businessman murdered
-
రాహుల్ హత్య కేసులో కీలక పరిణామం, A1 లొంగుబాటు
సాక్షి, విజయవాడ: స్థానికంగా కలకలం రేపిన వ్యాపారి రాహుల్ హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాహుల్ హత్య కేసు ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ మాచవరం పోలీసుల ఎదుట ఆదివారం లొంగిపోయాడు. రాహుల్ హత్య కేసులో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు A-1 కోరాడ విజయ్, A-2 కోగంటి సత్యం, A-3 విజయ్ భార్య పద్మజ, A-4 పద్మజ, A-5 గాయత్రి పేర్లను పేర్కొన్నారు. రాహుల్ తండ్రి రాఘవరావు స్టేట్మెంట్ ఆధారంగా సెక్షన్ 302, 120బి, రెడ్‌విత్ 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసులో ఇప్పటికే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోరాడ విజయ్‌తో కలిపి పోలీసులు అదుపులో ఉన్నవారి సంఖ్య 6కు చేరింది. మాచవరం పోలీసుల ముమ్మర విచారణ కొనసాగుతోంది. (చదవండి: King Cobra: 13 అడుగుల గిరినాగు) హత్యకు గురైన రాహుల్.. అతని మృతదేహం లభ్యమైన కారు -
కత్తులతో పొడిచి.. బైకుతో సహా నిప్పంటించారు
రాంబిల్లి (విశాఖపట్నం): ఓ చిరు వ్యాపారిరి కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. కత్తులతో పొడిచి బైకుతో సహా అతడికి నిప్పంటించారు. విశాఖ జిల్లా రాంబిల్లి మండలం కొత్తకోడూరు వద్ద గురువారం అర్ధరాత్రి తరువాత ఈ దారుణం జరిగింది. సీఐ కె.వెంకటరావు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడికి చెందిన ద్వారంపూడి వెంకట కృష్ణారెడ్డి(25) కొంతకాలంగా రాంబిల్లి మండలం ధార భోగాపురం గ్రామంలో నివాసం ఉంటున్నాడు. చుట్టుపక్కల మండలాల్లో బైక్‌పై తిరుగుతూ వాయిదా పద్ధతిలో గృహోపకరణాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం పూడిమడకలో వ్యాపారం ముగించుకుని తిరిగి వెళుతుండగా.. అర్ధరాత్రి సమయంలో కొత్తకోడూరు పాఠశాలకు సమీపంలో గుర్తు తెలియని దుండగులు అతనిపై కత్తులతో దాడిచేశారు. బైక్‌తో సహా అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో అతడు మృతి చెందాడు. సీఐ కె.వెంకటరావు, ఎస్ఐ కె.కుమారస్వామి ఏఎస్పీ సత్య ఏసుబాబు సంఘటనా స్ధలాన్ని శుక్రవారం ఉదయం పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి పరిశీలించాయి. హత్యా నేరం కింద కేసు న మోదు చేశామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.