బౌద్ధ మహా సమ్మేళనం ప్రారంభం
అమరావతి: ప్రసిద్ధ బౌద్ధారామమైన అమరావతిలో శనివారం బుద్ధిస్ట్ సొసైటీ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర బౌద్ధ మహా సమ్మేళనం శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. తొలుత స్థానిక సత్తెనపల్లిరోడ్డు వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దమ్మజ్యోతిర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ పురవీధుల గుండా సాగిన ర్యాలీ పాత మ్యూజియంలోని మహాస్థూపం వద్దకు చేరుకుంది. అక్కడ శ్రీ చంద్రబోధిపాటిల్ ఆధ్వర్యంలో శ్రామణేర భిక్షువులు, సికింద్రాబాద్కు చెందిన మహాబోధి సొసైటీ భిక్షువులు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెంటర్ ఫర్ మహాయాన బుద్ధిస్ట్ స్టడీస్ సభ్యులతో కలిసి దమ్మప్రవచన కార్యక్రమాన్ని నిర్వహంచారు. అనంతరం శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్æవరకు ర్యాలీ సాగింది. పాఠశాల ఆడిటోరియంలో సుమారు 20 మందికిపైగా బౌద్ధమతం స్వీకరించారు. ఈ సందర్భంగా బౌద్ధ భిక్షువులకు టీ సురేష్ ఆధ్వర్యంలో చీవరదానం నిర్వహిచారు. అనంతరం చంద్రబోధిపాటిల్, అంజనేయరెడ్డి, ఎస్ఎస్అర్ భూపతి, ఆర్.సుబ్బారావు తదితరులు బౌద్ధమత విశిష్టత గురించి వివరించారు. ఈ సందర్భంగా ఏపీ బుద్ధిస్ట్ సొసైటీ అఫ్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరి పిల్లి రాంబాబు మాట్లాడుతూ అంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రతినిధులతో ఏడో రాష్ట్ర బౌద్ధ మహా సమ్మేళనం గురించి చెప్పారు. సభలో బొర్రా గోవర్దన్, వై కొండలరావు, సీహెచ్ స్వరూపరాణి, మట్లా ఝాన్సీరాణి, డాక్టర్ రత్నాకర్ తదితరులు ప్రసంగించారు.