గుజరాత్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీలు మారేవారి సంఖ్య పెరిగిపోతోంది. గుజరాత్‌కు చెందిన గిరిజన నాయకుడు ఛోటు వాసవ.. తన కొడుకు పార్టీ మారడంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఛోటు వాసవ కుమారుడు & భారతీయ గిరిజన పార్టీ (BTP) అధ్యక్షుడు మహేష్ వాసవ.. భారతీయ జనతా పార్టీలో చేరారు. దీంతో దేశంలోని గిరిజనుల హక్కుల కోసం పోరాడేందుకు 'భారత్ ఆదివాసీ సంవిధాన్ సేన' (BASS) అనే కొత్త సంస్థను ఏర్పాటు చేసినట్లు ఛోటు వాసవ తెలిపారు. ఇది కేవలం సామజిక సేవ కోసం మాత్రమే ఇది రాజకీయ సంస్థ కాదని ఛోటు పేర్కొన్నారు. అయితే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాను ఏ బ్యానర్‌లో పోటీ చేయాలనుకుంటున్నానో త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.
డబ్బు, అధికార దాహంతోనే తన కొడుకు మహేష్ వాసవ బీజేపీ పార్టీలో చేరాడని, ఎప్పటికీ సమాజం అతన్ని క్షమించదని ఛోటు వాసవ అన్నారు. గత ఏడాది రాజస్థాన్‌లో భారత్ ఆదివాసీ పార్టీ స్థాపించారు. ఈ పార్టీ సభ్యులు గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు సాధించారు. కాగా శుక్రవారం ఛోటు వాసవతో బీఏపీ సభ్యులు భేటీ కానున్న సమాచారం. ఆ తరువాత ఎన్నికల్లో పోటీ చేయడంపై కూడా నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
చోటు వాసవ స్థాపించిన పార్టీలో కుమారుడు మహేష్ వాసవ అధ్యక్షుడిగా నాయకత్వం వహించారు. చిన్న కుమారుడు దిలీప్ వాసవ బీఏపీ ఉపాధ్యక్షుడు. అయితే మార్చి 11న మహేష్ వాసవ పార్టీని బీజేపీలోకి విలీనం చేశారు. కాగా చోటు వాసవ స్థాపించిన భారత్ ఆదివాసీ సంవిధాన్ సేన సంస్థను త్వరలోనే పాన్ ఇండియా విస్తరిస్తామని చెప్పారు.
यह #भारतीय_आदिवासी_सेना सामाजिक संगठन है राजकीय नही
— Chhotubhai Vasava (@Chhotu_Vasava) March 27, 2024
लोकसभा चुनाव किस बैनर तले लड़ेंगे वह कुछ दिनों में बताएंगे! https://t.co/QcfFk6apGw
Comments
Please login to add a commentAdd a comment