bus collided
-
రెండు ఆర్టీసీ బస్సుల ఢీ..
భైంసా(ముధోల్): నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్పాడ్ గ్రామ సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో 40 మందికి గాయాలయ్యాయి. వివరాలివి. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భైంసా నుంచి నిర్మల్‌కు నిర్మల్ డిపోకు చెందిన బస్సు వెళ్తోంది. ఇందులో 43 మంది ప్రయాణికులున్నారు. వెనకాలే భైంసా డిపోకు చెందిన బస్సు సారంగపూర్ వెళ్తోంది. ఇందులో 37 మంది ప్రయాణికులున్నారు. ఈ క్రమంలో భైంసా డిపో బస్సు నిర్మల్ డిపో బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో వెనకనుంచి ఢీ కొట్టింది. ఇద్దరు డ్రైవర్లు బ్రేక్ వేయడంతో రెండు బస్సుల్లో 40 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఆర్టీసీ అధికారులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను భైంసా, నిర్మల్ ఆసుపత్రులకు తరలించారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
గుంటూరు: గుంటూరు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. రొంపిచెర్ల మండలం ఇప్పన్న గ్రామ శివారులోని అద్దంకి-నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు లారీని ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని వెనుక వేగంగా వచ్చిన వెంకటగిరి డిపోకు చెందిన సూపర్‌లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సులోని నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. దీంతో ప్రయాణికులను మరో బస్సులో గమ్యానికి చేర్చారు. క్షతగాత్రులకు రొంపిచెర్ల ప్రభుత్వాస్పత్రిలో ప్రాధమిక చికిత్స అందించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.