బుద్ధభవన్‌తో మూడు దశాబ్దాల అనుబంధం
► ఉప ముఖ్యమంత్రి కడియం
► జ్థాననిధి బుద్దభవన్ : ఎంపీ సీతారాంనాయక్
► ముగిసిన బుద్ధభవన్ 60 వసంతాల వేడుకలు
హన్మకొండ : తాను రాజకీయాల్లోకి వచ్చిన 1987 నుంచి బుద్ధభవన్‌తో పరిచయం ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మూడు రోజులుగా జరుగుతున్న హన్మకొండ కుమార్‌పల్లిలోని బుద్ధభవన్ 60వసంతాల ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన కడియం మాట్లాడుతూ అప్పుడప్పుడే రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో బద్ధభవన్లో జరిగే అన్ని సామాజిక సమావేశాలకు, అధికార పక్షంతో ఎలాంటి పోరాటాలు చేయాలనే సమాలోచనలు చేసే క్రమంలో బుద్దభవన్ పాత్ర అనిర్వచనీయమన్నారు. అప్పుడే భగవాన్‌దాస్‌తో పరిచయం ఏర్పడిందన్నారు.
ప్రభుత్వ సాయం లేకుండా యజ్ఞం లా పనిచేస్తూ బుద్దభవన్ నిర్మాణం చేసుకోవడం గొప్ప విషయం అన్నారు. విశిష్ట అతిధిగా హాజరైన కరీంనగర్ ఎంపి బోయినపెల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతు తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడు జరిగిన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు బుద్దభవన్తో మంచి సం బందాలు ఏర్పడ్డాయని విద్యార్థి దశను గుర్తుచేసుకున్నారు. కాకతీయకెనాల్ ద్వారా కాలనీల కు నీరు తెచ్చిన ఘనత కమ్యూనిస్టుల ఉద్యమానిదే అన్నారు.
నాడు కష్టాన్ని స్పూర్తిగా తీసుకుని నేటి తరం భవిష్యత్తులో ఉన్నత శిఖరాల ను చేరుకోవాలని అన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యమ నేతగా పేదల సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నాడన్నారు. బుద్దభవన్ పునః నిర్మానాణికి తన ఎంపీ నిధుల నుంచి 10లక్షలు మంజూరి చేయిస్తానని హామీ ఇచ్చారు. లైబ్రరీ, హాల్, పార్కింగ్తో బ్రహ్మాండంగా బుద్దభవన్ పునర్మిద్దామన్నారు. మహబూ బా బ్బాద్ ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడు తు తన విద్యార్థి దశలో బుద్దభవన్ ప్రాంతంలో పదేళ్లు అద్దెకు తీసుకుని ఉన్నానని అన్నారు.
అప్పుడు ఇప్పుడూ బుద్దభవన్ లో కూర్చుంటే తెలిరూ. యని మనశ్శాంతి లబిస్తుందని అన్నా రు. భూమి తవ్వితే నిధులు దొరుకుతాయో లేదో కాని బుద్దభవన్లో జ్ఞానినిధి మాత్రం లబిస్తుందని అన్నారు. బుద్దభవన్ అభివృద్దిలో తన వంతు సాయం చేస్తానని అన్నారు. ఈ సందర్బంగా బుద్దభవన్ ప్రాంత పెద్దలను సత్కరించారు. అంతకుముందు ఉదయం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు, క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు వీరగంటి రవీందర్, మిర్యాల్‌కార్ దేవేం దర్, బోడ డిన్నా, జోరిక రమేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రాంచందర్, బీంరావ్ అంబేద్కర్, లెనిన్, రాజ్సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.