జవాన్ల ఆహారానికి కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వద్ద కాపలా కాస్తున్న సైనికులకు నాణ్యమైన ఆహారం అందించడానికి సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. తమకు నాణ్యతలేని ఆహారం పెడుతున్నారంటూ ఇటీవల తేజ్ బహదూర్ యాదవ్ అనే జవాను ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేయగా, దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా బీఎస్ఎఫ్ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించడం తెలిసిందే.
ఆరోపణలు చేసిన జవాను అవిధేయుడనీ, మత్తులో తూగుతూ గతంలో పై అధికారి మీదకు తుపాకీ కూడా ఎక్కు పెట్టాడని బీఎస్ఎఫ్ పేర్కొంది. ఈ ఆరోపణలను తేజ్ బహదూర్ యాదవ్ కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు.