BTech counseling
-
ఇంజనీరింగ్‌లో 45 రకాల కోర్సులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షనకు ఆదివారం అర్ధరాత్రి నుంచే అవకాశం కలి్పంచేలా ఏర్పాట్లు చేసినా, సాంకేతిక కారణాలతో సోమవారం మధ్యాహ్నం 3 గంటల తరువాత మొదలైంది. ఈనెల 20తో సరి్టఫికెట్ల వెరిఫికేషన్, 22తో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి చేసేలా, 24న సీట్ల కేటాయింపును ప్రకటించేలా అధికారులు ఇదివరకే షెడ్యూలు జారీ చేశారు. ఇక సోమవారం సాయంత్రం వరకు 57,530 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, అందులో 51,880 మంది సరి్టఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వారిలో 10,032 మంది వెబ్ ఆప్షన్లను ఇచ్చుకున్నారు. కోర్సుల వివరాల్లో పలు మార్పులు, చేర్పుల తరువాత కనీ్వనర్ కోటాలో 72,998 సీట్లు అందుబాటులో ఉన్నాయని.. ఇంజనీరింగ్‌లో 69,116, ఫార్మసీలో 3,882 సీట్లున్నట్లు ప్రవేశాలు కమిటీ వెల్లడించింది. ఇంజనీరింగ్‌లో 45 రకాల కోర్సులను అనుమతించగా, ఫార్మసీలో రెండు కోర్సులను అనుమతించింది. కొత్త కోర్సులు, ప్రధాన బ్రాంచీల్లోని సీట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 126 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్ 168, సీఎస్ఈ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెరి్నంగ్) 5,310, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ 126, కంప్యూటర్ ఇంజనీరింగ్ 42, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ 252, సీఎస్ఈ(సైబర్ సెక్యూరిటీ) 1,806, సీఎస్ఈ (డాటా సైన్స్) – 3,213, సీఎస్‌ఐటీ 336, సీఎస్ఈ (నెట్ వర్క్స్) 126, సీఎస్ఈ (ఐవోటీ) 1,281, కంప్యూటర్ ఇంజనీరింగ్ 210, సీఎస్ఈ 16,681, ఈసీఈ 13,397, సివిల్ 6,378, ఈఈఈ 6,907, ఐటీ 4,650, మెకానికల్ 5,980, మైనింగ్ 328 సీట్లు. -
9 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 9 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలు చేపట్టాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. గతేడాది విధానంలోనే ఈసారి కూడా ప్రవేశా లు చేపట్టాలని నిర్ణయించారు. రెండు దశల కౌన్సెలింగ్ తరువాత వచ్చే నెల 4న స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించనున్నారు. స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను https://tseamcet.nic.in వెబ్సైట్లో అందుబాటు లో ఉంచనున్నారు. నవంబర్ 5వ తేదీ నాటికి ప్రవేశాలు పూర్తయితే ఇంజనీరింగ్ తరగతులను నవంబర్ 10 లేదా 15వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. (చదవండి: ‘అడ్వాన్స్డ్’లో తెలుగోళ్లు) సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 36 హెల్ప్‌లైన్ కేంద్రాలు కరోనా నిబంధనలు పాటిస్తూనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం 36 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్ట నుంది. ప్రతి అర గంటకో స్లాట్ ఉండేలా కస రత్తు చేసింది. విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో హెల్ప్‌లైన్ సెంటర్, తేదీ, సమయాన్ని పేర్కొంటూ ఆన్లైన్ ద్వారానే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా సమయాల్లో సంబంధిత హెల్ప్‌లైన్ కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసుకొనేలా కమిటీ ఏర్పాట్లు చేసింది. ప్రాసెసింగ్ ఫీజును ఎస్సీ, ఎస్టీలకు రూ. 600గా, ఇతర విద్యార్థులకు రూ. 1200గా నిర్ణయించింది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లో బుధవారం అందుబాటులో ఉంచనుంది. (చదవండి: డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు: సజ్జనార్) -
ఎస్ఆర్ఎంలో చేరేందుకు విద్యార్థుల ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు తమ యూనివర్సిటీలో చేరేందుకు ఆసక్తి కనబరిచారని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పేర్కొంది. ఈనెల 11న బీటెక్‌లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రారంభమైందని, 20న ముగియనున్న బీటెక్ కౌన్సెలింగ్‌లో అనేక మంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌ను ఎంచుకున్నారని ఓ ప్రకటనలో తెలిపింది. 15 రాష్ట్రాలకు చెందిన టాప్ 100 మందికి స్కాలర్షిప్లను ఇవ్వనున్నట్లు వివరించింది. వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబర్చిన 9 మంది విద్యార్థులకు తొలిసారిగా గోల్డ్ మెడల్స్, సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు పేర్కొంది. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడమే కాకుండా నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు తాము ఎంతగానో కృషి చేస్తున్నామని ఎస్ఆర్ఎం విద్యా సంస్థల వ్యవస్థాపక చాన్స్‌లర్ టీఆర్ పారివేందర్ పేర్కొన్నారు.