British officials
-
ఇక్కడ తలరాత మారుస్తారు!
హెయిర్ బ్యాంకు.. ఈ బ్యాంకు పేరెప్పుడూ వినలేదు కదూ.. మామూలు బ్యాంకులేం చేస్తాయి.. మా దగ్గర మీ డబ్బులు దాచుకోండి.. భవిష్యత్తులో అవి ఎన్నో రెట్లు పెరిగి మీకు ఉపయోగపడతాయి అంటాయి.. అంతేగా.. ఈ హెయిర్ బ్యాంకు కూడా డిటోనే. కాకపోతే.. మూమూలు బ్యాంకుల్లో డబ్బులు దాస్తాం.. ఇక్కడ మన జుట్టు దాస్తాం.. అంతే.. తేడా.. మిగతాదంతా సేమ్‌టుసేమ్.. ఇంతకీ ఎందుకు? ఎందుకేంటి.. ఈ ప్రపంచంలో ధనిక పేదా తేడా లేకుండా దిగులుతో తల్లడిల్లిపోయే సమస్య ఒకే ఒక్కటి.. అదే.. బట్టతల.. నిజానికి వెంట్రుకలు ఏర్పడేందుకు హెయిర్ ఫాలికిల్స్ కింది భాగంలో ఉండే డెర్మల్ పాపిల్లా అనే కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇది చర్మంలోని భాగం. వయసు పెరుగుతున్న కొద్దీ హెయిర్ ఫాలికిల్స్.. ఈ డెర్మల్ పాపిల్లా కణాల నుంచి వేరుపడుతాయి. దీంతో ఫాలికిల్ చిన్నగా అయిపోవడంతో వెంట్రుకలు చిన్నగా అయిపోవడం.. ఎదుగుదల లేకపోవడం జరుగుతుంటుంది. అంటే వెంట్రుకల ఎదుగుదలలో ఈ డెర్మల్ పాపిల్లా కణాలు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయన్న విషయం అర్థమైంది కదా.. సరిగ్గా ఇక్కడే పరిశోధకులు దృష్టి సారించి పరిశోధనలు సాగించారు. హెయిర్ బ్యాంకుగా పేర్కొంటున్న ఈ ప్రక్రియకు బ్రిటన్ అధికారులు తాజాగా అనుమతులిచ్చారు. ఇక్కడేం చేస్తారు.. ముందుగా ఎవరైనా వ్యక్తికి చెందిన డెర్మల్ పాపిల్లా కణాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. దాదాపు 100 కణాలను తీసుకుని బ్యాంకులో భద్రపరుస్తారు. ఈ కణాలు పాడవకుండా ఉండేందుకు ‘క్రయోప్రిజర్వ్’పద్ధతి ద్వారా దాదాపు మైనస్ 180 సెల్సియస్ డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద ఎంత కాలం అంటే అంతకాలం దాచి ఉంచుతారు. కణాలను వేరు చేసే ప్రక్రియకే దాదాపు రూ.1.8 లక్షలు వసూలు చేయనున్నారు. ఆ తర్వాత భద్రపరిచినందుకు ఏటా దాదాపు రూ.9 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా దాచి ఉంచినందుకు దాదాపు రూ.1.8 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తికి ఎప్పుడైనా భవిష్యత్తులో వెంట్రుకలు ఊడిపోతున్నా.. బట్టతల వచ్చినా ఆ బ్యాంకుకు వెళ్తే చాలు సమస్య పరిష్కారం అయినట్లే. ఎందుకంటే ఒక్క డీపీ కణం నుంచి చాలా చాలా డీపీ కణాలను క్లోనింగ్ ప్రక్రియ ద్వారా అభివృద్ధిపరచవచ్చు. ఇలా క్లోనింగ్ ద్వారా ఏర్పడిన కణాలను తలమీది చర్మంలోకి ఇంజెక్షన్ ద్వారా ఎక్కిస్తారు. అప్పుడు ఆ కణాల నుంచి హెయిర్ ఫాలికిల్స్ ఏర్పడి.. వాటి నుంచి ఒత్తయిన జట్టు పెరుగుతుంది. 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికి ఈ కణాలను దాచిపెట్టుకునే అవకాశం ఉంటుంది. యుక్త వయసు రాగానే ఈ కణాలను బ్యాంకులో దాచిపెట్టుకుంటే మరీ మంచిదని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న డాక్టర్ ఫర్జో వివరించారు. ఈ వెంట్రుకల బ్యాంకు కాన్సెప్ట్‌ను అమలు చేసేందుకు బ్రిటన్ హ్యూమన్ టిష్యూ అథారిటీ.. హెయిర్ క్లోన్ అనే బయోటెక్నాలజీ కంపెనీకి తాజాగా అనుమతులిచ్చింది. పాతవాటికి కొత్తదానికి తేడా? బట్ట తల వచ్చినప్పుడు.. ప్యాచ్ సిస్టమ్ లేదా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (పీఆర్పీ)చేయించుకుంటారు. మొదటి విధానంలో వెంట్రుకలను తలపై భాగంలో అతికిస్తారు. రెండో విధానంలో మాత్రం మన రక్తాన్ని తీసుకుని సెంట్రిఫ్యూజ్ చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాను వేరుచేస్తారు. దీన్ని వెంట్రుకలు ఎదగాల్సిన చోట ఇంజెక్షన్ ద్వారా ఎక్కిస్తారు. కానీ హెయిర్ బ్యాంకు ప్రక్రియ ద్వారా నేరుగా ఆరోగ్యవంతమైన మన డెర్మల్ పాపిల్లా కణాలను ఉపయోగించి, సహజసిద్ధంగా వెంట్రుకలు పెరిగేలా చేయొచ్చు. ఈ విధానంలోని వెంట్రుకలు ఉన్న చోట కొంత చర్మాన్ని ముందుగా తీసుకుంటారు తర్వాత అందులోని హెయిర్ ఫాలికిల్స్ను తీసుకుని, అందులో ఉన్న డెర్మల్ పాపిల్లాను వేరు చేస్తారు. ఆ పాపిల్లా కణాలను చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు. అయితే ఈ విధానం వల్ల సైడ్ ఎఫెక్టులు తక్కువగా ఉండటమే కాకుండా.. వెంట్రుకలు పెరుగుతాయనేందుకు గ్యారంటీ కూడా ఉంటుందట. -
పొట్టి దుస్తులు వేసుకున్నందుకు దారుణాతిదారుణం!
బీరట్: గత వారం లెబనాన్ రాజధాని బీరట్‌లో అత్యాచారం అనంతరం దారుణహత్యకు గురైన బ్రిటీష్ మహిళా దౌత్యవేత్త కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పొట్టి దుస్తులు వేసుకోవడంతో అత్యాచారం చేయడానికి కష్టం కాలేదంటూ విచారణలో నిందితుడు పలు విషయాలను వెల్లడించాడు. బీరట్ పోలీసుల కథనం ప్రకారం.. రెబెక్కా డైక్స్(30) అనే బ్రిటీష్ మహిళ లెబనాన్ లో దౌత్యవేత్తగా సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో గతవారం బీరట్ లోని ఫేమస్ టూరిస్ట్ బార్ నుంచి రెబెక్కా బయటకొచ్చారు. ఇంటికి వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేశారు. క్యాబ్ ఎక్కే సమయంలోనే డ్రైవర్ తరీక్ హచీహ్, రెబెక్కా వస్త్రధారణను గమనించాడు. కొద్దిసేపు క్యాబ్ నడిపాక నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు నిందితుడు. అక్కడ రెబెక్కాపై అత్యాచారం చేసి, ఉరివేసి ఆమెను హత్య చేశాడు. అనంతరం రోడ్డ పక్కన పొదల్లో ఆమె మృతదేహాన్ని వదిలివెళ్లాడు. కొందరు స్థానికులు నగ్నంగా ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులకు సమచారం అందించారు. రెబెక్కా మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజీతో పాటు మహిళా దౌత్యవేత్త రెబెక్కా మొబైల్లో ఉబర్ క్యాబ్ బుక్ చేసిన సమాచారాన్ని పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రెబెక్కా చాలా అందంగా ఉందని, అందులోనూ ఆమె పొట్టి దుస్తులు (మిని స్కర్ట్) వేసుకోవడంతో అత్యాచారం చేశానని పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించాడు. క్యాబ్ డ్రైవర్ అయినప్పటికీ తరీక్ వద్ద ఆయుధాలు (తుపాకులు) ఉన్నాయని, నిందితుడ్ని మరిన్ని కోణాల్లో విచారించనున్నట్లు బీరట్ పోలీసులు వివరించారు. -
బ్రిటిష్ రెసిడెన్సీ
ప్రధాన రెసిడెన్సీ భవనాన్ని ఆనుకునివున్న విశాలమైన ప్రాంగణంలో ఆనాటి బ్రిటిష్ అధికారుల కోసం నిర్మించిన ఆఫీసు గదులు, వారి నివాసం కోసం నిర్మించిన క్వార్టర్లు ఉన్నాయి. బ్రిటిష్ రెసిడెన్సీ నిర్మించిన తర్వాత సుమారు 50 ఏళ్ల దాకా చుట్టూతా ఎలాంటి ప్రహరీ నిర్మించ లేదు. ఐతే, 1857లో భారత స్వాతంత్య్ర సమరంలో భాగంగా రెసిడెన్సీపై ఉద్యమకారుల దండయాత్ర జరిగింది. దాంతో దీని చుట్టూ రాళ్లతో ప్రహరీ నిర్మించారు. చారిత్రక పురాతన వారసత్వ సంపదకు నిలువెత్తు సాక్ష్యం బ్రిటిష్ రెసిడెన్సీ. ఇండో-బ్రిటిష్ కాలం నాటి భవనాలకు సంబంధించిన తీపి గుర్తుగా బ్రిటిష్ రెసిడెన్సీ నిలుస్తుంది. హైదరాబాద్‌లో బ్రిటిష్ వారు తమ ఆధిపత్యాన్ని చాటుకున్న సమయంలో ఈ కట్టడం నిర్మించారు. దీని నిర్మాణంలో ఆనాటి గొప్ప ఆర్కిటెక్చర్, వాస్తు శిల్ప శైలీ విశిష్టత నేటికీ ప్రతిబింబిస్తుంది. బ్రిటిష్ 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. కోఠి-సుల్తాన్ బజార్, చౌరస్తాలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పురాతన రాజ ప్రాసాదంలో నేడు ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాల ఉంది. అసఫ్ జాహీల కాలంలో (1724-1948) బ్రిటిష్ పాలకుల ఆధిపత్యం అధికంగా ఉండేది. స్థానిక నిజాం ప్రభువులు కల్పించిన క్వార్టర్సలోనే బ్రిటిష్ రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన మేజర్ జె.ఎ. కిర్క్‌పాట్రిక్, బ్రిటిష్ అధికారులకు వారి హోదాకు దీటుగా ఒక పెద్ద బంగళా ఉండాలని, అందుకోసం కోఠి ప్రాంతంలో మూసీనది సమీపంలో సుమారు 60 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి అక్కడ పెద్ద భవంతి నిర్మించాలని ప్రతిపాదించాడు. అప్పటి నిజాం ప్రభువు ముందుగా ఈ ప్రతిపాదనను ఒప్పుకోకపోయినా, తర్వాత అంగీకరించి రెసిడెన్సీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకయిన ఖర్చునంతా నిజాం ప్రభువే భరించాడు. బ్రిటిష్ రాయల్ ఇంజనీర్లు లెఫ్టినెంట్ శామ్యూల్ రస్సెల్, మద్రాసు, ఈ భవన నమూనాను రూపొందించారు. నిజాం ఆస్థానంలోని ఉన్నతాధికారి శ్రీరాజా కంద స్వామి ముదిలియార్ తదితరులు సివిల్ పనులు పర్యవేక్షించారు. 22 పాలరాతి మెట్లు రెసిడెన్సీ ప్రధాన హాలును చేరుకోవడానికి 22 పాలరాతి మెట్లు ఎక్కవల్సి వుంటుంది. ఒక్కొక్క మెట్టు సుమారు 60 అడుగుల పొడవు వుంది. పోర్టికో ముందు భాగంలో సుమారు 50 అడుగుల ఎత్తులో ఎనిమిది భారీ ఎత్తై పిల్లర్లు, నాటి రాచఠీవికి దర్పణంగా దర్శనమిస్తాయి. అలాగే, తెల్లని ఎత్తై పాలరాయి వేదికపై ప్రధాన సింహద్వారానికి ఇరు పక్కలా పెద్దసైజు సింహాలు బ్రిటిష్ ఇంపీరియల్ చిహ్నంగా స్వాగతం పలుకుతాయి. ఇది దాటి రాజప్రాసాదంలో అడుగిడగానే ఉన్న దర్బార్ హాల్లో అత్యంత ప్రతి భావంతంగా చెక్కిన పలు కళాకృతులున్నాయి. దర్బారుహాల్లో సుమారు 60 అడుగుల ఎత్తున గల పైకప్పుపై ఆనాటి చిత్ర కళాకారుని తైలవర్ణ చిత్రాలు నేటికీ చెక్కుచెదర లేదు. ఖరీదైన చాండిలియర్లు, గోడలకు బిగించిన నిలువుటెత్తు అద్దాలు, అద్దాల మహల్‌ను తలపిస్తూ దర్శకుల మనసులను దోచుకుంటాయి. అన్నిరకాల హంగులున్నా బ్రిటిష్ రెసిడెన్సీలోని ప్రధాన భవనం చాలా భాగం శిథిలావస్థకు చేరుకుంది. వాటికి తక్షణ రిపేరు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధాన భవన సముదాయానికి కొద్దిపాటి దూరంలో బ్రిటిష్ రెసిడెంట్ల సమాధులు ఉన్నాయి. బ్రిటిష్ రెసిడెన్సీ కట్టడ నమూనా కూడా ఇక్కడ దగ్గర్లోనే ఉంది. అయితే ఈ ప్రాంతంలో నేడు కాలు మోపడానికి కూడా వీలు లేనంతగా పిచ్చి మొక్కలతో నిండి ఉంది. వీటికి తగిన రక్షణ, మరమ్మతులు చేసి సందర్శకులకు అందుబాటులో ఉంచితే బాగుంటుంది. న్యూయార్కులోని గిౌటఛీ కౌఠఝ్ఛ్ట గ్చ్టిఛిజి అనే సంస్థ బ్రిటిష్ రెసిడెన్సీలో తగిన మరమ్మతుల కోసం ఒక లక్ష అమెరికన్ డాలర్లు గ్రాంటుగా ప్రకటించింది. చారిత్రక, వారసత్వ కట్టడాలపై ఆసక్తి గల వారందరికీ బ్రిటిష్ రెసిడెన్సీ ఎన్నో కథలు తెలియజేస్తుంది. - మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com -
బ్రిటిష్ రెసిడెన్సీ
ప్రధాన రెసిడెన్సీ భవనాన్ని ఆనుకుని వున్న విశాలమైన ప్రాంగణంలో ఆనాటి బ్రిటిష్ అధికారుల కోసం నిర్మించిన ఆఫీసు గదులు, వారి నివాసం కోసం నిర్మించిన క్వార్టర్లు వున్నాయి. బ్రిటిష్ రెసిడెన్సీ నిర్మించిన తర్వాత సుమారు 50 ఏళ్ల దాకా చుట్టూతా ఎలాంటి ప్రహారీ నిర్మించ లేదు. ఐతే, 1857లో భారత స్వాతంత్య్ర సమరంలో భాగంగా రెసిడెన్సీపై ఉద్యమకారుల దండయాత్ర జరిగింది. దాంతో దీని చుట్టూ రాళ్లతో ప్రహరీ నిర్మించారు. చారిత్రక పురాతన వారసత్వ సంపదకు నిలువెత్తు సాక్ష్యం బ్రిటిష్ రెసిడెన్సీ. ఇండో-బ్రిటిష్ కాలం నాటి భవనాలకు సంబంధించిన తీపి గుర్తుగా బ్రిటిష్ రెసిడెన్సీ నిలుస్తుంది. హైదరాబాద్‌లో బ్రిటిష్ వారు తమ ఆధిపత్యాన్ని చాటుకున్న సమయంలో ఈ కట్టడం నిర్మించారు. దీని నిర్మాణంలో ఆనాటి గొప్ప ఆర్కిటెక్చర్, వాస్తు శిల్ప శైలీ విశిష్టత నేటికీ ప్రతిబింబిస్తుంది. బ్రిటిష్ 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. కోఠి-సుల్తాన్ బజార్, చౌరస్తాలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పురాతన రాజ ప్రాసాదంలో నేడు ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాల ఉంది. అసఫ్ జాహీల కాలంలో (1724-1948)బ్రిటిష్ పాలకుల ఆధిపత్యం అధికంగా ఉండేది. స్థానిక నిజాం ప్రభువులు కల్పించిన క్వార్టర్సలోనే బ్రిటిష్ రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన మేజర్ జె.ఎ. కిర్క్‌పాట్రిక్, బ్రిటిష్ అధికారులకు వారి హోదాకు దీటుగా ఒక పెద్ద బంగళా ఉండాలని, అందుకోసం కోఠి ప్రాంతంలో మూసీనది సమీపంలో సుమారు 60 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి అక్కడ పెద్ద భవంతి నిర్మించాలని ప్రతిపాదించాడు. అప్పటి నిజాం ప్రభువు ముందుగా ఈ ప్రతిపాదనను ఒప్పుకోకపోయినా, తర్వాత అంగీకరించి రెసిడెన్సీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకయిన ఖర్చునంతా నిజాం ప్రభువే భరించాడు. బ్రిటిష్ రాయల్ ఇంజనీర్లు లెఫ్టినెంట్ శామ్యూల్ రస్సెల్, మద్రాసు, ఈ భవన నమూనాను రూపొందించారు. నిజాం ఆస్థానంలోని ఉన్నతాధికారి శ్రీరాజా కంద స్వామి ముదిలియార్ తదితరులు సివిల్ పనులు పర్యవేక్షించారు. 22 పాలరాతి మెట్లు రెసిడెన్సీ ప్రధాన హాలును చేరుకోవడానికి 22 పాలరాతి మెట్లు ఎక్కవల్సి వుంటుంది. ఒక్కొక్క మెట్టు సుమారు 60 అడుగుల పొడవు వుంది. పోర్టికో ముందు భాగంలో సుమారు 50 అడుగుల ఎత్తులో ఎనిమిది భారీ ఎత్తై పిల్లర్లు, నాటి రాచఠీవికి దర్పణంగా దర్శనమిస్తాయి. అలాగే, తెల్లని ఎత్తై పాలరాయి వేదికపై ప్రధాన సింహద్వారానికి ఇరు పక్కలా పెద్దసైజు సింహాలు బ్రిటిష్ ఇంపీరియల్ చిహ్నంగా స్వాగతం పలుకుతాయి. ఇది దాటి రాజప్రాసాదంలో అడుగిడగానే ఉన్న దర్బార్ హాల్లో అత్యంత ప్రతి భావంతంగా చెక్కిన పలు కళాకృతులున్నాయి. దర్బారుహాల్లో సుమారు 60 అడుగుల ఎత్తున గల పైకప్పుపై ఆనాటి చిత్ర కళాకారుని తైలవర్ణ చిత్రాలు నేటికీ చెక్కుచెదర లేదు. ఖరీదైన చాండిలియర్లు, గోడలకు బిగించిన నిలువుటెత్తు అద్దాలు, అద్దాల మహల్‌ను తలపిస్తూ దర్శకుల మనసులను దోచుకుంటాయి. అన్నిరకాల హంగులున్నా బ్రిటిష్ రెసిడెన్సీలోని ప్రధాన భవనం చాలా భాగం శిథిలావస్థకు చేరుకుంది. వాటికి తక్షణ రిపేరు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధాన భవన సముదాయానికి కొద్దిపాటి దూరంలో బ్రిటిష్ రెసిడెంట్ల సమాధులు ఉన్నాయి. బ్రిటిష్ రెసిడెన్సీ కట్టడ నమూనా కూడా ఇక్కడ దగ్గర్లోనే ఉంది. అయితే ఈ ప్రాంతంలో నేడు కాలు మోపడానికి కూడా వీలు లేనంతగా పిచ్చి మొక్కలతో నిండి ఉంది. వీటికి తగిన రక్షణ, మరమ్మతులు చేసి సందర్శకులకు అందుబాటులో ఉంచితే బాగుంటుంది. న్యూయార్కులోని గిౌటఛీ కౌఠఝ్ఛ్ట గ్చ్టిఛిజి అనే సంస్థ బ్రిటిష్ రెసిడెన్సీలో తగిన మరమ్మతుల కోసం ఒక లక్ష అమెరికన్ డాలర్లు గ్రాంటుగా ప్రకటించింది. చారిత్రక, వారసత్వ కట్టడాలపై ఆసక్తి గల వారందరికీ బ్రిటీష్ రెసిడెన్సీ ఎన్నో కథలు తెలియజేస్తుంది. - మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com -
ఐ లవ్ ఇండియా
మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. వెయ్యి మీటర్లతో రూపొందించిన జాతీయ పతాక ప్రదర్శన విశాఖవాసులను ఆకట్టుకుంది. 104 ఏరియాకు చెందిన వైజాగ్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు గురువారం మర్రిపాలెం నుంచి ఎన్ఏడీ కొత్తరోడ్ వరకూ పొడవైన పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు. - సాక్షి, విశాఖపట్నం స్వాతంత్య్ర పోరాటం చరిత్ర పుటల్లో విశాఖ జిల్లాకు సముచిత స్థానముంది. దేశవ్యాప్తంగా ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో జిల్లావాసులు కూడా నడుం బిగించారు. అధిక సంఖ్యలో యువకులు స్వచ్ఛందంగా బరిలోకి దూకారు. టర్నర్ సత్రం, పూర్ణాథియేటర్, హిందూ రీడింగ్‌రూమ్, రెల్లివీథి రామాలయం సమావేశాలకు వేదికలుగా నిలిచాయి. ఉప్పుపై కప్పం విధించడంతో దేశవ్యాప్తంగా గాంధీజీ నాయకత్వంలో ఉప్పుసత్యాగ్రహం జరిగింది. ఇందులో భాగంగానే 1930 ఏప్రిల్ 13న విశాఖ సముద్రతీరంలో ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు నాయకత్వం వహించిన నారాయణశర్మ, తెన్నేటి విశ్వనాథం, దిగుమర్తి రామస్వామి, కొల్లూరి సూర్యనారాయణగుప్తలు అరెస్టయ్యారు. తరువాత మేలో గాజువాక బలచెరువు ఉప్పు గల్లీల వద్ద రెండో ఉప్పు సత్యాగ్రహం జరిగింది. దీనితో జగన్నాధరావు, కందాళ సర్వేశ్వరశాస్త్రి, మల్లవరపు వెంకట కృష్ణారావులను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడో బృందంగా ఉద్యమం నిర్వహించిన జానకీబాయమ్మ, బిజెగుప్త, దేవులపల్లి గణపతిరావుతో సహా 20 మంది అరెస్టయ్యారు. మహాత్ముడు అడుగిడిన వేళ.. హరిజనోద్ధరణ లక్ష్యంతో గాంధీజీ దేశంలో యాత్ర ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన 1933 డిసెంబర్ 29న విశాఖ వచ్చారు. సముద్రతీరంలో జరిగిన సభకు ప్రజలు నీరాజనం పట్టారు. సభ తరువాత ఇప్పటి ఏవీఎన్ కళాశాల దరి రెల్లివీథిలోని రామాలయంలోకి గాంధీజీయే స్వయంగా హరిజనులను ఆలయ ప్రవేశం చేయించారు. బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పకడ్బందీ ప్రణాళిక రూపొందించడానికిగాను 1930లో విశాఖలో తొలి రాష్ట్ర స్థాయి రాజకీయ సమావేశం పూర్ణా థియేటర్లో జరిగింది. సమావేశంలో పాల్గొన్న వారికి టర్నర్ చౌల్ట్రీలో బస ఏర్పాటు చేశారు. విదేశీ వస్తువుల బహిష్కరణ కార్యక్రమంలో భాగంగా 1932 జనవరి 11న సముద్రతీరంలో విదేశీ వస్తువులను తగులబెట్టారు. - విశాఖపట్నం అనకాపల్లి మదిలో గాంధీజీ అనకాపల్లి: పట్టణంలో అడుగడుగునా మహాత్మ గాంధీ స్మృతులు కదలాడుతూ ఉంటాయి. ఒక వీధి పేరు గాంధీనగరం. పాత బెల్లం మార్కెట్‌కు గాంధీ పేరు పెట్టారు. ఇప్పుడు బెల్లం మార్కెట్ రింగ్రోడ్కి తరలిపోవడంతో ఇప్పుడున్న కూరగాయల మార్కెట్‌ను గాంధీ పేరుతో పిలుస్తుంటారు. 75 ఏళ్ల నుంచి గాంధీ ఖద్దరు సొసైటీని అనకాపల్లిలో నిర్వహిస్తున్నారు. ఏఎమ్ఏఎల్ కళాశాలలో మహాత్మాగాంధీ నిలువెత్తు విగ్రహం మకుటాయమానం. జాతిపితతో అనకాపల్లి వాసులకు ఎంతో అనుబంధం. గాంధీజీ ఈ పట్టణానికి నాలుగుసార్లు విచ్చేశారు. మొదటిసారి 1921 మార్చి 31వ తేదీన స్వరాజ్యయాత్రలో భాగంగా వచ్చారు. బెజవాడలో జరిగిన ఏఐసీసీ సమావేశానికి గాంధీజీ హాజరైన సందర్భంగా అనకాపల్లి మీదుగా రైలులో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో భాగంగా అనకాపల్లి స్టేషన్‌కు చేరుకున్న గాంధీకి పట్టణ ప్రజలు తిలక్ స్వరాజ్య నిధికి 200 రూపాయలు వసూలు చేసి అందించారు. * 1929 మే 1న గాంధీజీ ఖద్దరు యాత్రను పురస్కరించుకొని అనకాపల్లికి విచ్చేసారు. ఉదయం 8.30 గంటలకు విశాఖపట్నం నుంచి అనకాపల్లికి చేరుకున్న గాంధీజీ రాత్రి వరకు ఇక్కడ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. * 1933 డిసెంబర్ 29న గాంధీజీ విజయనగరం మహారాజావారి రోల్స్‌రాయిస్ కారులో ఉదయం 10.30 గంటలకు చేరుకున్నారు. మార్కెట్ స్క్వేర్ గాంధీబజార్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనగా వేలాదిమంది హాజరయ్యారు. * 1946 జనవరి 20వ తేదీన సాయంత్రం 3.45కి అనకాపల్లి రైల్వేస్టేషన్‌కు గాంధీజీ చేరుకున్నారు. గాంధీజీ హిందీ నిధికి ఎం.జి. కన్నయ్యపంతులు 1000 రూపాయలు విరాళం సమర్పించారు. అనకాపల్లిలో గాంధీజీ మౌనవ్రతం పాటించారు. మన్యం వీరుడు... మండే సూరీడు... దేశభక్తిని రగిల్చాడు.. వలస పాలనపై నిప్పు రాజేశాడు.. తెల్ల దొరల గుండెల్లో నిద్రపోయాడు.. స్వాతంత్య్ర సాధనకు ప్రాణాలిచ్చాడు.. మన్యం వీరుడు.. మండే సూరీడు.. మన అల్లూరి సీతారామరాజు.. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి పడమర దిక్కును చూపించిన విరోచిత యోధుడాయన. బ్రిటిష్ అధికారుల ఆగడాలపై తిరుగుబావుటా ఎగురవేశాడు. గిరిజనుల్లో విప్లవాగ్నిని రగిలించాడు. 1917లో గొలుగొండ తాలుకాలో భూపతి అగ్రహారం వద్ద కాలు మోపిన అల్లూరి బ్రిటిష్ అరాచకాలను తిప్పికొట్టాలని భావించాడు. అదే సమయంలో తహశీల్దారులుగా పనిచేస్తున్న బాస్టీన్ గిరిజనులను రోడ్డు పనుల పేరిట ఇబ్బందులకు గురిచేశాడు. 1922 ఆగస్టు 22-27 మధ్య రామరాజు గాం గంటన్నదొర, మల్లుదొరతో కలిసి ఐదు పోలీసు స్టేషన్లపై దండెత్తాడు. కేడీ పేట, రాజవొమ్మంగి, రంపచోడవరం, అడ్డతీగల స్టేషన్లపై దాడులు చేసి అక్కడ ఆయుధాలను పట్టుకుపోయాడు.1922 సెప్టెంబర్‌లో అల్లూరి దావాణాపల్లి ఘాట్ వద్ద బ్రిటిష్ అధికారులు హైటర్, విలియమ్లను హతమార్చాడు. దానికి ప్రతీకారంగా బ్రిటిష్ అధికారులు పెద్దగెడ్డ లింగాపురం వద్ద 13 మంది గిరిజనులను చంపి వారి మృతదేహాలను ఊరేగించడం ద్వారా భయపెట్టాలని ప్రయత్నించారు. 1924 మేలో మేజర్ గూడాల్ చేతిలో అల్లూరి ప్రాణాలు విడిచాడు. - కొయ్యూరు