ఆ ఉరితాడు ఎక్కడ తయారైందో తెలుసా?
పట్నా: ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ను ఉరితీయడానికి ఉపమోగించిన తాడును బిహార్ జైలు నుంచి పంపించినట్లు జైలు అధికారులు తెలిపారు. బుక్సార్ సెంట్రల్ జైలులో తయారుచేసిన ఈ తాడును మెమన్ ఉరితీత కోసం పంపినట్లు జైలు సూపరింటెండెంట్ ఎస్కే చౌదరి వెల్లడించారు. గతంలో దేశంలోని పలు జైళ్లలో కూడా ఈ తాడును వియోగించినట్లు చెప్పారు.
తొలిసారిగా 2004లో 14 ఏళ్ల బాలిక రేప్, హత్య కేసులో ధనంజయ్ బెనర్జీని ఉరితీయడానికి కోల్‌కతాకు ఈ తాడు చేరవేసినట్లు తెలిపారు. పార్లమెంట్ దాడులకు కారుకుడైన అఫ్జల్‌గురు, ముంబై దాడుల కేసులో నిందితుడు అజ్మల్ కసబ్ లను ఉరితీసేందుకు ఇక్కడ తయారుచేసిన తాడునే వాడినట్లు చౌదరి పేర్కొన్నారు. జే-34 కాటన్ వాడి తాడును తయారు చేశామని, ఆ తర్వాత మైనంతో దానిని మెత్తబడేలా చేస్తామని తయారీ పద్ధతిని వివరించారు.