సహకార ఉద్యమ బలోపేతానికి ప్రోత్సాహం
సహకార ఉద్యమం, బలోపేతం, మంత్రి యనమల
ఆర్థిక మంత్రి యనమల
బోట్‌క్లబ్ (కాకినాడ):
రాష్ట్రంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహం, సహాయం అందిస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. స్థానిక రామారావుపేటలో కొత్తగా నిర్మించిన జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ గొడౌన్, కార్యాలయ భవనం, 50 కేవీ రూఫ్ టాప్ సోలార్ ఫ్లాంట్లను ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల మంగళవారం ప్రారంభించారు. యనమల మాట్లాడుతూ దేశంలో సహకార వ్యవస్థ అత్యంత ప్రాముఖ్యత కలిగిన వ్యవస్థ అన్నారు. సహకార వ్యవస్థ బలోపేతమైతే ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. డీసీఎంఎస్‌లు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు« దోహదం చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. నష్టాల్లో ఉన్న డీసీఎంఎస్‌ను తిరిగి లాభాల బాటలోకి తెచ్చిన సంస్థ చైర్మ¯ŒS కె.వి.సత్యనారాయణరెడ్డి, డైరెక్టర్లను అభినందించారు.
ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ డీసీఎంఎస్ ఎరువుల వ్యాపారంతో పాటు లాభసాటైన అన్ని వ్యాపారాలను చేపట్టి ఆర్థికంగా ముందుకు సాగాలన్నారు. డీసీఎంఎస్‌లకు సామర్లకోట, తుని, అమలాపురం పట్టణాల్లో విలువైన స్థలాలు ఉన్నాయని, వాటిని షాపింగ్ కాంప్లెక్సులుగా నిర్మించి ఆదాయ వనరులు పెంచుకోవాలని సూచించారు. డీసీఎంఎస్ చైర్మ¯ŒS సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టినాడు సంస్థ రూ.కోటి 25 లక్షల నష్టాల్లో ఉండేదని, ప్రస్తుతం రూ.రెండు లక్షల లాభంలో ఉందన్నారు. నూతనంగా నిర్మించిన కార్యాలయ భవనంపై 50 కేవీ సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా సొంత అవసరాలు తీరతాయని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, చిర్ల జగ్గిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ¯ŒS ఎ¯ŒS.వీర్?రడ్డి, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, డీసీసీబీ సీఈవో మంచాల ధర్మారావు, డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లు పాల్గొన్నారు.