BTP
-
బీజేపీలో చేరిన కొడుకు.. కీలక నిర్ణయం తీసుకున్న తండ్రి
గుజరాత్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీలు మారేవారి సంఖ్య పెరిగిపోతోంది. గుజరాత్‌కు చెందిన గిరిజన నాయకుడు ఛోటు వాసవ.. తన కొడుకు పార్టీ మారడంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఛోటు వాసవ కుమారుడు & భారతీయ గిరిజన పార్టీ (BTP) అధ్యక్షుడు మహేష్ వాసవ.. భారతీయ జనతా పార్టీలో చేరారు. దీంతో దేశంలోని గిరిజనుల హక్కుల కోసం పోరాడేందుకు 'భారత్ ఆదివాసీ సంవిధాన్ సేన' (BASS) అనే కొత్త సంస్థను ఏర్పాటు చేసినట్లు ఛోటు వాసవ తెలిపారు. ఇది కేవలం సామజిక సేవ కోసం మాత్రమే ఇది రాజకీయ సంస్థ కాదని ఛోటు పేర్కొన్నారు. అయితే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాను ఏ బ్యానర్లో పోటీ చేయాలనుకుంటున్నానో త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. డబ్బు, అధికార దాహంతోనే తన కొడుకు మహేష్ వాసవ బీజేపీ పార్టీలో చేరాడని, ఎప్పటికీ సమాజం అతన్ని క్షమించదని ఛోటు వాసవ అన్నారు. గత ఏడాది రాజస్థాన్‌లో భారత్ ఆదివాసీ పార్టీ స్థాపించారు. ఈ పార్టీ సభ్యులు గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు సాధించారు. కాగా శుక్రవారం ఛోటు వాసవతో బీఏపీ సభ్యులు భేటీ కానున్న సమాచారం. ఆ తరువాత ఎన్నికల్లో పోటీ చేయడంపై కూడా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. చోటు వాసవ స్థాపించిన పార్టీలో కుమారుడు మహేష్ వాసవ అధ్యక్షుడిగా నాయకత్వం వహించారు. చిన్న కుమారుడు దిలీప్ వాసవ బీఏపీ ఉపాధ్యక్షుడు. అయితే మార్చి 11న మహేష్ వాసవ పార్టీని బీజేపీలోకి విలీనం చేశారు. కాగా చోటు వాసవ స్థాపించిన భారత్ ఆదివాసీ సంవిధాన్ సేన సంస్థను త్వరలోనే పాన్ ఇండియా విస్తరిస్తామని చెప్పారు. यह #भारतीय_आदिवासी_सेना सामाजिक संगठन है राजकीय नही लोकसभा चुनाव किस बैनर तले लड़ेंगे वह कुछ दिनों में बताएंगे! https://t.co/QcfFk6apGw — Chhotubhai Vasava (@Chhotu_Vasava) March 27, 2024 -
వేదన తీర్చిన వేదావతి
రాయదుర్గం(అనంతపురం): జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటైన బైరవానితిప్ప (బీటీపీ) ప్రాజెక్టుకు చరిత్రలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో వరదనీరు కొనసాగుతోంది. ఈ క్రమంలో వేదావతి ఉగ్రరూపం దాల్చింది. గుమ్మఘట్ట మండలంలోని బైరవానితిప్ప గ్రామం వద్ద 1954లో వేదావతి నదిపై రూ.1.5 కోట్లతో 2.5 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టి 1961లో పూర్తిచేశారు. 1981–82 మధ్య కాలంలో 8 గేట్లు తెరిచి 12 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసిన రికార్డు మాత్రమే ఇప్పటిదాకా ఉంది. రికార్డు బద్దలు.. క్యాచ్మెంట్ ఏరియా కర్ణాటకలో ఉండడం, అక్కడ విస్తారంగా వానలు కురవడం వెరసి ఈ ఏడాది జూలై చివర్లోనే రిజర్వాయర్ వరద నీటితో తొణకిసలాడింది. క్రమేణ నీటి ప్రవాహం పెరగడంతో పాటు వేదావతి నదిపై నిర్మించిన వాణివిలాస్ ప్రాజెక్ట్ కూడా 88 ఏళ్ల తర్వాత మరువ పారింది. వీటి మధ్య చిన్న కుంటలు, చెక్‌డ్యామ్‌లు, చెరువులు తెగి ఉగ్రరూపం దాల్చి ప్రమాదకరంగా దిగువకు నది పరవళ్లు తొక్కింది. ఈ కారణంగా ఆగస్టు 5న నీటి విడుదలకు శ్రీకారం చుట్టారు. 45 రోజుల పాటు ఏకంగా 28 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయడం ఓ రికార్డయితే సెప్టెంబర్ 7న 10 గేట్లు తెరిచి 65 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడం విశేషం. వర్షాలు తగ్గుముఖం పట్టినా 4,500 క్యూసెక్కుల ఇన్‌ప్లో కొనసాగుతుండగా 2 క్రస్టు గేట్లు తెరిచి 4,500 క్యూసెక్కుల మేర నీటిని వదులుతున్నారు. స్తంభించిన జనజీవనం.. రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు తదితర ప్రాంతాలను అనుసంధానం చేస్తూ వేదావతి హగరి ప్రవహిస్తోంది. ఈ కారణంగా గత 45 రోజుల నుంచి హగరి పరివాహ గ్రామాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం మండలాలను కలిపే వేపులపర్తి కాజ్వే దెబ్బతినడంతో పాటు నీటి ఉధృతి తగ్గలేదు. దీంతో రాకపోకలు ఆగిపోయాయి. ఈ క్రమంలో కళ్లెదుటే కనిపించే గ్రామాలకు సైతం 20 కిలోమీటర్లు చుట్టుకుని వెళ్లే పరిస్థితి ఏర్పడింది. -
బీజేపీకి కాంగ్రెస్ మద్దతిస్తోంది.. ఇక మేమెందుకు?
జైపూర్: రాజస్తాన్‌లోని అధికార కాంగ్రెస్ పార్టీ.. బీజేపీతో కలిసి పనిచేస్తోందని భారతీయ ట్రైబల్ పార్టీ(బీటీపీ) ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు ఒక్కటేనని బీటీపీ సీనియర్ నేత ఒకరు విమర్శలు గుప్పించారు. ఒకవేళ అదే జరిగితే తాము కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు. ‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటే . రాజస్థాన్ ప్రభుత్వం నుంచి భారతీయ ట్రైబల్ పార్టీ తమ మద్దతును ఉపసంహరించుకుంటాం’ బీటీపీ వ్యవస్థాపకుడు చోటుభాయ్ వాసవ ట్వీట్ చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉపసంహరణతో ప్రభుత్వ మెజారిటీని ప్రభావితం చేయలేదు కానీ, చిన్న పార్టీ అయిన బీటీపీని జిల్లా స్థాయి బోర్డు బాధ్యతలు తీసుకోకుండా చేయటానికి కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపాయి. ఇటీవల స్థానిక ఎన్నికలు జరిగిన తరుణంలో జిల్లా, గ్రామ స్థాయిలో సభ్యులను ఎన్నుకోవటానికి బీటీపీ ప్రయత్నాలు చేస్తోంది. దుంగార్పూర్ జిల్లా పరిషత్‌లో ఎన్నికల్లో 27 స్థానాలకు గాను బీటీపీ పార్టీ 13 మంది సభ్యులను గెలుచుకుంది. కాగా మెజారిటీ 14 స్థానాలు కావడంతో జిల్లాలో పంచాయతీ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరింది. కానీ కాంగ్రెస్ పార్టీ బీటీపీకి మద్ధతు ఇవ్వకుండా బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులతో బోర్డు ఏర్పాటు చేయడానికి మద్ధతు ఇచ్చింది. కాంగ్రెస్ ఓటు శాతం ఉన్న ప్రాంతాలలో బీటీపీ పార్టీ తన స్థావరాన్ని మెరుగుపరుస్తోందనే కాంగ్రెస్ పార్టీలో ఆందోళన వెల్లడవుతుంది. దక్షిణ రాజస్థాన్‌లో ట్రైబల్ పార్టీకి బలమైన స్థావరం ఉంది. ఈ ఏడాది ఆరంభంలో డిప్యూటి సీఎం సచిన్ పైలట్ తన అనుచర వర్గంతో ప్రభుత్వానిక వ్యతిరేకంగా తిరుగుబాటు చేపిన విషయం విధితమే. తరువాత అశోక్ గెహ్లోట్ ప్రభుత్వానికి మద్దతు తెలుపడం వల్ల బీటీపీ మోసపోయినట్లు అనిపిస్తుంది. జైపూర్‌లోని ఒక రిసార్ట్‌లో కాంగ్రెస్ తన అనుచరులను కాపలా కాస్తుండగా, ఇద్దరు బీటీపీ ఎమ్మెల్యేలు నగరం విడిచి వెళ్ళకుండాపోలీసులు ఆపే వీడియోను పోస్ట్ చేశారు. అయినప్పటికీ, వారు తొందరలోనే మిస్టర్ అశోక్ గెహ్లాత్‌తో అతని ఎమ్మెల్యేలతో కలసి దిగన ఫోటోలలో బయటపడ్డారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కలిస్తే కాంగ్రెస్‌కు మెజారిటీ పెరుగుతుంది. 200 మంది సభ్యుల గల అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 106 మంది ఎమ్మెల్యేలతో పాటు 12 మంది స్వతంత్రుల అభ్యర్థులు ఉన్నారు. -
పోలీసు అవబోయి ఎమ్మెల్యేగా!!
జైపూర్: రాజ్‌కుమార్ రోట్.. నిన్నటివరకు సాధారణ మధ్యతరగతి యువకుడు. పోలీసు రిక్రూట్మెంట్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగి. మూడు నెలల క్రితం ఎన్నికల్లో పోటీ చేయమని ఓ పార్టీ అడిగితే సరే అన్నారు. అనూహ్య రీతిలో విజయం సాధించారు. పోలీసు కాబోయి ఎమ్మెల్యే అయ్యారు. త్వరలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న రాజ్‌కుమార్.. రాజస్తాన్ అసెంబ్లీలో గిరిజనుల ప్రతినిధిగా అడుగుపెట్టనున్నారు. దుంగార్పూర్లోని ఖూనియా గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. దీంతో ఛోరసీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాల్సిందిగా భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) రాజ్‌కుమార్‌ను కోరింది. సరేనన్నారు. బీజేపీ అభ్యర్థి సుశీల్ కటారాపై 12,934 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. -
యువకుడు దుర్మరణం
రాయదుర్గంటౌన్/ రూరల్ : పట్టణంలోని బీటీపీ రోడ్డు రైల్వే గేటు సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. రాయదుర్గంలోని చర్చి ఏరియాలో నివాసముంటున్న గొల్ల భాస్కర్ (34) రాజీవ్ గాంధీ కాలనీలో నివాసముంటున్న తన బావమరిది బేల్దారి గొల్ల సుధాకర్‌తో కలిసి గుమ్మఘట్ట మండలం తాళ్లకెర గ్రామానికి ద్విచక్ర వాహనంపై బయల్దేరి వెళ్ళాడు. రైల్వే గేటు దాటిన తరువాత రోడ్డుపై కుక్క అడ్డుగా రావడతో అదుపు తప్పి కిందపడ్డారు. తీవ్రగాయాలతో ఉన్న ఇద్దరినీ రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలోనే భాస్కర్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
మానవమృగం చేతిలో ఇద్దరి జీవితాలు బలి
మానవమృగం ఉదంతంలో మరిన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లికి ముందు నుంచే ఆషాబీతో సన్నిహితంగా ఉంటున్న మృగం.. సొంత అక్క కూతుర్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకు కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో బలవంతంగా ఆమెను తిరుపతికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల తరువాత పాత సంబంధాన్ని కొనసాగించాడు. ఈ విషయంగా దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. చివరకు ఆమె ఆత్మహత్యకు కారకుడయ్యాడు. మరోవైపు తాను నెల తప్పానని, వెంటనే పెళ్లి చేసుకోవాలని ఆషాబీ కోరగా, ఆ దుర్మార్గుడు చెయ్యి చేసుకోవడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఆ విధంగా మానవమృగం చేతిలో అమాయకులైన ఇద్దరు అమ్మాయిలు బలయ్యారు. అయితే తనకున్న రాజకీయ పలుకుబడితో కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితుడు ప్రయత్నించడం చర్చనీయాంశమైంది. చిత్తూరు జిల్లా గుమ్మఘట్ట మండలం బీటీ ప్రాజెక్ట్(బీటీపీ)కు చెందిన టీడీపీ నాయకుడి సోదరుడు బెస్త రఘు ఆకృత్యాలకు అమాయకులైన ఇద్దరు అమ్మాయిలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. తొలుత తన అక్క కుమార్తె కవితను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అప్పటికే అతను ఆషాబీతో సన్నిహితంగా ఉండడంతో కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. అయితే పట్టువదలకుండా అక్క కుమార్తెను బలవంతంగా పిల్చుకెళ్లి తిరుపతిలో రహస్యం గా పెళ్లి చేసుకున్నాడు. ఐదు నెలలు తిరక్కనే పాత పరిచయం కొనసాగించడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసి భార్య కవిత నిలదీసింది. అప్పటి నుంచి ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. ఈ జీవితం వద్దనుకున్న కవిత పురుగుల మందు అప్పట్లో తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే బంధువులే కావడంతో సునాయసంగా ఆ కేసు నుంచి తప్పించుకోగలిగాడు. పెళ్లి పేరుతో వంచన తండ్రి ఆదరణ లేని ఆషాబీపై కన్నేసిన రఘు ఆమెతో చనువు పెంచుకున్నాడు. ఆ తరువాత తన మాయమాటలతో ఆమెను లొంగితీసుకున్నాడు. అప్పటి నుంచి తరచూ ఆమెను కలిసేవాడు. ఈ నేపథ్యంలో ఆమె నెల తప్పినట్లు తెలుస్తోంది. వెంటనే తనను పెళ్లి చేసుకోవాలని ఆమె పోరుపెట్టినట్లు సమాచారం. అందుకు రఘు అంగీకరించకపోవడంతో వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆమె తల్లితో కలసి మేనమామ ఇంటికి వెళ్లడంతో అతను గొడవకు దిగాడు. ఆ తరువాత ఆషాబీపై చెయ్యి చేసుకోవడం, అడ్డుకోబోయిన ఆమె తల్లిపైనా దాడి చేయడంతో అవమానభారంతో ఆషాబీ ఆత్మహత్య చేసుకుంది. ఆ తరువాత తనూ ఆత్మహత్యాయత్నం నాటకం ఆడినట్లు తెలుస్తోంది. కేసు తారుమారుకు యత్నం తన అన్న టీడీపీ నాయకుడు కావడంతో రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తాజా కేసు నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం బళ్లారి ఆస్పత్రిలో చేరిన నిందితుడు రఘు అక్కడి నుంచే చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఆషాబీ ఉదంతంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి, నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని మహిళ, ప్రజా సంఘాల ప్రతినిధులు బుధవారం డిమాండ్ చేశారు.