btroads
-
గ్రామీణాభివృద్ధికి పెద్దపీట
సాక్షి, మరికల్: ‘‘ఊరికి మరిన్ని మెరుపులు మెరిపించాలనే ఉద్దేశంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా అడుగలు వేసింది. ఉపాధి హామీకి మరింత ధీమాను ఇచ్చి.. మారుమూల పల్లెల్లో కూడా అందరికీ విద్యుత్ సౌకర్యం.. గ్రామీణ రోడ్లకు మెరుగులు దిద్దేందుకు నిధులు విడుదల.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు.. స్వచ్ఛభారత్ లక్ష్యానికి అందుకోవడం కోసం ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయడంతోపాటు ప్రతి గ్రామంలో కనీస మౌలిక వసతుల కల్పనకు కేంద్రం పెద్దపీట వేయడంతో గ్రామీణ రంగస్థలం ముస్తాబువుతుంది.’’ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామాల్లో ఏ ఒక్కరూ ఆకలితో ఉండరాదనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మరింత ఊతమిచ్చింది. ఆ దిశగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీలకు గిట్టుబాటు కూలీ కల్పించడంలో ఉపాధి పనులు చేయాడానికి కూలీలు ఉత్సాహం చూపుతున్నారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్జ్యోతి యోజన మారుమూల గ్రామాల్లో కూడా విద్యుత్ కాంతులను నింపేందుకు రూ.125కే విద్యుత్ మీటర్‌ను ఏర్పాటు చేసి గిరిజనుల కుటుంబాల్లో వెలుగు జ్యోతిని నింపేందుకు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్జ్యోతి యోజన పథకం అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన రహదారులు లేని అవాసాలకు కూడా ప్రధాన మంత్రి గ్రామ్‌సడక్ యోజన పథకం బీటీరోడ్లను వేయించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకం ద్వారా గిరిజన ప్రాంతాలకు నాణ్యమైన రోడ్లు వస్తాయానే భరోసా వచ్చింది. గ్రామీణ తాగునీటి పథకం తాగునీటి వనరులు లేని అనేక మారుమూల గ్రామాల్లో, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ తాగునీటి పథకం కింద అక్కడి ప్రజలకు సురక్షితమైన, తాగునీటిని అందించాలనేది ఈ పథకం ప్రధాన ఉద్ధేశం. గ్రామీణ టెలిఫోనీ మారుమూల పంచాయతీలో కూడా వైపై హాట్‌స్పాట్స్, ఇన్స్టలేషన్, హైస్ఫీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కనెక్టివిటీ వంటి సౌకర్యాలను అందించడమే గ్రామీణ టెలిఫోనీ పథకం లక్ష్యం. స్వచ్ఛ్భారత్ బహిరంగ మలవిసర్జన చేయరాదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ పథకం అమలు చేసింది. ఈ పథకం ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రత కోసం ఇంటింటికి మరుగుదొడ్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. ప్రతి గ్రామంలో వందశాతం మరుగుదొడ్లను నిర్మించడమే ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లులేని పేదలకు గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లు నిర్మించి ఇవ్వడం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమల్లోకి వచ్చింది. -
దశాబ్దాల కల నెరవేరింది!
సాక్షి,ఖిల్లాఘనపురం: పల్లెటూర్లు, గిరిజన తండాలు ఎక్కువగా ఉన్న ఖిల్లాఘనపురం మండలంలో పలు గ్రామాలకు, గిరిజన తండాలకు నేటికీ బీటీ రోడ్డు సౌకర్యం లేదు. బీటీ రోడ్లు వేయించాలని గ్రామాలకు, గిరిజన తండాలకు వచ్చే ప్రజా ప్రతినిధులు, అధికారులకు ప్రజలు పలుసార్లు మొరపెట్టుకున్నప్పటికి ఫలితం లేకపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత దశాబ్ధాలుగా బీటీ రోడ్ల కోసం ఎదురు చూస్తున్న పల్లెప్రజలు, గిరిజనుల కల నెరవేరింది. రూ.3.35 కోట్లతో బీటీ రోడ్లు మండలంలోని పలు గ్రామాలు, గిరిజన తండాలకు బీటీ రోడ్ల కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పలు గ్రామాలు, గిరిజన తండాలకు బీటీ రోడ్లు మంజూరయ్యాయి. ఇటీవల పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ వేగంగా పనులు చేపట్టి పూర్తి చేశారు.ఇందులో రూ.0.85 కోట్లతో అంతాయపల్లి నుంచి కొత్తపల్లి వరకు కిలోమీటర్, కోటి రూపాయలతో కమాలోద్ధీన్‌పూర్ అడ్డరోడ్డు నుంచి భూత్పూర్ మండలం పోల్కంపల్లి వరకు 2 కిలోమీటర్లు, రూ. 1.5 కోట్లతో సోళీపురం నుంచి కోతులకుంట తండా వరకు 1.5 కిలో మీటర్ బీటీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఇలా మండలంలోని మూడు రోడ్లకు బీటీ వేసేందుకు ప్రభుత్వం రూ.3.35 కోట్ల నిధులు మంజూరు చేసిందని అధికారులు తెలిపారు. తగ్గిన దూరభారం మండలంలోని కమీలోద్దీన్‌పూర్ అడ్డరోడ్డు నుంచి భూత్పూర్ మండలం పోల్కంపల్లి వరకు బీటీ రో డ్డు వేయడం వలన మండల ప్రజలకు జాతీయ రహదారి దగ్గర కావడంతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు దూరభారం తగ్గింది. గాజులపేట, తాటికొండ తదితర గ్రామాలకు వెళ్లేందుకు అనువుగా ఉంటుంది. అంతాయపల్లి నుంచి కొత్తపల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యమే లేదు. పొలాలగుండా, పొలం గట్ల వెంట ప్రజలు కాలినడకన వెళ్లేవారు. 5ఏళ్ల కిత్రం ఫార్మేషన్ రోడ్డు వేశారు. నేడు బీటీ రోడ్డుగా మార్చారు. సోళీపురం నుంచి కోతులకుంట తండాకు వరకు మట్టిరోడ్డు మాత్రమే ఉండేది. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తరువాత గిరిజనుల కోరిక మేరకు మంత్రి నిరంజన్‌రెడ్డి బీటీ రోడ్డు మంజూరు చేయించడంతో కాంట్రాకర్టర్ ఇటీవలే పనులు పూర్తి చేశారు. -
మట్టి రోడ్లు కనిపించకుండా చేస్తాం
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ కార్పొరేషన్ : నగర శివారు డివిజన్లలో సైతం మట్టి రోడ్లు కనిపించకుండా చేస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం నగరంలోని 5వ డివిజన్ కిసాన్‌నగర్‌లో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.18లక్షలతో చేపట్టనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరం స్మార్ట్‌సిటీ గాæ అవతరించబోతోందని, అందుకుతగ్గట్టుగానే మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రధాన రహదారులన్నీ సుందరీకరణను సంతరించుకుంటున్నాయన్నారు. రోడ్ల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు. మేయర్ రవీందర్‌సింగ్, డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, ఆరిఫ్, లంక రవీందర్, బోనాల శ్రీకాంత్, ఏవీ రమణ, బండారి వేణు, నాయకులు కట్ల సతీశ్, చల్ల హరిశంకర్, పెండ్యాల మహేశ్, సాంబయ్య, అజయ్, శ్రవణ్, సుల్తానా, రాజు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.