Brothers clash
-
సిగరెట్ కోసం తమ్ముడిని కడతేర్చాడు
న్యూఢిల్లీ : తన మంచి కోరిన తమ్ముడిని కడతేర్చాడు ఓ అన్న. అంతేకాకుండా దాన్ని సహజ మరణంగా చిత్రీకరించడానికి కూడా ప్రయత్నించాడు. కానీ చివరకు పోలీసులు విచారణలో నిజం ఒప్పుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. సెంట్రల్ ఢిల్లీలో నివాసం ఉంటున్న శిశుపాల్ కుమార్‌కి విపరీతంగా సిగరెట్లు తాగే అలవాటు ఉంది. ఈ అలవాటు వల్ల అతనితో పాటు ఇంట్లో వాళ్లకు కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోంది. దీంతో అతని తమ్ముడు సత్యపాల్, ఆ అలవాటు మానుకోవాలంటూ శిశుపాల్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేశాడు. అయిన శిశుపాల్ పట్టించుకోలేదు. గత కొన్ని నెలల నుంచి అన్నదమ్ముల మధ్య ఈ విషయంలో ఘర్షణ జరుగుతూనే ఉంది. కానీ బుధవారం వారిద్దరి మధ్య వాగ్యూద్ధం తార స్థాయికి చేరింది. సత్యపాల్ తన అన్న చేత ధూమపానాన్ని విరమింపచేయాలని భావించాడు. తన తమ్ముడు తరచు తనకు అలా చెప్పడం నచ్చని శిశుపాల్ అతనిపై దాడికి ప్రయత్నించాడు. తన షూ లేస్‌ని సత్యపాల్ మెడకి గట్టిగా బిగించడంతో అతడు ప్రాణాలు కొల్పోయాడు. అయితే శిశుపాల్ దీన్ని సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేశాడు. సత్యపాల్ని ఆస్పత్రికి తరలించాడు. తన తండ్రికి తమ్ముడు అపస్మారక స్థితిలో ఉన్నాడనే సమాచారం ఇచ్చాడు. కానీ ఆస్పత్రి సిబ్బంది మాత్రం సత్యపాల్ మరణాన్ని అనుమానస్పద మృతిగా భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. పోస్ట్‌మార్టమ్ నివేదికలో అతను గొంతు నులిమి చంపబడ్డాడని తెలడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. శిశుపాల్పై అనుమానంతో గురువారం అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చివరకు పోలీసుల విచారణలో శిశుపాల్ శనివారం తన నేరాన్ని అంగీకరించాడు. శిశుపాల్తోపాటు నలుగురు సోదరులు ఒకే ఇంట్లో ఉండేవాళ్లని అతని బార్య పోలీసులకు తెలిపారు. సత్యదేవ్‌కు మాత్రమే ఉద్యోగం లేదని.. అన్నదమ్ములు మధ్య చాలా రోజులుగా గొడవలు జరిగేవని.. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదని అన్నారు. -
తమ్ముడిని చంపిన అన్న
చీరాల రూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ కారణంగా కత్తి పోటుకు గురై తమ్ముడు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం చీరాలలో జరిగింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా.. ఉద్దేశ పూర్వకంగా జరిగిందా..అనే విషయంపై స్థానికుల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందిన వివరాల ప్రకారం.. స్థానిక థామస్‌పేటకు చెందిన బడుగు ఏలియా, బడుగు వనేష్ (35)లు అన్నదమ్ములు, వీరు చీరాల నెహూ కూరగాయల మార్కెట్ సమీపంలో పండ్ల వ్యాపారం చేస్తుంటారు. సాయంత్రం సమయంలో పండ్ల దుకాణం వద్ద డబ్బుల విషయంలో ఘర్షణ పడ్డారు. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. ఏం జరిగిందో ఏమోగానీ వనేష్ ఎడమ చేతిపై కత్తి గాటుతో రోడ్డుపై పడిపోయాడు. చేతి నరం తెగిపోవడంతో తీవ్ర రక్త స్రావమైంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వచ్చి క్షతగాత్రుడిని చికిత్స కోసం ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి వనేష్ మృతి చెందాడు. కత్తితో వనేష్‌పై ఏలియా దాడి చేశాడా.. వనేష్ తనకు తానే కత్తితో కోసుకున్నాడా.. అనే విషయాలపై స్థానికులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి భార్య సంధ్య, ఐదేళ్ల సాల్మన్‌వెస్లీ, ఏడాదిన్నర అబూజ రాణిలు ఉన్నారు. భర్త మృతి చెందాడన్న వార్త తెలుసుకున్న సంధ్య ఆస్పత్రి వద్దకు చేరుకుని రోదించింది. మృతుని బంధువులు ఆస్పత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. డీఎస్పీ డాక్టర్ ప్రేమ్‌కాజల్, టూటౌన్ సీఐ రామారావు, ఒన్‌టౌన్ సీఐ విజయ్‌కుమార్‌లు సంఘటన స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. ఈ విషయమై ఒన్‌టౌన్ ఎస్ఐ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా డబ్బులు విషయంలో గొడవ జరగడంతో బావ ఏలియానే తన భర్త వనేష్‌పై కత్తితో దాడి చేసి గాయపరిచాడంటూ సంధ్య ఫిర్యాదు చేసిందని తెలిపారు. -
ప్రాణాల మీదకు తెచ్చిన మేకపాలు
నర్సంపేట: మేకపాల విషయంలో అన్నదమ్ముల మధ్య చెలరేగిన ఘర్షణ ఒకరి ప్రాణాలు తీసింది. అన్నదమ్ముల మధ్య పాల విషయంలో గొడవ జరగడంతో.. కోపోద్రిక్తుడైన అన్న తమ్ముడిని కర్రతో చితక బాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన తమ్ముడిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లెలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.