BSR Congress Party
-
6 తర్వాత బీజేపీలో బీఎస్సార్సీపీ విలీనం
సాక్షి, బళ్లారి(కర్ణాటక): ఈ నెల ఆరో తేదీ తర్వాత తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని బీఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బి. శ్రీరాములు తెలిపారు. ఆయన ఆదివారం కంప్లిలో విలేకరులతో మాట్లాడారు. దేశ శ్రేయస్సు దృష్ట్యా పార్టీని విలీనం చేస్తామన్నారు. బీజేపీ అంతర్గత కుమ్ములాటలతోనే రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కేజేపీ విలీనంతో బీజేపీకి కొండంత బలం వచ్చిందని పేర్కొన్నారు. తర్వాత బళ్లారిలో విలేకరులతో మాట్లాడుతూ బళ్లారి ఎంపీ శాంత, కంప్లి ఎమ్మెల్యే సురేష్‌బాబు, మిత్రులు గాలి జనార్దనరెడ్డి, గాలి సోమశేఖరరెడ్డి తదితర పార్టీ నేతలతో మాట్లాడి నాలుగైదు రోజుల్లో పార్టీ విలీనంపై ప్రకటన చేస్తానన్నారు. తాను బళ్లారి నుంచి ఎంపీగా పోటీ చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. -
అక్రమ మైనింగ్ కేసులో ఎమ్మెల్యే సురేశ్ బాబుకు రిమాండ్!
కర్నాటకలో బెలికెరి పోర్టు నుంచి అక్రమంగా ఇనుప ఖనిజం తరలించారనే కేసులో బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సురేష్ బాబుకు సీబీఐ ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 27 వరకు జుడిషియల్ కస్టడీ విధించింది. అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్ లో ఉన్న గాలి జనార్ధన రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సురేశ్ బాబును సీబీఐ గురువారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం శుక్రవారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. కర్నాటక లోకయుక్తా ఎన్ సంతోష్ హెగ్డే అక్రమ కుంభకోణంపై ఆరోపణలు చేశారు. ఈ కేసులో 2006-2007, 2010-11 సంవత్సర మధ్యకాలంలో 7.74 మిలియన్ల ఖనిజ సంపదను అక్రమంగా తరలించారని ఆరోపణల్ని నివేదికలో పేర్కొన్నారు.