bulk money
-
500 రూపాయల కోట్లు కనీసం ఉండాలి..
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ఇంధన విక్రయాల లైసెన్సు నిబంధనలకు సంబంధించి కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ వివరణనిచ్చింది. రిటైల్, బల్క్ కొనుగోలుదారులకు ఈ రెండింటినీ విక్రయించేందుకు లైసెన్సు కావాలంటే దరఖాస్తు చేసుకునే సమయానికి కనీసం రూ. 500 కోట్లు నికర విలువ ఉండాలని పేర్కొంది. బల్క్ లేదా రిటైల్ వినియోగదారులకు (ఏదో ఒక వర్గానికి మాత్రమే) పెట్రోల్, డీజిల్ విక్రయ లైసెన్సు పొందాలంటే కనీసం రూ. 250 కోట్ల నికర విలువ ఉండాలని తెలిపింది. గతేడాది ప్రకటించిన ఇంధన లైసెన్సింగ్ విధానంపై కేంద్రం ఈ మేరకు స్పష్టతనిచ్చింది. దేశీయంగా ఇంధన రంగంలో పోటీని ప్రోత్సహించేందుకు విక్రయాల నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం గతేడాది నిర్ణయం తీసుకుంది. చమురుయేతర సంస్థలను కూడా ఈ విభాగంలోకి అనుమతించింది. తద్వారా ప్రైవేట్, విదేశీ సంస్థలు కూడా ఇందులో ప్రవేశించేందుకు వీలు లభించినట్లయింది. గత నిబంధనల ప్రకారం భారత్‌లో ఇంధన రిటైలింగ్ లైసెన్స్ పొందాలంటే సదరు సంస్థ హైడ్రోకార్బన్ల అన్వేషణ ఉత్పత్తి, రిఫైనింగ్, పైప్లైన్లు లేదా ధ్రువీకృత సహజ వాయువు టెర్మినల్స్ మొదలైన వాటిలో రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది. -
2 ట్రేడింగ్ సెషన్‌ల్లోనే 50శాతం ర్యాలీ
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్(ఐబీహెచ్ఎఫ్) షేరు కేవలం 2ట్రేడింగ్ సెషన్‌ల్లోనే 50శాతం పెరిగింది. గడచిన రెండురోజుల్లో ఇన్వెస్ట్మెంట్ సంస్థ మోర్గాన్ స్టాన్లీతో సహా అనేక సంస్థలు బల్క్‌డీల్స్ ద్వారా ఐబీహెచ్ఎఫ్ లో వాటాను కొనుగోలు చేసినట్లు ఎక్చ్సేంజ్ గణాంకాలు చెబుతున్నాయి. ఎన్ఎస్ఈలో గణాంకాల ప్రకారం సింగపూర్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ గతవారంలో చివరి ట్రేడింగ్ సెషన్లో ఐబీహెచ్‌ఎఫ్‌కి చెందిన ప్రతి ఈక్విటీ షేరును రూ.184.76 చొప్పున మొత్తం 45.22లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. ఈ డీల్ మొత్తం విలువ సుమారు రూ.83.50కోట్లుగా ఉంది. ఈ ఒప్పందం తరువాత, ఇండియా బుల్స్ హౌసింగ్ షేరు శుక్రవారం 31 శాతం, సోమవారం 19శాతం చొప్పును మొత్తం 50శాతం లాభపడింది. కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా వేతనాల కోత, ఉద్యోగాలు పోయే పరిస్థితితో నెలకొనడంతో ఈఎంఐలు డిఫాల్ట్ అవుతాయనే భయాలతో ఇన్వెసర్లు ఈ షేర్ల అమ్మకాలు మొగ్గుచూపారు. ఫలితంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ షేరు 23శాతం క్షీణించింది. కరోనా మహమ్మారి ప్రభావం రుణగ్రహీత జీవనోపాధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, తద్వారా ఇది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల అసెట్ క్వాలిటీలను దెబ్బతీస్తుందని దేశీయ రేటింగ్ సంస్థ ఇక్రా అభిప్రాయపడింది. సోమవారం మార్కెట్ ముగిసే సరికి ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 19శాతం లాభంతో రూ.242.20 వద్ద స్థిరపడింది. -
నోట్ల కట్టలే కట్టలు
పోలీసుల తనిఖీల్లో బయటపడుతున్నలక్షలాది రూపాయలు ఆధారాలు చూపిస్తుండడంతోతిరిగి అప్పగింత ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం నల్లకుంట,అఫ్జల్‌గంజ్,న్యూస్‌లైన్: పురపాలక,స్థానిక, సాధారణ ఎన్నికల నేపథ్యంలో నగర పోలీసులు తనిఖీలు విస్తృతం చేస్తుండగా.. నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. లక్షలాది రూపాయలు పట్టుబడుతుండగా.. ఆధారాలు చూపిస్తుండడంతో వెంటనే వాటిని తిరిగి అప్పగిస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా కోట్లాదిరూపాయలు పట్టుబడగా వాటిని అప్పగించారు. శుక్రవారం మధ్యాహ్నం నల్లకుంట పోలీసులు న్యూనల్లకుంట నారాయణ కాలేజీ సమీపంలోని అంబుజా అపార్ట్మెంటు మార్గంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా..సిండికేట్ బ్యాంకు వైపు వెళ్తున్న టాటా సుమో (ఏపీ 09ఎక్స్7785)ను తనిఖీ చేయగా రూ.66.49 లక్షల బండిళ్లు కనిపించాయి. విచారణలో బ్రింగ్‌ఆర్యన్ ఏజెన్సీ, ప్రిజమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆయా బ్యాంకుల ఏటీఎంలలో నగదు పెట్టేందుకు వెళ్తున్నట్లు నిర్దారించారు. అనంతరం ఆ నగదు మొత్తాన్ని తిరిగి అప్పగించారు. రూ.6 లక్షలు ఐటీ అధికారులకు అప్పగింత : అఫ్జల్‌గంజ్ బస్టాండులో సీఐ అంజయ్య నేతృత్వంలో తనిఖీలు చేస్తుండగా బెంగళూరు నుంచి మహేందర్‌కుమార్‌జైన్ కారులో రూ.6లక్షల నగదు లభించింది. దీనికి సంబంధించి ఆయన వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆ మొత్తాన్ని ఐటీ అధికారులకు అప్పగించారు. అలాగే బైక్‌పై జాంబాగ్ ప్రాంతానికి చెందిన సుదర్శన్ వద్ద రూ.1.41లక్షల నగదు లభించగా..బ్యాంకు పత్రాలు చూపించడంతో తిరిగి ఇచ్చేశారు. మరో ఘటనలో రూ.36 లక్షలు నేరేడ్మెట్: నేరేడ్మెట్ పోలీసులు కృపాకాంప్లెక్స్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.36 లక్షలు లభ్యమయ్యాయి. విచారించగా ఆయా బ్యాంకులకు చెందిన డబ్బుగా తేలింది. అయితే వీరి వద్ద బ్యాంకులకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించినట్లు సీఐ చంద్రబాబు వెల్లడించారు. అలాగే సైదాబాద్ పోలీసుల తనిఖీల్లో అక్బర్‌బాగ్‌కు చెందిన అమన్‌అలీ వద్ద రూ.4.37 లక్షలు పట్టుబడ్డాయి. బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్తుండగా పట్టుకొని స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు. మరో ఘటనలో లంగర్‌హౌస్ పోలీసుల తనిఖీల్లో రూ. 1.30 లక్షలు పట్టుకున్నారు.