మెట్రోరైల్ భవన్ వద్ద సుల్తాన్ బజార్ వ్యాపారుల ధర్నా
మెట్రోరైలు నిర్మాణంతో తామంతా ఉపాధి కోల్పోతామని, అందువల్ల ఎలైన్మెంట్ మార్చాలని కోరుతూ సుల్తాన్ బజార్ వ్యాపారులు మెట్రోరైల్ భవన్ వద్ద ధర్నా చేశారు. సుల్తాన్ బజార్ మీదుగా మెట్రోరైలు వెళ్తే తామందరం వ్యాపారాలు వదులుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, ఇప్పటికే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో పాత పద్ధతిలోనే మెట్రో ఎలైన్మెంట్ ఉంటుందని హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. సుల్తాన్ బజార్ వ్యాపారుల కోసం 2000 గజాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. వాస్తవానికి సుల్తాన్‌బజార్ ప్రాంతాన్ని మినహాయించేందుకు అక్కడ అండర్‌గ్రౌండ్ సహా పలు రకాల ప్రత్యామ్నాయాలు చూశారు గానీ, అవేవీ పెద్దగా పనికిరాలేదు. దాంతో.. పాత పద్ధతిలోనే, అదే ఎలైన్మెంటుతో మెట్రోరైలును నిర్మించాలని నిర్ణయించారు. దానికి తగ్గట్లుగా ముందుగా పుత్లిబౌలిలోని పెట్రోలు బంకును కూడా కూల్చేశారు.