వరుడికి 103 ఏళ్లు, వధువుకి 91 ఏళ్లు
లండన్: లేటు వయసులో పెళ్లి చేసుకున్న ఓ జంట గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. లేటు అంటే మామూలు లేటు కాదు.. వరుడికి 103 ఏళ్లు, వధువుకి 91 ఏళ్లు. ఇంత ముదిమి వయసులో వీరు 50 మంది కుటుంబ సభ్యులు, ఓ గిన్నిస్ ప్రతినిధి సమక్షంలో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వరుడు జార్జ్ కిర్బీ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఈ వివాహం జరిగింది. వీల్‌చైర్‌పై ఉన్న వరుణ్ని తోసుకుంటూ వచ్చిన వధువు డోరీన్ లక్కీ.. అతని వేలికి ఉంగరాన్ని తొడిగింది. వీరిద్దరూ 1988లో కలుసుకున్నారు. అప్పటికి కిర్బీ వైవాహిక బంధం విఫలమవ్వగా, లక్కీ తన భర్తను కోల్పోయి మూడేళ్లయింది. వీరికి ఏడుగురు బిడ్డలు, 15 మంది మనుమలు, ఏడుగురు మునిమనుమలు ఉన్నారు.