Bumble
-
మీ ఫోన్లో నుంచి ఈ యాప్ వెంటనే తొలగించండి.. ముఖ్యంగా మహిళలు
ప్రముఖ డేటింగ్ యాప్ బంబుల్ లో ఉన్న ఒక సెక్యూరిటీ బగ్ వినియోగదారుల ఖచ్చితమైన స్థానాన్ని బహిర్గతం చేస్తున్నట్లు ఒక భద్రతా పరిశోధకుడు పేర్కొన్నారు. ఈ బంబుల్ యాప్ లో ఉన్న లోపం ద్వారా హ్యకర్లు దాడి చేసి వినియోగదారుల ఖచ్చితమైన స్థానాన్ని పొందే అవకాశం ఉన్నట్లు తెలిపారు. బంబుల్ యాప్ ను ఇప్పటి వరకు కోటి మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర డేటింగ్ యాప్స్ కంటే ఈ డేటింగ్ యాప్ సురక్షితం అని మహిళా యూజర్స్ భావిస్తున్నారు. ఎందుకంటే, వారి అనుమతి లేకుండా ఏ పురుషుడు వారికి మెసేజ్ పంపలేరు. అయితే, తాజాగా ఈ బగ్ బయటపడటంతో మహిళా వినియోగదారులకు ఎక్కువగా హాని కలిగే అవకాశం ఉంది. స్ట్రైప్ సంస్థలో పనిచేసే పరిశోధకులు రాబర్ట్ హీటన్, బంబుల్ యాప్స్ లో ఉన్న బగ్ ను కనుగొన్నారు. ఈ లోపం వల్ల వినియోగదారుల ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఒక బ్లాగ్ పోస్ట్ లో నివేదించారు. ఇందుకు గాను అతనికి $2,000 బహుమతి కూడా లభించింది. సైబర్ క్రిమినల్స్ వినియోగదారుల ఖచ్చితమైన ఇంటి చిరునామాను తెలుసుకోవడానికి, వారి కదలికలను ట్రాక్ చేయడానికి వారు బంబుల్ యాప్ ఉపయోగించేకునే అవకాశం ఉంది అని హీటన్ పేర్కొన్నారు. అందుకే ఈ యాప్ ఉన్న యూజర్లు వెంటనే మీ ఫోన్ నుంచి తొలగించాలని భద్రత నిపుణులు పేర్కొన్నారు.(చదవండి: పీఎంజేడీవై ఖాతాదారులకు తీపికబురు) -
ప్రియాంక కొత్త అధ్యాయం
ప్రత్యేకంగా యువతులు, మహిళల కోసం రూపొందించిన డేటింగ్ యాప్ బంబల్‌లో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పెట్టుబడులు పెడుతున్నారు. మహిళల మొట్ట మొదటి సోషల్ నెట్వర్కింగ్ యాప్ బంబల్‌లో త్వరలోనే భారతదేశంలో అరంగేట్రం చేయనుంది. ఇప్పటికే టెక్ స్టార్ట్అప్ హోల్బెర్టన్ స్కూల్లో పెట్టుబడిదారుగా ఉన్న బాలీవుడ్ భామ ప్రియాంక సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లో పెట్టుబడిదారుగా, సలహాదారుగా ఇపుడు కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ భాగస్వామ్యం విషయాన్ని ఆమె ట్విటర్లో షేర్ చేశారు. ఫార్చ్యూన్ అతిశక్తివంతమైన మహిళల సమ్మిట్‌లో బంబల్ సీఈవో విట్నే వోల్ఫ్హెర్డ్ ఈ విషయాన్ని బుధవారం ప్రకటించారు. భారతదేశ మహిళల సాధికారతకు సహాయపడడంతోపాటు ఆమె ప్రపంచశక్తిగా నిలవనున్నారని పేర్కొన్నారు. గత తొమ్మిదినెలలుగా బంబుల్ లాంచింగ్ పనిలో, వ్యూహాలు, ప్రచార కార్యక్రమాల్లో ప్రియాంక తలమునకలై వున్నట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాధికారతను కోరుకుంటున్నారు. వారు సురక్షితంగా ఉండాలి. వారుతో అనుసంధానం కావాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. సురక్షితంగా లేని కారణంగా ప్రస్తుత సోషల్ నెట్‌వర్క్‌లు భారతీయ మహిళల హృదయాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా తమ యాప్‌లో మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చినట్టు తెలిపారు. ఉదాహరణకు, మహిళలు వారి పూర్తి పేర్లకు బదులుగా తమ ప్రొఫైల్‌లో కేవలం ఫస్ట్ లెటర్ ఉపయోగించుకునేందుకు వీలు కల్పిస్తోందన్నారు. 2017 అక్టోబర్‌లో బంబుల్ డేటింగ్ యాప్ విట్నే వోల్ప్ హెర్డ్ స్థాపించారు. ఇప్పటికే 160 దేశాలలో పనిచేస్తున్న బంబుల్, ఫోటో వెరిఫికేషన్ ఫీచర్ ఆధారితంగా పనిచేస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 27 మిలియన్ల మంది ఈ యాప్‌ను వినియోగిస్తుండగా, దాదాపు 4000 కంటెంట్ మోడరేటర్లతో ఫోటోలను, ప్రొఫైల్స్‌ను నిరంతరం రివ్యూ చేస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి భారతీయ మహిళలకు అందుబాటులోకి రానున్న బంబుల్ హిందీ, హింగ్లీషు (హిందీ, ఇంగ్లీషు కలిసిన) భాషల్లో లాంచ్కానుంది. ఆండ్రాయిడ్, యాపిల్ ఐవోఎస్ ఫ్లాట్‌ఫాంలపై ఇది పనిచేస్తుంది. A new chapter for me! I am so excited to partner with @bumble and @holbertonschool as an investor. I’m honored to join two companies that strive to expand gender diversity in the tech space, and make a social impact for the greater good... let’s do this!! pic.twitter.com/xBdC13XE0n — PRIYANKA (@priyankachopra) October 4, 2018 -
'మా అక్కకు ఒక తోడు కావాలి'
డేటింగ్ వెబ్సైట్లలో చేరి ఒంటరి జీవితానికి ఓ తోడు వెతుక్కోవడం పాశ్చాత్యులకు అలవాటే. అదేరీతిలో ఇప్పుడు అక్క కౌర్ట్నీ కర్దాషియన్ కోసం ఓ తోడును వెతికేందుకు హాలీవుడ్ టీవీ నటి కిలీ జెన్నర్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కౌర్ట్నీ పేరిట 'బంబుల్' అనే డేటింగ్ వెబ్సైట్లో ఓ అకౌంట్ ఓపెన్ చేసింది. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన కౌర్ట్నీ కొన్ని నెలల కిందట తన ప్రియుడు స్కాట్ డిసిక్ తో వేరయింది. అప్పటి నుంచి ఈ అమ్మడు ఒంటరిగా ఉంటోంది. 37 ఏళ్ల కౌర్ట్నీ ఇటీవల తనకంటే చాలా చిన్నవాడైన జస్టిన్ బీబర్ (22)తో చెట్టాపట్టాలేసుకొని తిరిగినట్టు కథనాలు వచ్చాయి. కాగా, కౌర్ట్నీ ఫొటోలు, ఆమె వయస్సు, చదువు, ఇతర వివరాలు తెలియజేస్తూ డేటింగ్ యాప్‌లో కిలీ ప్రొఫైల్ ఏర్పాటుచేసింది. 'నా దగ్గర కౌర్ట్నీ ఫోన్ నంబర్ ఉంది. ఆమె పాస్వర్డ్ నాకు తెలుసు. ఈ అకౌంట్‌కు వచ్చిన మెసెజెస్ నేను మీకు చదివి వినిపిస్తాను. ఆమె మెసెజ్‌లు చదివితే నన్ను చంపేస్తుందేమో. అయినా బంబుల్ (యాప్)లో ఆమె ఉండాల్సిన అవసరముంది' అని 20 ఏళ్ల కిలీ పేర్కొంది. డేటింగ్ యాప్‌లో అక్క అకౌంట్ తెరిచిన సందర్భంగా తన అక్కలు కౌర్టీ, ఖ్లోహి కర్దాషియన్ లతో కలిసి ఈ అమ్మడు పార్టీ కూడా చేసుకుంది.