BSE Sensex 25
-
అదే జోరు.... లాభాల్లో స్టాక్ మార్కెట్
ముంబై : దేశీ స్టాక్మార్కెట్లో బుల్‌జోరు కొనసాగుతూనే ఉంది. ఏ క్షణాన్నైనా మార్కెట్లో అనూహ్య నష్టాలు తప్పవంటూ వెలువడుతున్న అంచనాలే తప్పులుగా తేలుతున్నాయి. ఏషియన్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నా దేశీ మార్కెట్లు వెనక్కి తగ్గడం లేదు. ఫలితంగా బుధవారం సైతం స్టాక్‌మార్కెట్ సూచీలు లాభాల బాటలోనే పయణిస్తున్నాయి. ఉదయం 10 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 71 పాయింట్లు లాభపడి 59,816 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 29 పాయింట్లు లాభపడి 17,851 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, టైటాన్ షేర్లు లాభాలు పొందగా ఇండస్ ఇండ్, సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టపోయాయి. చదవండి : Moody: మారిన ‘అవుట్‌లుక్’, భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటే? -
రెండోరోజూ తడబాటే..!
ముంబై: స్టాక్ మార్కెట్లో రెండోరోజూ అస్థిరత కొనసాగింది. ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు బుధవారం చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంట్రాడేలో 667 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ 20 పాయింట్లు పతనమై 51,309 వద్ద స్థిరపడింది. అలాగే ట్రేడింగ్ సమయంలో 15,000 స్థాయిని కోల్పోయిన నిఫ్టీ సూచీ చివరికి మూడు పాయింట్ల స్వల్ప నష్టంతో 15,106 వద్ద నిలిచింది. బ్యాంకింగ్ షేర్లతో పాటు ఆర్థిక, ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఐటీ, ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంకు, రియల్టీ రంగ షేర్లు లాభపడ్డాయి. ‘‘సూచీలు గరిష్ట స్థాయిలకు చేరుకోవడాన్ని ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు అవకాశంగా మలుచుకున్నారు. అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్ షేర్లలో విపరీతమైన అమ్మకాలు జరిగాయి. మరోవైపు ఆటో, రియల్టీ, కన్జూమర్ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లలో చెప్పుకొదగిన స్థాయిలో కొనుగోళ్లు నెలకొన్నాయి. ఫలితంగా సూచీలు ఇంట్రాడేలో భారీ ఒడిదుడుకులతో ట్రేడయ్యాయి. అమెరికా కంపెనీల క్వార్టర్ ఫలితాలు మెరుగ్గా ఉండటంతో అక్కడి మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇది మన మార్కెట్‌కు ఊరటనిచ్చే అంశంగా మారొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకుడు వినోద్ నాయర్ తెలిపారు. కొనసాగిన ఒడిదుడుకులు... అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలను అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 27 పాయింట్ల లాభంతో 51,356 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 15,119 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మెరుగైన క్యూ3 ఫలితాలను ప్రకటించిన కంపెనీ షేర్లు రాణించడంతో ఉదయం సెషన్లో సెన్సెక్స్ 184 పాయింట్లు పెరిగి 51,513 వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు ఎగసి 15,168 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో సూచీల గరిష్టస్థాయిల వద్ద ఒక్కసారిగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, నెస్లే ఇండియా, ఎస్బీఐ షేర్లలో విక్రయాలు జరగడంతో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఫలితంగా సూచీలు ఉదయం ఆర్జించిన లాభాలన్నీ హరించుకుపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం నుంచి 667 పాయింట్లను నష్టపోయి 50,846 వద్దకు, నిఫ్టీ ఇండెక్స్ ఇంట్రాడే హై నుంచి 191 పాయింట్లు నష్టపోయి 14,977 స్థాయికి దిగివచ్చాయి. అయితే చివరి అరగంటలో ఆటో, రియల్టీ, కన్జూమర్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. -
మూడో రోజూ నష్టాలే...
స్టాక్ మార్కెట్ నష్టాలు శుక్రవారం కూడా కొనసాగాయి. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం, అమెరికా ఉద్దీపన ప్యాకేజీ మరింత ఆలస్యం కానుండటం, సవరించిన స్థూల రాబడి(ఏజీఆర్) బకాయిల విషయమై సుప్రీం కోర్ట్ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న అనిశ్చితి, బ్యాంక్, ఆర్థిక, వినియోగ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ మార్కెట్ పతనమైంది. స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 6.93%కి చేరడంతో రేట్ల కోత ఆశలు ఆవిరి కావడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు క్షీణించి 74.90కు చేరడం, వాహన కంపెనీల క్యూ1 ఫలితాలు నిరాశపరచడం, అమెరికా–చైనాల మధ్య చర్చల విషయమై అనిశ్చితి నెలకొనడం..... ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 433 పాయింట్లు పతనమై 37,877 పాయింట్ల వద్ద, నిఫ్టీ 122 పాయింట్లు నష్టపోయి 11.178 పాయింట్ల వద్ద ముగిశాయి. వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 163 పాయింట్లు, నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయాయి. 866 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్..... ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా, మన మార్కెట్ లాభాల్లోనే ఆరంభమైంది. మధ్యాహ్నం వరకూ పరిమిత శ్రేణి లాభాల్లో కదలాడింది. మధ్యాహ్నం గం.2 తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. ఒక దశలో 231 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ మరో దశలో 655 పాయింట్ల మేర నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 886 పాయింట్ల రేంజ్లో కదలాడింది. చైనాలో పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలు గణాంకాలు నిరాశపరిచాయి. దీంతో అంతర్జాతీయంగా రికవరీపై అనిశ్చితి నెలకొనడంతో ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ► మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 3 శాతం నష్టంతో రూ.610 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో ఐదు షేర్లు–సన్ ఫార్మా, ఎన్టీపీసీ, టాటా స్టీల్, టైటాన్, ఇన్ఫోసిస్‌లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 25 షేర్లు నష్టపోయాయి. ► ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.55 కోట్ల నష్టాలు రావడంతో ఐషర్ మోటార్స్ షేర్ 7 శాతం నష్టంతో రూ.20,130 వద్ద ముగిసింది. ► దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. మైండ్‌ట్రీ,లుపిన్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► మొత్తం 230 షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. యస్ బ్యాంక్, లెమన్ ట్రీ హోటల్స్, అలోక్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
ఆర్థిక సంవత్సరంలో 25 శాతం ర్యాలీ
2009-10 తర్వాత ఇదే పెద్ద అప్‌ట్రెండ్ ఫార్మా షేర్ల జోరు పెరిగిన వాహన, బ్యాంకింగ్ షేర్లు తగ్గిన మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు ఈ మార్చి31తో ముగిసిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఈ సెన్సెక్స్ 25 శాతం వృద్ధి సాధించింది. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఇదే అత్యుత్తమ వృద్ధి. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక విదేశీ నిధులు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సర కాలానికి 5,571 పాయింట్లు పెరిగింది. గత ఏడాది మార్చి 31న 22,386గా ఉన్న సెన్సెక్స్ ఈ ఏడాది మార్చి 31 నాటికి 27,957 పాయింట్లకు ఎగసింది. ఇక నిఫ్టీ 1,787 పాయింట్లు(27 శాతం) లాభపడింది. 2014-15లోనేసెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిలను చేరాయి. మార్చి 4న సెన్సెక్స్ 30,025 పాయింట్లను, నిఫ్టీ 9,119 పాయింట్ల(ఇవి రెండూ ఆల్‌టైమ్ హై)ను తాకాయి. అన్ని రంగాల సూచీల్లో బీఎస్ఈ హెల్త్‌కేర్ సూచీ అత్యధికంగా లాభపడింది. ఈ సూచీ 70 శాతం ఎగసింది. 25 ఫార్మా షేర్లలో 12కు పైగా వంద శాతం పెరగడం విశేషం. వాహన, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ సూచీలు 30-44 శాతం రేంజ్లో పెరిగాయి. మెటల్ అండ్ ఆయిల్, గ్యాస్ ఇండెక్స్‌లు 3-6 శాతం రేంజ్లో పడిపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలను మించి 50 శాతానికి పైగా పెరిగాయి. కాగా గత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ మార్కెట్లు నుంచి భారత కంపెనీలు రూ.58,801 కోట్లు సమీకరించాయి. 2010-11లో ఇది రూ.72,143 కోట్లు. 2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే నిధుల సమీకరణకు 2014-15 ఉత్తమ సంవత్సరమని ప్రైమ్ డేటా సంస్థ తెలిపింది. అయితే 2015 మార్చి నెలలో సెన్సెక్స్ 4.8 శాతం తగ్గింది. 2013 ఫిబ్రవరి నుంచి చూస్తే ఇదే అధ్వాన క్షీణత. సెషన్‌కు రూ.11,000 కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద గత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సంపద రూ.27 లక్షల కోట్లు పెరిగింది. ఒక్కో ట్రేడింగ్ సెషన్ పరంగా చూస్తే రూ.11,000 కోట్లు వృద్ధి చెందింది. విదేశీ నిధులు వెల్లువెత్తడంతో షేర్ల ధరలు దూసుకుపోయాయి. దీంతో కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్, ఇన్వెస్టర్ల సంపద పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో 240 ట్రేడింగ్ సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.27.34 లక్షల కోట్లు పెరిగి గత నెల 31 నాటికి రూ.101.49 లక్షల కోట్లకు చేరింది. సుస్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడం, ద్రవ్యోల్బణం తగ్గుతుండడం వంటి కారణాల వల్ల స్టాక్ మార్కెట్ భారీ వృద్ధి సాధించిందని నిపుణులంటున్నారు.