్యాంక్ ఏర్పాటు
ఔరంగాబాద్ (మహారాష్ట్ర): పేదల ఆకలి తీర్చేందుకు మహారాష్ర్టలోని ఔరంగాబాద్‌లో రొట్టెల బ్యాంక్ సోమవారం ఏర్పాటైంది. ఈ బ్యాంకులో ఎవరైనా సరే రొట్టెలను (డిపాజిట్) తెచ్చి ఇవ్వొచ్చు. అలాగే పేదలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడే వారు, నిరుద్యోగులు వేడి వేడి రొట్టెలు, కూరలను తక్కువ మొత్తం వెచ్చించి (విత్‌డ్రా) తీసుకోవచ్చు.
మహారాష్ట్రలో రొట్టెల బ్యాంకును ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఈ తరహా రొట్టెల బ్యాంకును తొలిసారిగా డిసెంబర్ 5న యూసుఫ్ ముకతీ ఏర్పాటు చేశారు. ‘కొన్నేళ్లుగా ఎంతో మంది పేదవాళ్లు ఒక పూట కూడా తిండి దొరకని వారిని చూశాను. వారి పరిస్థితి దయనీయంగా ఉంటుంది. వారు ఆత్మగౌరవంతో బతకడం వల్ల యాచించలేరు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని ముకతీ చెప్పారు.