బావిలో బిందె తీయబోయి.. మృత్యువాత
బురదలో చిక్కుకోవడంతో ఘటన
హసన్పర్తి : బావిలో పడిన బిందెను తీయబోయి ఓ వ్యక్తి బురదలో చిక్కుకొని మృతిచెందిన సంఘటన హసన్పర్తి మండలం హరిశ్చంద్రనాయక్ తండాలో మంగళవారం జరిగింది. హరిశ్చంద్రనాయక్ తండాకు చెందిన భూక్య వస్రం(45) వ్యవసాయ కూలీ. అతడి ఇంటి పక్కనే ఉన్న నూనావత్ సమ్మయ్యకు చెందిన బిందె బావిలో పడింది. దీంతో సమ్మయ్య ఆ బిందె తీయాలని కోరగా వస్రం బా విలోకి దిగాడు. బిందె తీస్తున్న క్రమంలో బురదలో చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు వదిలాడు. సమాచారం అం దుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వస్రం మృతదేహాన్ని బయటికి తీసి పంచనామా నిర్వహిం చారు. మృతుడి కుమారుడు భూక్యఅనిల్ ఫిర్యాదు మేర కు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై ఉపేందర్ తెలిపారు.
అది గుడుంబా బిందె
హరిశంద్రనాయక్ తండా గుడుంబా తయారీ కేంద్రం. ఇక్కడ ఎన్నిసార్లు దాడులు నిర్వహించినా వారు తమ గుడుంబా తయారీ మానడం లేదు. రెండు రోజుల క్రితం ఈ తండాలో ఎకై్సజ్ సిబ్బంది దాడులు నిర్వహించారు. పోలీసుల రాకను గమనించి న నూనావత్ సమ్మయ్య భ యంతో తన వద్ద నిల్వ ఉన్న గుడుంబా బిందెను ఇంటి ఆవరణలోని బావిలో పడేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆ బిందెను తీయడానికి బావిలోకి దిగిన వస్రం బురదలో చిక్కుకుని ప్రాణాలు వదిలాడు.