బూర్జ పోలీస్ స్టేషన్లో సీపీఎం కార్యదర్శి మధు
బూర్జ(శ్రీకాకుళం): సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధును శ్రీకాకుళం జిల్లా పోలీసులు బూర్జ మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆయనను కలిసేందుకు వెళ్లిన జిల్లా పార్టీ కార్యదర్శి కృష్ణమూర్తి, మరో నేత వడ్డేపల్లి మోహన్‌రావును లోపలికి అనుమతించి, వారినీ అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్టేషన్ ఎదుట ధర్నాకు దిగిన సీపీఎం కార్యకర్తలు 20 మందితోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుబ్బారావు, సీఐటీయూ నేత నాగమణిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
జిల్లాలోని పొలాకిలో నిర్మించతలపెట్టిన ధర్మల్ విద్యుత్ శాఖ కేంద్రానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన మధును బుధవారం వేకువజామున 5.30 గంటల సమయంలో ఆముదాలవలసలో అరెస్టు చేసిన విషయం విదితమే.