తవ్వకాల్లో వెలుగుచూసిన బౌద్ధ అవశేషాలు
విశాఖ జిల్లా మాడుగుల మండలం వొమ్మల పంచాయతీ పరిధిలోని ఉర్లోవకొండ సమీపంలో బౌద్ధ అవశేషాలు బయటపడ్డాయి. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పది మంది సభ్యుల బృందం ఇక్కడ రెండు రోజులుగా తవ్వకాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శనివారం రాత్రి ఓ రెండు అడుగుల విగ్రహం, చిన్న చిన్న రాళ్లు, పాత్రలు లభ్యమైనట్టు పురావస్తు శాఖ ఏడీ చిట్టిబాబు తెలిపారు. సుమారు 5 మీటర్ల లోతు తవ్వకాలు జరపగా, మరో 20 మీటర్ల మేర తవ్వకాలు జరపనున్నట్టు ఆయన చెప్పారు.