గాలి తీవ్రతకు ఊడిపడిన బస్సు పైకప్పు
చెన్నై: సుడిగాలికి బస్సు పై కప్పు ఊడి పడిన ఘటన తమిళనాడులోని కరూరులో చోటు చేసుకుంది. మంగళవారం కరూరులో భారీ సుడిగాలి వీచింది. గాలి తీవ్రతకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదేసమయంలో కరూర్ బస్ స్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వైపు ఓ ప్రభుత్వ బస్సు వెళుతోంది.
బస్సు మణవాడి సమీపంలో ఉండగా సుడిగాలి తాకిడికి బస్సు పైకప్పు ఊడి కిందికి వేలాడుతోంది. గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రయాణికులు, స్థానికుల సాయంతో పైకప్పును తొలగించారు. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ ఎవరూ లేకపోవటంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.