వారియర్స్‌పై బెంగళూరు విజయం
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగళూరు బుల్స్ జట్టు తమ సెమీఫైనల్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కంఠీరవ ఇండోర్ స్టేడియంలో ఆదివారం బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌ను 37-24 తేడాతో నెగ్గింది. ప్రథమార్ధంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగినా ద్వితీయార్ధంలో బెంగళూరు పూర్తిగా ఆధిపత్యం చూపింది. ఈ గెలుపుతో బుల్స్ 36 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో యు ముంబ 37-30 తేడాతో దబాంగ్ ఢిల్లీపై నెగ్గింది.