రాష్ట్రంలో 43 మంది సీటీవోల బదిలీ
తిరుపతి రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 43 మంది వాణిజ్య పన్నుల శాఖాధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖా కమిషనర్ శ్యామలారావు సోమవారం రాత్రి ఆదేశాలు జారీచేశారు. సీటీవోల బదిలీల్లో ఈసారి కమిషనర్ డిపార్ట్మెంట్ పోర్టల్ ద్వారా అధికారుల నుంచి వినతులను స్వీకరించారు.
ఐదేళ్లు పూర్తి అయిన వారిని తప్పనిసరిగానూ, మూడేళ్లు నిండిన వారిని వినతుల ద్వారా బదిలీ చేశారు. సీటీవో ర్యాంకులో ఒకేసారి 43 మందిని డిపార్ట్మెంట్ పోర్టల్ ద్వారా బదిలీ చేయడం రాష్ట్రంలో ఇదే ప్రథమం. బదిలీ అయిన అధికారులు రెండు రోజుల్లో విధుల్లో చేరాలని కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.