business benefits
-
పసిడి రుణాల ఎన్బీఎఫ్సీలదే హవా..
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి గట్టి పోటీ ఉంటున్నప్పటికీ పసిడి రుణాలిచ్చే నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) వ్యాపార కార్యకలాపాలు పటిష్టంగా సాగుతున్నాయి. కరోనా సమయంతో పోలిస్తే కాస్తంత తగ్గినా మార్కెట్లో అవి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటున్నాయి. క్రిసిల్ రేటింగ్స్ నివేదిక ప్రకారం 2021 మార్చి నుంచి 2023 సెపె్టంబర్ మధ్య కాలంలో మార్కెట్ పరిమాణం రూ. 2.5 లక్షల కోట్లకు చేరగా, వాటి మార్కెట్ వాటా 61 శాతంగా నమోదైంది. కరోనా విస్తృతంగా ఉన్న 2022 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ పరిమాణం దాదాపు రూ. 2 లక్షల కోట్లుగా ఉండగా, పసిడి రుణాల ఎన్‌బీఎఫ్‌సీల వాటా 64 శాతంగా ఉండేది. ఆ తర్వాత 2023 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రూ. 2.3 లక్షల కోట్లకు చేరగా, వాటి వాటా 62 శాతానికి పరిమితమైంది. మార్కెట్లో మూడింట రెండొంతుల వాటా ప్రైవేట్ సంస్థలదే ఉన్నప్పటికీ.. అత్యధికంగా పసిడి రుణాలిచి్చన సంస్థగా (రూ. 1.3 లక్షల కోట్లు) ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు ఉంది. వాటా పెంచుకుంటున్న బ్యాంకులు.. బ్యాంకులు కూడా క్రమంగా పసిడి రుణాల మార్కెట్లో తమ వాటాను పెంచుకుంటున్నాయి. రూ. 2.5 లక్షల కోట్ల మార్కెట్లో 39 శాతం వాటాను (1 శాతం వృద్ధి) దక్కించుకున్నాయి. అలాగే, గత మూడేళ్లుగా వ్యవసాయేతర బంగారు రుణాలపై.. ముఖ్యంగా రూ. 3 లక్షల పైబడిన లోన్స్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. కొత్త ప్రాంతాల్లో మరిన్ని శాఖలను ఏర్పాటు చేయడం, ఆన్లైన్లో రుణాలివ్వడం, ఇంటి వద్దకే సర్వీసులు అందించడం వంటి వ్యూహాలతో పసిడి రుణాల ఎన్బీఎఫ్సీలు ముందుకెడుతున్నట్లు క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ బి. మాళవిక తెలిపారు. బంగారం ధరల పెరుగుదల కూడా ఎన్‌బీఎఫ్‌సీల పోర్ట్‌ఫోలియో వృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీల గోల్డ్ లోన్స్ ఏయూఎం వృద్ధికి ప్రధానంగా మూడు కారణాలు ఉంటున్నాయని క్రిసిల్ పేర్కొంది. కస్టమర్లు చేజారిపోకుండా ఎన్బీఎఫ్సీలు తగు ప్రయత్నాలు చేస్తుండటం, చిన్న..మధ్య స్థాయి రుణాలపై దృష్టి పెట్టడం, శాఖల నెట్‌వర్క్‌ను పెంచుకోవడం ద్వారా కస్టమర్లకు మరింత చేరువయ్యే ప్రయత్నాలు చేస్తుండటం ఇందుకు దోహదపడుతున్నట్లు వివరించింది. -
చిక్కుల్లో యాపిల్..విచారణకు ఆదేశాలు
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు భారీ షాక్ తగిలింది. భారత్‌లో యాపిల్ అనైతిక బిజినెస్ కార్యకలాపాలపై దర్యాప్తు చేపట్టాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ఆదేశాలు జారీ చేసింది. "టుగెదర్ వుయ్ ఫైట్ సొసైటీ" అనే ఫిర్యాదుదారు ప్రకారం.. యాపిల్ యాప్ స్టోర్‌లో థర్డ్ పార్టీ యాప్ స్టోర్లను అనుమతించరు. అటువంటి సర్వీసులను ఆఫర్ చేయడంకు యాప్ డెవలపర్లతో అగ్రిమెంట్లు చేసుకుంటూ వారిని నిరోధించే ప్రయత్నం చేస్తుందంటూ ఫిర్యాదు దారుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు నేపథ్యంలో సీసీఐ యాపిల్‌పై విచారణ చేపట్టాలంటూ 20పేజీల లేఖను రాసింది. ఆ లేఖలో అగ్రిమెంట్లు ద్వారా యాప్ డిస్ట్రిబ్యూటర్లు, యాప్ స్టోర్ డెవలపర్లు యాప్ మార్కెట్లోకి వెళ్లలేకపోతున్నారని పేర్కొంది. అందుకే సంస్థ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని సీసీఐ ఆదేశాలు జారీ చేసింది. చదవండి: స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో కింగ్..జనవరి నుంచి ఆ స్మార్ట్ ఫోన్ ఇక కనిపించదు! -
భారీ టారిఫ్‌లతో దెబ్బతీస్తోంది
వాషింగ్టన్: భారీ టారిఫ్‌లతో వాణిజ్యపరంగా తమ దేశాన్ని భారత్ చాన్నాళ్లుగా గట్టిగా దెబ్బతీస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. భారత మార్కెట్లో అమెరికా ఉత్పత్తుల విక్రయాలకు మరింతగా అవకాశాలు కల్పించేలా ప్రధాని నరేంద్ర మోదీతో వ్యాపారాంశాలు చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. కొలరాడోలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 24, 25న ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘నేను వచ్చే వారం భారత్ సందర్శిస్తున్నాను. అక్కడ వాణిజ్యం గురించి చర్చలు జరుపుతాను. వ్యాపారపరంగా అనేకానేక సంవత్సరాలుగా భారత్ మనను దెబ్బతీస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా టారిఫ్‌లు విధిస్తున్న దేశాల్లో అది కూడా ఒకటి. వీటన్నింటిపై కాస్త మాట్లాడాలి‘ అని ట్రంప్ చెప్పారు. ప్రపంచ దేశాలతో అమెరికా వాణిజ్యంలో భారత్ వాటా సుమారు 3%గా ఉంటుంది. అమెరికాకు ప్రయోజనకరమైతేనే డీల్.. భారత పర్యటన సందర్భంగా భారీ డీల్ కుదరవచ్చన్న అంచనాలు తగ్గించే ప్రయత్నం చేశారు ట్రంప్. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తర్వాతే భారత్‌తో ఏదైనా భారీ డీల్ కుదుర్చుకోవచ్చని, అప్పటిదాకా చర్చల ప్రక్రియ నెమ్మదిగా సాగవచ్చని ట్రంప్ చెప్పారు. అమెరికాకు ప్రయోజనకరంగా ఉంటేనే ఏ ఒప్పందమైనా కుదుర్చుకుంటామన్నారు. ఆతిథ్యంపై భారీ అంచనాలు.. భారత్‌లో స్వాగత సత్కారాలు భారీ స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ‘ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రికెట్ స్టేడియంకు వెళ్లే దారిలో దాదాపు కోటి మంది దాకా స్వాగతం పలుకుతారని ప్రధాని మోదీ నాకు చెప్పారు. అయితే, దీంతో ఓ చిన్న సమస్య రావొచ్చు. ఇప్పుడు సమావేశమైన ఈ ప్రాంగణం సుమారు 60వేల మందితో కిక్కిరిసిపోయింది. వేల మంది లోపలికి రాలేక బైటే ఉండిపోయారు. అయినప్పటికీ.. భారత్‌లో కోటి మంది ప్రజల స్వాగతం చూశాక.. ఇక్కడ వేల సంఖ్యలో వచ్చే వారు కంటికి ఆనకపోవచ్చు‘ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
చదువు..బరువు
ప్రైవేటు పాఠశాలలు తమ అత్యాçశతో.. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టేస్తున్నాయి. ఓవైపు ఫీజులు.. మరోవైపు పుస్తకాల దందా సాగిస్తున్నారు. ఇదంతా.. ఒక ఎత్తైతే.. ప్రభుత్వ సిలబస్‌నే ప్రామాణికంగా తీసుకోవాలన్న నిబంధనను తుంగలో తొక్కేస్తూ సొంత సిలబస్‌ను పిల్లలపై రుద్దుతున్నారు. దీని వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో నష్టం వాటిల్లే ప్రమాదముంది. తెలంగాణ రాష్ట్రంలో సొంత సిలబస్‌తో నడుపుతున్న పాఠశాలలపై విద్యాశాఖాధికారులు దాడులు చేస్తుండగా.. మన జిల్లాలో మాత్రం కార్యాలయం కదలకుండానే ఆ శాఖాధికారులు నిద్దరోతున్నారు. విద్యార్థి పాఠశాల జీవితం అయోమయంలోకి నెడుతోంది. విద్యాశాఖ నిర్లక్ష్యం వహిస్తుండటంతో.. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు స్కూళ్లు.. సొంత నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థుల జీవితాల్ని ఇరుకున పడేస్తున్నాయి. ప్రభుత్వం నిబంధనలు విధించినా.. అవి క్షేత్ర స్థాయిలో అమలు చెయ్యకపోవడంతో.. ఉన్నత చదువులకు వెళ్లే సమయంలో పిల్లలు అర్హత కోల్పోయే ప్రమాదముంది. సాక్షి, విశాఖపట్నం : దేశంలోని అన్ని పాఠశాలల్లో ఒకటి, రెండో తరగతి విద్యార్థులకు హోంవర్కు ఇవ్వడాన్ని నిషేధించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మద్రాస్ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. సీబీఎస్ఈ పాఠశాలలకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. దీంతోపాటు పుస్తకాల మోతను కూడా తగ్గించాలని ఆదేశించింది. ఎన్సీఈఆర్టీ నిర్దేశించిన మేరకు ఒకటి, రెండో తరగతుల విద్యార్థులకు లాంగ్వేజ్, మేథమేటిక్స్, మూడు నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు లాంగ్వేజ్, ఎన్విరాన్మెంట్ సైన్సెస్, మేథమేటిక్స్ మినహాయించి ఇతర ఏ సబ్జెక్టులను ప్రవేశపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వాలను తక్షణమే సూచించాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటీవల వెలువరించిన తీర్పులో నిర్దేశించింది. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాల క్రమంలోనే స్కూల్ బ్యాగ్‌ల బరువును తగ్గించేందుకు ‘చిల్డ్రన్ స్కూల్ బ్యాగ్ పాలసీ’ని రూపొందించేలా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కోరాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయి. తమ ఆదేశాలను ఉల్లంఘించే ప్రయత్నం జరిగితే తీవ్రమైన చర్యలుంటాయని కోర్టు హెచ్చరించింది. ఇదో పుస్తక వ్యాపారం తల్లిదండ్రుల నుంచి ఎంత మేర పిండుకోవాలని ప్రైవేట్ స్కూళ్లు ఆలోచిస్తున్నాయి. అందిన కాడికి దోచుకునేందుకు అనేక ఫీజుల రూపంలో వసూలు చేస్తున్న స్కూళ్లు.. తాజాగా పుస్తక వ్యాపారానికి తెరతీశారు. సాధారణంగా.. నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించిన ఒకటో తరగతికి సంబంధించిన ఒక పుస్తకం రూ.10 నుంచి రూ.40 లోపు ఉంటుంది. అలాగే రెండో తరగతికి సంబంధించిన ఒక్కో పుస్తకం కేవలం రూ.20 నుంచి 50 రూపాయలుంటుంది. ఈ తక్కువ ధరలతో పుస్తకాలు అమ్మితే లాభం వచ్చే అవకాశం ఉండదు. అందుకే చాలా పాఠశాలలు కొత్త ఎత్తుగడను వేస్తున్నాయి. పుస్తక ముద్రణ సంస్థతో ముందుగానే మాట్లాడుకొని. తయారీకి అయ్యే ఖర్చు కంటే మూడు రెట్ల ధరను ముద్రించేస్తున్నాయి. దీంతో ఏ స్కూళ్లో చదువుతున్నారో అదే స్కూల్ పుస్తకాలు కొనాలనే నిబంధనతో తల్లిదండ్రుల చేతి చమురు వదులుతోంది. ఒకటో తరగతి పుస్తకాలు కొనాలంటే.. రూ.3వేల నుంచి రూ.4 వేలు వసూలు చేస్తున్నారు. అదే ప్రభుత్వ సిలబస్ ప్రకారం బోధన జరిగితే.. కేవలం వెయ్యి రూపాయలతో తేలిపోతుంది. ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు గుణాత్మక బోధన చెయ్యాల్సి ఉంటుంది. ఈ తరగతులు చదువుతున్న చిన్నారులను పరిసరాలతో మమేకం చేస్తూ విద్య బోధించాలే తప్ప పుస్తకాలు, హోం వర్క్‌లు ఉండకూడదు. కానీ ఏ ప్రైవేట్ స్కూల్లోనూ ఈ నిబంధనలు పాటించకుండా పసిమనసులతో పుస్తక వికృత క్రీడను ఆడుతున్నారు. ఏవేవో పుస్తకాలు తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకుంటూ ప్రైవేటు పాఠశాలలు విద్యను వ్యాపారంగా మలచుకుంటున్నాయి. ఎల్కేజీ విద్యార్థులకు అవసరం లేని పుస్తకాల్ని సైతం అధిక ధరలకు అంటగడుతున్నారు. ఓనమాలు దిద్దాల్సిన ఎల్కేజీ విద్యార్థికి కంప్యూటర్, జీకే, ఎన్విరాన్మెంట్ సైన్స్ పుస్తకాలు కొనుగోలు చేయిస్తుండటం గమనార్హం. ఇవి కూడా ఒక్కో పుస్తకం రూ.70 నుంచి 150 రూపాయల వరకూ ఉంటోంది. స్థాయికి మించిన పుస్తకాలు కొనుగోలు చేయించేస్తున్నారు. చిన్న మెదడుకు చిన్న విద్య అనే సూత్రాన్ని పాటించాలని విద్యా నిపుణులు చెబుతున్నా.. అవన్నీ పెడచెవిన పెట్టేస్తూ.. తల్లిదండ్రుల నుంచి ఎంత గుంజుకోవాలో లెక్కలు వేసుకుంటున్నారు. సైన్స్, సోషల్ పాఠాలు సాధారణంగా రెండో తరగతి నుంచి ఒంటబడతాయి. వాటిపై అప్పుడే చిన్నారులకు అవగాహన వస్తుంది. కానీ.. ఎల్కేజీలోనే విద్యార్థులకు సైన్స్ బోధిస్తున్నారు. అవి వారికి అర్థం కాకపోయినా.. బట్టీ విధానం ద్వారానే నేర్పిస్తూ.. వారిలోని మేధో సంపత్తిని ఆదిలోనే నిర్వీర్యం చేసేస్తున్నారు. -
వ్యక్తిగత సంపదలో భారత్‌కు 10వ స్థానం
న్యూఢిల్లీ: దేశాల వారీగా వ్యక్తిగత సంపద విషయంలో భారత్ ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది. దేశం మొత్తం ప్రైవేటు సంపద విలువ 3,492 బిలియన్ డాలర్లు. ఆస్తి, నగదు, ఈక్విటీలు, బిజినెస్ ప్రయోజనాలుసహా ప్రతి దేశంలోని వ్యక్తులందరి ప్రైవేటు సంపద ప్రాతిపదికన న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థ 2015కు సంబంధించి ఈ నివేదికను విడుదల చేసింది. ఈ వరుసలో 48,734 బిలియన్ డాలర్లతో అమెరికా ముందు నిలిచింది. వరుసలో తరువాత 8 స్థానాల్లో చైనా(17,254 బిలియన్ డాలర్లు), జపాన్(15,230 బి. డాలర్లు), జర్మనీ (9,358 బి. డాలర్లు), బ్రిటన్(9,240 బి. డాలర్లు), ఫ్రాన్స్(8,722 బి. డాలర్లు), ఇటలీ (7,308 బి. డాలర్లు), కెనడా(4,796 బి. డాలర్లు), ఆస్ట్రేలియా(4,497 బి. డాలర్లు) నిలిచాయి. తలసరి విషయంలో 20వ ర్యాంక్. కాగా ఈ సంపద తలసరి విషయానికి వచ్చే సరికి భారత్ 20వ స్థానంలో నిలిచింది. భారతీయుని సగటు సంపద 2,800 డాలర్లుగా ఉంది. అధిక జనాభా దీనికి కారణంగా కనిపిస్తోంది. 2,85,100 డాలర్లతో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంది. అయితే 2000వ సంవత్సరంలో భారత్‌లో వ్యక్తిగత సంపద తలసరి కేవలం 900 డాలర్లు. 2015 నాటికి 211 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ఈ 15 సంవత్సరాల్లో భారీగా సంపద వృద్ధి నమోదుచేసుకున్న దేశం ర్యాంకుల్లో భారత్ 5వ స్థానాన్ని దక్కించుకుంది.