షర్మిల దంపతుల దీవెన
భీమవరంలోని వీవీఎస్ గార్డెన్లో శుక్ర వారం రాత్రి జరిగిన లేఖ్యారెడ్డి, ప్రవీణ్‌రెడ్డి వివాహానికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల, బ్రదర్ అనిల్‌కుమార్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దనరెడ్డి, బళ్లారి ఎంపీ పులి శ్రీరాములు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, చెరుకువాడ రంగనాథరాజు, ఇం దుకూరి రామకృష్ణంరాజు, అమరనాథరెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు.
అంతకు ముందు షర్మిల, బ్రదర్ అనిల్ వైఎస్సార్ సీపీ నేత కొయ్యే మోషేన్‌రాజును పరా మర్శించారు. మేడిది జాన్సన్ ఇంటి వద్ద మోషేన్‌రాజును కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయనకు ఆయురారోగ్యాలు చేకూరాలని ఆకాం క్షిస్తూ బ్రదర్ అనిల్ ప్రత్యేక ప్రార్థన చేశారు.