Bullied
-
స్పైడర్ మ్యాన్ ను పట్టుకొని చితక్కొట్టేశారు..
న్యూయార్క్: 15 ఏళ్ల అమెరికా టీనేజర్ స్పైడర్ మ్యాన్ వేషధారణలో పార్కుకు వెళ్తే అక్కడి ఆకతాయి యువత బాలుడిని ఎగతాళి చేసి గాయపరిచారు. పాపం స్పైడర్ మ్యాన్ కు ముక్కు నుండి రక్తం ధారకట్టడంతో నిస్సహాయంగా నిలుచుండిపోయాడు. వారు దాడి చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. హడ్సన్ ఫాల్స్ కు చెందిన 15 ఏళ్ల అయిడిన్ పెడోన్ న్యూయార్క్ లోని ఒక పార్కు వారు నిర్వహించిన సూపర్ హీరో థీమ్ లో పాల్గొనేందుకు తనకు ఇష్టమైన స్పైడర్ మ్యాన్ గెటప్ వేసుకుని పార్కుకి వెళ్ళాడు. అంతలోనే అక్కడికి వచ్చిన కొంతమంది టీనేజర్లు అయిడిన్ చుట్టూ చేసిరి మొదట ఎగతాళి చేశారు. ఆ గుంపులోని ఒక అమ్మాయి అయిడిన్ ముఖంపై బలంగా కొట్టింది. దాంతో తూలిపడబోయిన అయిడిన్ ఆపుకుని స్పైడర్ మ్యాన్ మాస్క్ తొలగించగా ముక్కు మీద తీవ్ర గాయం కావడంతో రక్తం బొటబొటా కారింది. ఈ సంఘటన జరుగుతుండగా పార్కులో మిగతావారు ఫోన్లో ఈ సన్నివేశాన్ని వీడియో తీస్తూ కనిపించడం విశేషం. This is actually disgusting… I hope there were consequences for what they did to that poor boy pic.twitter.com/vQ2hHEDcU4 — FadeHubb (@FadeHubb) July 1, 2023 స్థానిక మీడియా న్యూయార్క్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం అయిడిన్ చికిత్స పొందుతున్నాడని, గో ఫండ్ మి అనే పేజీ ప్రతినిధులు మరోసారి అయిడిన్ ఇలా దెబ్బలు తినకుండా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి చందాలు వసూలు చేయగా ఇప్పటికి 10,000 యూఎస్ డాలర్లు( రూ 8.21 లక్షలు) పోగయ్యాయని అన్నారు. ఆరో తరగతి చదువుతున్న అయిడిన్ కు ఆత్మన్యూనతా భావం ఎక్కువని, స్కూల్లో తరచుగా సహచరులు తనని ఆటపట్టిస్తూ ఉండటంతో ఆ భావం నుండి బయటపడేందుకు ఆదివారం తనకు ఇష్టమైన స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకున్నాడని, తీరా అక్కడ ఇలా జరగడం అమానుషమని అన్నారు. చుట్టూ ఉన్నవారు దాడిని ఆపకపోగా వీడియోలు తీస్తూ నవ్వుతుండడం మరింత బాధించిందని తెలిపారు. అయిడిన్ తల్లి ఫిర్యాదు మేరకు హడ్సన్ ఫాల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దాడి చేసిన టీనేజ్ అమ్మాయిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: Roller Coaster: తలకిందులుగా వేలాడుతూ.. 3 గంటలు నరకయాతన.. -
ఇండియన్ స్టూడెంట్‌కి వేధింపులు
-
అమెరికాలో భారతీయ విద్యార్థికి వేధింపులు
Indian Student Bullied Texas: భారతీయ మూలాలున్న విద్యార్థిని లక్ష్యంగా చేసుకుని అమెరికన్ స్టూడెంట్ రెచ్చిపోయాడు. మాటలతో వేధిస్తూ భౌతికదాడులకు దిగుతూ హింసించాడు. స్కూల్ క్యాంటీన్లోనే దురాగతం జరుగుతున్నా ఎవ్వరూ ఆపేందుకు ప్రయత్నించలేదు. పైగా కొందరు విద్యార్థులు విపరీత చేష్టలకు పాల్పడుతున్న అమెరికన్ విద్యార్థిని రెచ్చగొట్టారు. ఈ దారుణమైన ఘటన టెక్సాస్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలో కాపెల్ ప్రాంతంలో ఉన్న కాపెల్ మిడిల్ స్కూల్లో చదువుతున్న భారతీయ మూలాలున్న విద్యార్థికి ఇబ్బందులు ఎదురయ్యాయి. క్యాంటీన్లో తింటున్న సమయంలో.. ఓ అమెరికన్ విద్యార్థి అక్కడకు వచ్చి ఇండియన్ స్టూడెంట్‌ని అతను కూర్చున్న చోటు నుంచి లేచి వేరే దగ్గరికి వెళ్లి పోవాలంటూ దబాయించాడు. ఎవరూ లేని సమయంలో తాను అక్కడ కూర్చున్నానని,.. తాను అక్కడి నుంచి లేచి వెళ్లనంటూ ఆ ఇండియన్ స్టూడెంట్ తెలిపాడు. పక్కన ఖాళీగా ఉన్న చోట కూర్చోవాలంటూ సూచించాడు. మాటలతో మొదలెట్టి.. ఇండియన్ ఆరిజిన్ స్టూడెంట్ చేసిన సూచనలు పట్టించుకోకుండా.. కచ్చితంగా నువ్వా కుర్చీలో నుంచి లేచిపోవాల్సిందే అంటూ అమెరికన్ విద్యార్థి ఇండియన్ స్టూడెంట్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. స్కూల్బ్యాగు తీసి పక్కన పడేశాడు. తన వేలితో మెడపై పొడుస్తూ అవమానకరంగా ప్రవర్తించాడు. ఐనప్పటికీ ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంగా భావించిన భారతీయమూలాలు ఉన్న విద్యార్థి అక్కడి నుంచి లేచేందుకు అంగీకరించలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ అమెరికన్ స్టూడెంట్.. ఇండియన్ స్టూడెంట్ మెడ చుట్టూ చేయి వేసి తలను మెలిపెట్టి కుర్చీ నుంచి లాగి నేలపై పడేశాడు. రెచ్చగొడుతూ వందల మంది విద్యార్థుల సమక్షంలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఇంత జరుగుతున్నా అక్కడున్న వారిలో ఏ ఒక్కరూ భారతీయ మూలాలున్న విద్యార్థికి మద్దతుగా రాలేదు సరికదా కొందరైతే దురాగతానికి పాల్పడుతున్న అమెరికన్ స్టూడెంట్ను రెచ్చగొట్టారు. మరికొందరు జరుగుతున్న ఘటన వీడియో తీస్తూ గడిపారు. బాధితుడికే శిక్ష ఈ నెల 11న ఈ ఘటన జరిగింది. ఆ వెంటనే విషయం స్కూల్ ప్రిన్సిపల్ వరకు వెళ్లింది. దీంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులను స్కూల్‌కి పిలిపించాడు. వీడియోలో కనిపిస్తున్న దురాగతానికి విరుద్దంగా భారతీయ విద్యార్థే అకారణంగా మరో విద్యార్థితో గొడవ పెట్టుకున్నాడని నిర్థారిస్తూ.. బాధిత విద్యార్థిని మూడు రోజుల పాటు స్కూల్ నుంచి సస్పెండ్ చేయగా దాడికి పాల్పడిన అమెరికన్ స్టూడెంట్‌కి కేవలం ఒక రోజు నుంచి నుంచి సస్పెండ్ చేశారు. వరుస ఘటనలు సమానత్వానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని, వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తామని పదే పదే చెప్పుకునే అమెరికాలో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం ఇండియన్లను నివ్వెరపరుస్తోంది. ఇదే వారంలో నల్లజాతీయులను లక్ష్యంగా చేసుకుని షికాగోలని బఫెలో మార్కెట్లో కాల్పులు జరిపిన ఘటనలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. చదవండి: బుసకొట్టిన జాతి విద్వేషం -
‘ఇన్నేళ్ల గౌరవం క్షణాల్లో నాశనం అయ్యింది’
టీచర్లను ఏడిపించడం.. వారిని ఎగతాళి చేస్తూ మాట్లాడటం వంటి చేష్టల్ని హీరోయిజంగా చూపిస్తారు సినిమాల్లో. కానీ వాస్తవంగా ఆ పరిస్థితులు ఎంత కఠినంగా ఉంటాయో.. ఎంతటి వేదనను కల్గిస్తాయో.. మనం ఊహించలేము. తాజాగా ఇందుకు సంబంధించిన స్టోరీ ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. తప్పకుండా ప్రతి ఒక్కరు చదివి, షేర్ చేసుకుని.. నిజ జీవితంలో ఇలాంటి పనులు చేయకూడదని కోరుతున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. కరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దాంతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. సాధారణంగా ప్రతి ఏడాది ఈ పాటికి అకాడమిక్ ఇయర్ ప్రారంభించాల్సిన సమయం. కానీ కరోనా వైరస్ నానాటికి విజృంభిస్తుండటంతో... విద్యా సంస్థలను ఇంకా తెరవలేదు. కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం ఆన్లైన్ క్లాస్‌లు నడుపుతున్నాయి. ఈ క్రమంలో నెలరోజుల క్రితం ఓ స్కూల్ ప్రిన్సిపాల్ తమ టీచర్లను పిలిచి ఈ ఏడాది ఆన్లైన్ క్లాస్‌లు తీసుకోవాల్సిందిగా ఆదేశించాడు. ప్రిన్సిపాల్ మాటలు వినగానే ఓ 55 ఏళ్ల టీచర్‌కు గుండెల్లో దడ మొదలయ్యింది. ఎందుకంటే ఆయనకు ఇంకా స్మార్ట్‌ఫోన్ వాడకం గురించి పూర్తిగా తెలీదు. అలాంటిది ఆన్లైన్లో క్లాస్‌లు తీసుకోవడం అంటే ఇక ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తనకు చేతకాదని చెప్తే యాజమాన్యం జాబ్ నుంచి తొలగిస్తుంది. ఈ వయసులో ఆయనకు మరో ఉద్యోగం దొరకడం అంటే చాలా కష్టం. ఈ సమస్య గురించి కూతురుతో చెప్పాడు. ఆమె తండ్రికి ధైర్యం చెప్పి.. జూమ్‌లో ఆన్లైన్ క్లాస్ ఎలా తీసుకోవాలి.. స్మార్ట్‌ఫోన్ వాడకం గురించి కొన్ని బెసిక్స్ నేర్పింది. పిల్లలకు పాఠాలు చెప్పాలంటే బోర్డు కావాలని చెప్పి దాన్ని కూడా తెప్పించాడు సదరు ఉపాధ్యాయుడు. ఫస్ట్ రోజు క్లాస్‌లో బాగా కనిపించాలనే ఉద్దేశంతో కొత్త షర్ట్ తీసుకున్నాడు. ఇక ఆన్లైన్ క్లాస్‌లు మొదలు పెట్టే రోజు రానే వచ్చింది. అన్ని సిద్ధం చేసుకుని పాఠం ప్రారంభించాడు. (సోషల్ మీడియాలో టీచర్ల మార్ఫింగ్ ఫొటోలు) కానీ మొదటి సారి కెమరా ముందు నిల్చుని పాఠం చెప్పాలంటే కాస్తా భయపడ్డాడు. గొంతు వణుకుతోంది. ఆయన ఇలా ఇబ్బంది పడుతుండగా ఓ గుర్తు తెలియని ఐడీ నుంచి కొన్ని అసభ్యకరమైన మాటలు వినిపించాయి. అసలే ఆన్లైన్ గురించి సరిగా తెలియని ఆ టీచర్.. ఈ చర్యలకు మరింత భయపడ్డాడు. ఎలా స్పందించాలో అర్థం కాలేదు.. విద్యార్థుల మీద అరిచాడు. కానీ ఆ మాటలు మాత్రం ఆగలేదు. ఆయన ఇన్నేళ్లు సంపాదించుకున్న గౌరవం కొన్ని సెకన్లలో తుడిచిపెట్టుకుపోయింది. దాంతో వీడియోను మ్యూట్ చేశాడు. కానీ ఆ విద్యార్థి అన్‌మ్యూట్ చేసి.. టీచర్‌ను ఎగతాళి చేస్తూనే ఉన్నాడు. ఇదంతా ఆ విద్యార్థికి వినోదంగా అనిపిస్తుంది. దీన్నుంచి బయటపడాలంటే క్లాస్‌ను ముగించడం ఒక్కటే మార్గం. కానీ రేపు ఇలానే జరుగుతుంది. మరి అప్పుడేం చేయాలి. ప్రస్తుతం ఈ ఉద్యోగం చేయడం అతడికి ఎంతో అవసరం. దాంతో దుఖం తన్నుకొచ్చింది. (‘ఆన్లైన్’ ఆదేశాలపై కోర్టుకు వెళ్లిన హార్వర్డ్, ఎంఐటీ) కుమార్తెను పిలిచి ఒక్కసారిగా బోరున ఏడ్చాడు. ఇన్నేళ్లు ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన వ్యక్తి.. ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. ఏడుస్తూనే ఉన్నాడు. మరుసటి రోజును తలుచుకుంటే.. ఆ రాత్రి అతడికి నిద్ర కూడా పట్టలేదు. విద్యార్థులకు వినోదం.. అతడికి ప్రాణసంకటంగా మారింది పరిస్థితి. ‘టీచర్లను ఎగతాళి చేసి మీరు వినోదం పొందుతారేమో కానీ.. భవిష్యత్తులో మీరు బాధపడతారు’ అంటూ షేర్ చేసిన ఈ కథనం ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తోంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు వెల్లడి కాలేదు. -
మహిళా ఎస్ఐ ఆత్మహత్యా యత్నం
బెంగళూరు: నగరంలో ఓ మహిళా ఎస్ఐ మంగళవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. డీఎస్పీలైన కల్లప్ప, గణపతిల బలవన్మరణాలు ఘటనలు మరిచిపోవడానికి ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సహచర ఉద్యోగులు చెబుతున్న వివరాల ప్రకారం...స్థానిక విజయనగర పోలీస్‌స్టేషన్‌లో రెండేళ్లుగా ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న రూపా మొదటి నుంచి సున్నిత మనస్కురాలు. దీని వల్ల కేసుల పరిష్కారం సరిగా జరిగేది కాదని తెలుస్తోంది. అయితే పోలీస్‌శాఖలో కొంత కఠినంగా వ్యవహరించాలని, అప్పుడే విధులుసజావుగా సాగుతాయని ఉన్నతాధికారులు చెబుతూ వచ్చేవారు. అయితే రూపా తన ఆలోచన విధానాన్ని మార్చుకోలేదు. ఈ నేథ్యంలోనే మంగళవారం సాయంత్ర స్టేషన్‌లోని ఉన్నతాధికారులకు, రూపాకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అటుపై ఆవేశంతో ‘మీకు సరైన గుణపాఠం చెబుతా. డీఎస్పీ గణపతి మాదిరి నేను కూడా...’ అంటూ ఉన్నతాధికారులు ఉన్న గది నుంచి బయటికి వచ్చి వేగంగా యూనిఫాంలోనే తన ఇంటి వైపు వెళ్లారు. ఆ సమయంలో ఆమె నిద్రమాత్రలు మింగారు. కంగుతిన్న అధికారులు అక్కడే ఉన్న కానిస్టేబుల్స్ రూపాను అనుసరించాల్సిందిగా కానిస్టేబుల్స్‌కు సూచించారు. కొంత దూరం వెళ్లిన తర్వాత రూపా కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే కానిస్టేబుల్స్ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి రూపాను స్థానికుల సహకారంతో దగ్గర్లోని సుగుణ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆసుపత్రి వైద్యాధికారి రవీంద్ర తెలిపారు. ఇదిలా ఉండగా మొబైల్ దొంగతనం విషయం పైన రూపా ఆత్మహత్య యత్నం ఘటనలో మరో వాదన కూడ వినిపిస్తుంది. స్టేషన్ పరిదిలో ఇటివల జరిగిన ఓ అతి ఖరీదైన మొబైల్ దొంగతనం జరిగింది. రెండు రోజుల ముందు ఆ మొబైల్ రికవరీ కూడ అయింది. అయితే మొబైల్ బాధితుడికి ఆ మొబైల్ ఇవ్వ కుండా రూపా తన వద్ద పెట్టుకుంది. ఈ విషయం ఉన్నతాధికారులకు కూడ తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారి రూపను ప్రశ్నించడమే కాకుండ స్టేషన్ డైరిలో ‘‘రూపా రికవరి మొబైల్‌ను దుర్వినియోగం చేసింది’’ అని లిఖిత పూర్వకంగా రాశారు. దీంతో మనోవేదనకు గురైన రూపా ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. కాగా పోలీసు ఉన్నతాధికారులు చరణ్‌రెడ్డి, సందీప్ పాటిల్ ఆస్పత్రికి వెళ్లి రూపను పరామర్శించారు. ఘటన ఎలా జరిగిందని సిబ్బందిని ఆరా తీశారు.