breaking news
Bronco test
-
చెమటలు గక్కిన హార్దిక్.. పడబోయిన రింకూ.. బీసీసీఐ వీడియో వైరల్
టీమిండియా ఆటగాళ్లు ‘బ్రాంకో టెస్టు’ (Bronco Test)లో భాగంగా చెమటలు గక్కారు. భారత జట్టు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియాన్ లీ రౌక్స్ (Adrian Le Roux) ఆధ్వర్యంలో కఠిన శ్రమకోరుస్తూ ప్రాక్టీస్ చేశారు. కాగా ఆటగాళ్ల ఫిట్నెస్ పరీక్ష కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల బ్రాంకో టెస్టును ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.1200 మీటర్ల పరుగుసాధారణంగా రగ్బీ ఆటగాళ్లు ఏరోబిక్, కార్టియోవాస్క్యులర్ కెపాసిటీని పెంచుకునేందుకు ఈ టెస్టును ఉపయోగిస్తున్నారు. ఇందులో 0 మీటర్ల నుంచి మొదలు పెట్టి 60 మీ... పరిగెత్తి.. ఆ తర్వాత 0- 40 మీ.. 0-20 మీ. పరుగు తీయాలి. మొత్తంగా 240 మీటర్లను ఓ సెట్లో పూర్తి చేయాలి. మొత్తంగా ఐదు సెట్లను అంటే.. 1200 మీటర్లను ఆరు నిమిషాల్లో పూర్తి చేయాలి.చెమటలు గక్కిన హార్దిక్.. పడబోయిన రింకూఇక ఆసియా కప్-2025లో భాగంగా సెప్టెంబరు 14నాటి పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో మైదానంలోనే రౌక్స్.. ఆటగాళ్లకు బ్రాంకో టెస్టు నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ విడుదల చేసింది. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా చెమటలు గక్కగా.. రింకూ కిందపడిపోబోయాడు. మిగతా ఆటగాళ్లు సైతం పరుగు పూర్తి చేసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు.ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినాఈ విషయం గురించి రౌక్స్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మేము బ్రాంకో టెస్టు రన్ చేశాము. ఇదేమీ కొత్త రకం పరీక్ష కాదు. వివిధ క్రీడల్లో ఇప్పటికే చాలా ఏళ్లుగా దీనిని వాడుతున్నారు.ఇదొక ఫీల్డ్ టెస్టు. ఎక్కడైనా దీనిని నిర్వహించవచ్చు. ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా మేము దీనిని ఉపయోగించుకోవచ్చు. ట్రెయినింగ్ పరంగా.. ఆటగాళ్ల శారీరక దృఢత్వాన్ని పరీక్షించేందుకు .. ఇలా రెండు విధాలుగా ఇది ఉపయోగపడుతుంది.శారీరకంగా బలంగా ఉంటేనే..ఆటగాళ్ల ఏరోబిక్ ఫిట్నెస్ పెంచుకోవడానికి సహకరిస్తుంది. క్రికెట్ నైపుణ్యాలతో కూడిన ఆట. అయితే, ఆటగాళ్లు పూర్తి ఫిట్‌గా ఉన్నపుడే వారి కెరీర్సుదర్ఘీ కాలం కొనసాగుతుంది. శారీరకంగా బలంగా ఉన్నపుడే అన్ని రకాల సవాళ్లకు ఆటగాళ్లు సిద్ధం కాగలుగుతారు. మా ఆటగాళ్లు అద్బుతం. వారి హార్డ్‌వర్క్‌తో నన్నెంతగానో ఆకట్టుకుంటున్నారు.నేను గతంలో ఐపీఎల్ జట్లతో పనిచేశాను. ఎంతో మంది ఆటగాళ్లను చూశాను. ఇప్పుడిది నాకు కొత్త జట్టే. అయినా.. గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవం నాకు ఉంది. ఇలాంటి పోరాట పటిమ ఉన్న జట్టుతో కలిసి ఉండటం గర్వంగా ఉంది’’ అని జట్టు పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే.. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
అదొక అత్యంత వరెస్ట్ టెస్ట్.. ఆటగాళ్లకు కఠిన సవాల్: డివిలియర్స్
టీమిండియా ఆటగాళ్ల ఫిట్నెస్ లెవల్స్‌ను నిర్ధారించేందుకు బీసీసీఐ ఇటీవలే బ్రాంకో టెస్టును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో కొత్తగా వచ్చిన స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లి రాక్స్ ఈ పరీక్షను భారత క్రికెట్‌కు పరిచయం చేశాడు.టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సెప్టెంబర్ 13న బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఈ పరీక్షకు హాజరకానున్నాడు. అతడికి యోయో టెస్టుతో పాటు బ్రాంకో పరీక్ష కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఫిట్నెస్ టెస్టుపై దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లకు ఈ ఫిట్నెస్ పరీక్ష అంతమంచిది కాదని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు"తొలుత ఈ టెస్టు గురించి నాకు చెప్పినప్పుడు ఆర్ధం కాలేదు. ‘బ్రోంకో టెస్ట్' అంటే ఏంటి అని అడిగాను. వారు నాకు మొత్తం వివరించినప్పుడు ఈ టెస్టు ఎంటో ఆర్దమైంది. ఎందుకంటే నేను 16 ఏళ్ల వయసు నుంచి ఇది చేస్తున్నాను. దక్షిణాఫ్రికాలో మేము దీనిని స్ప్రింట్ రిపీటబిలిటీ టెస్ట్ అని పిలుస్తాము.ఇది మీరు పాల్గోనే అత్యంత చెత్త ఫిట్నెస్ టెస్ట్‌లలో ఒకటి. ప్రిటోరియా యూనివర్సిటీ, సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో కూడా ఈ టెస్టులో మేము పాల్గోన్నాము. ముఖ్యంగా శీతాకాలపు ఉదయాల్లో మాకు ఈ టెస్టులు నిర్వహించేవారు. ఆ సమయంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. సముద్ర మట్టానికి 1,500 మీటర్ల ఎత్తులో ఉండటంతో ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యేది. ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉండడంతో మా ఊపిరితిత్తులు కాలిపోయేలా అన్పించేది. బీసీసీఐ తమ ఆటగాళ్ల ట్రైనింగ్‌లో బ్రోంకో టెస్ట్‌ను చేర్చడం నిజంగా గొప్ప విషయం. ఆటగాళ్ల ఫిట్నెస్ అంచనా వేసేందుకు ఈ టెస్టు సరైనది. కానీ ప్లేయర్లకు ఈ టెస్టు ఒక ఛాలెంజ్‌లా ఉంటుంది అని తన యూట్యూబ్ ఛానల్లో డివిలియర్స్ పేర్కొన్నాడు.బ్రాంకో టెస్ట్ అంటే ఏంటి?ఈ టెస్టులో భాగంగా ఆటగాడు తొలుత 20 మీటర్ల షటిల్ రన్ చేయాలి. తర్వాత దీనిని 40, 60 మీటర్లకు పెంచుతారు. ఈ మూడూ కలిపి ఒక సెట్ కాగా.. మొత్తంగా ఐదు సెట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే.. ఓవరాల్‌గా 1200 మీటర్ల దూరం విరామం లేకుండా ఆటగాడు వేగంగా పరుగుతీయాలి. ఇందుకు కేవలం ఆరు నిమిషాల సమయం ఉంటుంది.చదవండి: ZIM vs SL: శ్రీలంకను వణికించిన జింబాబ్వే.. ఉత్కంఠ పోరులో ఓటమి -
ODIs: ‘కోహ్లిని తప్పించలేరు.. రోహిత్ శర్మపై వేటు వేసేందుకు కుట్ర?’
టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి (Manoj Tiwary) సంచలన వ్యాఖ్యలు చేశాడు. వన్డే కెప్టెన్ రోహిత్ శర్మను పక్కనపెట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)లో అంతర్గత ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించాడు. వన్డే ప్రపంచకప్-2027 నాటికి రోహిత్ తనకు తానుగా తప్పుకొనేలా చేయాలని చూస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.కొత్తగా బ్రోంకో టెస్టు అయితే, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) దగ్గర మాత్రం వారి పప్పులు ఉడకవని మనోజ్ తివారి పేర్కొన్నాడు. అసలు విషయం ఏమిటంటే.. బీసీసీఐ ఆటగాళ్ల ఫిట్నెస్ పరీక్షకు కొత్తగా బ్రోంకో టెస్టును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రగ్బీ, ఫుట్‌బాల్ ఆటగాళ్లకు నిర్వహించే బ్రోంకో టెస్టు ద్వారా టీమిండియా క్రికెటర్ల ఫిట్నెస్ను పరీక్షించాలని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (CoE) నిర్ణయించింది.ఇందులో భాగంగా ఆటగాడు తొలుత 20 మీటర్ల షటిల్ రన్ చేయాలి. తర్వాత దీనిని 40, 60 మీటర్లకు పెంచుతారు. ఈ మూడూ కలిపి ఒక సెట్ కాగా.. మొత్తంగా ఐదు సెట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే.. ఓవరాల్‌గా 1200 మీటర్ల దూరం విరామం లేకుండా ఆటగాడు వేగంగా పరుగుతీయాలి. ఇందుకు కేవలం ఆరు నిమిషాల సమయం ఉంటుంది.కోహ్లిని తప్పించలేరు.. రోహిత్‌పై వేటు వేసేందుకు కుట్రఈ నేపథ్యంలో బ్రోంకో టెస్టు గురించి మనోజ్ తివారి మాట్లాడుతూ.. ‘‘వన్డే వరల్డ్‌కప్-2027 ప్రణాళికల నుంచి విరాట్ కోహ్లిని తప్పించడం అంత తేలికేమీ కాదు. అయితే, రోహిత్ శర్మపై విషయంలో మాత్రం వారు సఫలమయ్యే అవకాశం ఉంది. భారత క్రికెట్లో ఏం జరుగుతుందో నేను గత కొన్నాళ్లుగా నిశితంగా పరిశీలిస్తున్నా.కొన్ని రోజుల క్రితం బ్రోంకో టెస్టు ప్రవేశపెట్టారు. రోహిత్ శర్మ లాంటి వాళ్లను బయటకు పంపేందుకే ఇలాంటి కఠినమైన ఫిట్నెస్ పరీక్షను తీసుకువచ్చారు. అన్నిటికంటే ఇదే టఫెస్ట్ ఫిట్నెస్ టెస్టు. అయినా.. ఇప్పుడే ఇది ఎందుకు ప్రవేశపెట్టారు? హెడ్‌కోచ్‌గా తొలి టెస్టు సిరీస్‌కు సన్నద్ధమైనపుడే దీనిని తీసుకురావాల్సింది.ఈ ప్రశ్నలకు నాకైతే బదులు తెలియదు. అయితే, నిశితంగా పరిశీలిస్తే మాత్రం రోహిత్ శర్మ ఈ టెస్టు పాస్ కావడం కష్టం. అతడు ఫిట్‌నెస్‌పై అంతగా దృష్టి పెట్టడు. బ్రోంకో టెస్టు ద్వారా అతడిని ఆపేయాలనే ఉద్ధేశంతో ఉన్నారని నాకు సందేహం’’ అంటూ మనోజ్ తివారి పరోక్షంగా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.చదవండి: ఒక్క సిక్స్‌తో అంతా తలకిందులయ్యేది.. అప్పుడు నేను..: సిరాజ్ -
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆటగాళ్లకు ‘అగ్ని పరీక్ష’!
సెప్టెంబరులో ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ మొదలు.. వరుస సిరీస్‌లతో టీమిండియా బిజీబిజీగా గడుపనుంది. ఈ ఖండాంతర ఈవెంట్ తర్వాత స్వదేశంలో అక్టోబరులో వెస్టిండీస్‌తో టెస్టులు.. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది.ఆటగాళ్లు ఫిట్‌గా ఉంటేనే..ఆ తర్వాత నవంబరులో టీమిండియా సొంతగడ్డపై సౌతాఫ్రికా (IND vs SA)తో టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లలో తలపడనుంది. మరి ఈ బిజీ షెడ్యూల్లో భారత జట్టు అనుకున్న ఫలితాలు రాబడుతూ సాఫీగా ముందుకు సాగాలంటే ఆటగాళ్లు ఫిట్‌గా ఉండటం అత్యంత ముఖ్యం.బీసీసీఐ కీలక నిర్ణయంఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదింట.. కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడిన విషయం తెలిసిందే. ఫలితంగా టీమిండియా యాజమాన్యం తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఫిట్నెస్ పరీక్షలో భాగంగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (CoE) సరికొత్త టెస్టును ప్రవేశపెట్టినట్లు సమాచారం. రగ్బీ, ఫుట్‌బాల్ క్రీడాకారులకు నిర్వహించే బ్రోంకో టెస్టు ద్వారా భారత ఆటగాళ్ల ఫిట్నెస్ను పరీక్షించనున్నట్లు తెలిసింది. బీసీసీఐ కాంట్రాక్టు ప్లేయర్లు, ముఖ్యంగా పేసర్లకు ఈ పరీక్ష ద్వారా ఫిట్నెస్ స్థాయి పెంచుకునే వీలు కలుగుతుందని భావిస్తున్నట్లు సమాచారం.ఫాస్ట్ బౌలర్లు పరిగెత్తడం లేదు!ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ బ్రోంకో టెస్టును ప్రవేశపెట్టింది. కొంత మంది సెంట్రల్ కాంట్రాక్టు క్రికెటర్లు బెంగళూరుకు వెళ్లి ఈ పరీక్ష చేయించుకున్నారు. ఫిట్నెస్ ప్రమాణాలు పెంచేందుకే సీఓఈ ఈ నిర్ణయం తీసుకుంది.భారత క్రికెటర్లలో చాలా మంది.. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు జిమ్‌లో ఎక్కువ సమయం (స్పీడ్ రన్నింగ్) గడపడం లేదని తెలిసింది. తప్పకుండా ఎక్కువ సేపు రన్నింగ్ చేయాలని స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ ఆడ్రియన్ లే రౌక్స్ వారికి చెప్పారు’’ అని పేర్కొన్నాయి.ఇంతకీ ఏమిటీ బ్రోంకో టెస్టు?ఇదొక రకమైన ఫిట్నెస్ పరీక్ష. ఇందులో భాగంగా ఆటగాడు తొలుత 20 మీటర్ల షటిల్ రన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 40 మీటర్లు, 60 మీటర్ల షటిల్ రన్లో పాల్గొంటాడు. ఈ మూడింటిని కలిపి ఒక సెట్‌గా వ్యవహరిస్తారు.పరీక్ష సమయంలో ఆటగాడు ఇలాంటి ఐదు సెట్లు పూర్తి చేయాలి. అంటే.. మొత్తంగా 1200 మీటర్ల దూరం విరామం లేకుండా వేగంగా పరిగెత్తాలి. ఆరు నిమిషాల్లోనే సదరు ప్లేయర్ ఈ పని పూర్తి చేయాలి.ఇదిలా ఉంటే.. రెండు కిలోమీటర్ల టైమ్ ట్రయల్‌లో ఫాస్ట్ బౌలర్లు ఎనిమిది నిమిషాల పదిహేను సెకండ్లలో బెంచ్ మార్కును అందుకోవాలి. మరోవైపు.. బ్యాటర్లు, వికెట్ కీపర్లు, స్పిన్నర్లకు ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ల టైమ్ ఉంటుంది. కాగా అంతకు ముందు బీసీసీఐ ఆటగాళ్లకు యో-యో టెస్టు నిర్వహించేదన్న విషయం తెలిసిందే.చదవండి: ఇదే ఫైనల్ స్క్వాడ్ కాదు.. వారికి మరో ఛాన్స్: అగార్కర్