ప్రాజెక్ట్‌ల నిర్మాణానికే అప్పులు చేశాం: ఎంపీ బూర నర్సయ్యగౌడ్
సాక్షి, భూదాన్‌పోచంపల్లి : తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసమే అప్పు చేశామని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. బుధవారం పోచంపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2లక్షల కోట్ల అప్పులు చేశారని ప్రతిపక్షాలు చేస్తున్న గ్లోబల్ ప్రచారాన్ని ఖండించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రూ. 70 కోట్ల అప్పు వారసత్వంగా వచ్చిందన్నారు. అయితే ప్రాజెక్ట్‌లు, మిషన్ భగీరథ, మెట్రో ప్రాజెక్ట్ కోసం పెట్టుబడి కింద రూ. లక్షా పదివేల కోట్లు మాత్రమే అప్పు చేశామని పేర్కొన్నారు. కాని చంద్రబాబు ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టకుండానే రూ.2లక్షల కోట్ల అప్పుచేశారని విమర్శించారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ సార సరస్వతీబాలయ్యగౌడ్, జెడ్పీటీసీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, నాయకులు కందాడి భూపాల్‌రెడ్డి, కోట మల్లారెడ్డి, రావుల శేఖర్‌రెడ్డి, చంద్రంయాదవ్, కర్నాటి రవి, గుండు మధు, బాలనర్సింహ, కందాడి రఘుమారెడ్డి తదితరులు ఉన్నారు.
మరిన్ని వార్తాలు...