విద్యుదాఘాతంతో మహిళ మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ గ్రామంలో విద్యుదాఘాతంతో ఒక మహిళ మృతిచెంది, మరో వ్యక్తికి తీవ్రంగా గాయపడిన సంగతి చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం పొలం పనులకు వెళ్లిన బుచ్చమ్మ (35) కు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన రవి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(హుస్నాబాద్)