burried inside home
-
తల్లి మృతదేహాన్ని డ్రమ్‌లో పెట్టి సిమెంట్‌తో కప్పేశాడు!
సాక్షి, చెన్నై: తల్లి మృతదేహాన్ని డ్రమ్‌లో పెట్టి సిమెంట్‌తో ఓ కుమారుడు కప్పేశాడు. పైగా దాన్ని ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఆ కుమారుడి మానసిక స్థితి ఈ దుశ్చర్యకు కారణంగా విచారణలో తేలింది. చెన్నై నీలాంకరై సరస్వతి నగర్‌కు చెందిన గోపాల్, షెన్బగం దంపతులకు ప్రభు, మురుగన్, సురేష్ అనే కుమారులు ఉన్నారు. గోపాల్ గతంలోనే మరణించాడు. ప్రభు, మురుగన్ చెన్నైలో వేర్వేరు ప్రాంతాల్లో కుటుంబాలతో నివాసం ఉన్నారు. ఇంట్లో చిన్న కుమారుడు సురేష్(50), తల్లి షెన్బగం (86) మాత్రమే ఉన్నారు. ఇక మానసిక చచలత్వంతో వ్యవహరిస్తుండడంతో నెల రోజుల క్రితం సురేష్‌ను వదిలి పెట్టి భార్య పిల్లలు వెళ్లిపోయారు. అప్పటి నుంచి తల్లితో పాటుగా సురేష్ ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఆదివారం సాయంత్రం తల్లిని చూసేందుకు పెద్ద కుమారుడు ప్రభు ఆ ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వెళ్లనివ్వక పోవడంతో అనుమానం తల్లి ఇంట్లో లేదని చెప్పడమే కాకుండా,ఇంట్లోకి సురేష్ తనను అనుమతించక పోవడంతో ప్రభు నీలాంకరై పోలీసుల్ని ఆశ్రయించాడు. వారు ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయగా, ఆ డ్రమ్‌లో తల్లి మృతదేహం ఉన్నట్టు సురేష్ చెప్పడంతో విస్మయానికి గురయ్యారు. ఆ డ్రమ్‌ను పగల కొట్టి చూడగా అందులో షెన్భగం మృతదేహం బయట పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి అనారోగ్యంతో మరణించి, అంత్యక్రియలు చేయలేని పరిస్థితుల్లో సురేష్ ఈ చర్యకు పాల్పడ్డాడా లేదా ప్రాణాలతోనే డ్రమ్‌లో కప్పేశాడా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. చదవండి: స్టేట్ లెవెల్ బాక్సింగ్ ప్లేయర్, పోలీసు ఉద్యోగం.. కానీ ఏం జరిగిందో ఏమో.. -
కూతురితో అఫైర్ ఉందని.. చంపి పూడ్చేశారు!
ఆ రెండు కుటుంబాలు రెండు దశాబ్దాలుగా స్నేహంగా ఉంటున్నాయి. హిందూ ముస్లింలే అయినా ఇద్దరివీ పక్కపక్క ఇళ్లు. ముజఫర్‌నగర్ అల్లర్ల సమయంలోనూ వాళ్ల స్నేహం చెక్కు చెదరలేదు. కానీ.. ఒక్క విషయంతో విభేదాలు భగ్గుమన్నాయి. పక్కవాళ్ల కొడుకు (14) తమ ఇంట్లో కూతురితో (15) సంబంధం పెట్టుకున్నాడని.. అతడిని చంపి తమ ఇంట్లోనే పూడ్చేశారు! ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లా కవాల్ ప్రాంతంలో వెలుగు చూసింది. స్కూల్లో చదువుకుంటున్న ఎర్షాద్ అనే పిల్లాడి మృతదేహాన్ని పొరుగున ఉండే శ్రీపాల్ సైనీ ఇంట్లోంచి తవ్వితీశారు. అమ్మాయి సోదరులు ఇద్దరితో పాటు మరో బంధువును పోలీసులు అరెస్టు చేశారు. స్కూలుకు అని వెళ్లిన తన కొడుకు ఎర్షాద్ కనిపించడం లేదని అంతకుముందు షకీల్ అహ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతకుముందెప్పుడూ అతడు అలా కనిపించకుండా లేడు. కొన్నిరోజుల క్రితం ఎర్షాద్, మరో అమ్మాయి కలిసి వెళ్తుండగా చూశామని స్నేహితులు చెప్పారు. దాంతో ఆ అమ్మాయి ఎవరని ఆరా తీసిన పోలీసులు.. వెంటనే శ్రీపాల్ సైనీ ఇంటి ఆవరణను గాలించారు. ఎర్షాద్ సెల్‌ఫోన్ కాల్ రికార్డులు చూస్తే అతడు ఆ అమ్మాయితో తరచు మాట్లాడుతున్నట్లు తేలిందని ఎస్ఎస్పీ దీపక్ కుమార్ చెప్పారు. ఆమె సోదరులను గట్టిగా ప్రశ్నిస్తే విషయం బయటపడిందన్నారు. మృతదేహాన్ని వెలికి తీసి, అమ్మాయి సోదరులు మోహన్ సైనీ, పవన్ సైనీలతో పాటు వారి బంధువును కూడా అరెస్టు చేశామన్నారు. తమ పక్కింట్లో ఉండేవాళ్లే ఇలా చేస్తారని ఊహించలేదని అహ్మద్ వాపోయారు. వాడు చాలా చిన్న పిల్లాడని, అంత దారుణంగా ఎలా చంపేశారని కన్నీరు మున్నీరయ్యారు. అయితే.. ఇది మతఘర్షణల రూపం దాల్చకముందే కేసులో వాస్తవాలను బయటపెట్టేందుకు తాము కాలంతో పోటీపడి పరుగులు తీశామని పోలీసులు చెప్పారు.