గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
రెంజల్: ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బూర్గమ్ గ్రామంలో గురువారం జరిగింది. పాడ్దె సంతోష్(44) అనే వ్యక్తి గురువారం సాయంత్రం బూర్గమ్ గ్రామ శివారు నుంచి నడుచుకుంటూ వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.