పండుగ వచ్చేసింది..
సాక్షి- ఎస్ఆర్ షాపింగ్ మాల్
పండుగ సంబరాలు ప్రారంభం
నేడు తొలి విజేతను ఎంపిక చేయనున్న కలెక్టర్
కొనుగోలుదారులకు లక్కీ చాన్స్
రోజూ రూ.లక్ష పొందే అవకాశం
మరో అయిదుగురికి ప్రత్యేక బహుమతులు
బంపర్ డ్రాలో నానో కారు ప్రత్యేక డ్రాలో 2 బైకులు
విశాఖపట్నం సిటీ : కొనుగోలుదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాక్షి-ఎస్ఆర్ షాపింగ్ మాల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న పండుగ సంబరాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. రూ.లక్ష విజేత ఎంపిక బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ఉత్సవాల గురించి తెలిసి ఉత్తరాంధ్రలోని కొనుగోలుదారులంతా రూ. లక్ష గెలుచుకునేందుకు పోటీ పడుతున్నారు. మొదటి రోజు విజేతను కలెక్టర్ ఎన్.యువరాజ్ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు జగదాంబ జంక్షన్‌లోని ఎస్ఆర్ షాపింగ్ మాల్లో నిర్వహించే డ్రా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని విజేతలను ప్రకటించనున్నారు. ఏటా సాక్షి-ఎస్ఆర్ షాపింగ్ మాల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సంబరాలకు విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. మూడేళ్లుగా బహుమతులను సొంతం చేసుకున్న వందలాది మంది డిసెంబర్ నెల ఆరంభం నుంచే ఈ సంబ రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏటా 15 రోజుల పాటు నిర్వహించే ఈ సంబరాల్లో 15 మందిని రూ. లక్షాధికారులను చేయడంతో పాటు రోజుకు మరో అయిదుగురికి కన్సొలేషన్ బహుమతులు అందించనున్నారు.
భలే క్రేజ్..
మూడేళ్లుగా విజయవంతగా పండుగ సంబరాలను నిర్వహించిన సాక్షి-ఎస్ఆర్ షాపింగ్ మాల్ నిర్వహణపై కొనుగోలుదారులకు పూర్తి విశ్వాసం ఉంది. నాల్గో ఏట కూడా అదే నమ్మకంతో రూ.లక్షతో పాటు అనేక బహుమతులు అందుకునేందుకు ఎదురుచూస్తున్నారు. అందుకు వారు చెబుతున్న కారణాలిలా ఉన్నాయి.ముందుగా ప్రకటించిన సమయానికే ప్రముఖుల సమక్షంలో డ్రా తీసి విజేతలను అక్కడికక్కడే ప్రకటించి ఫోన్లో ఆ సమాచారాన్ని వినియోగదారులకు తెలియజేయడం. ఆరా తీస్తున్న ప్రతి సారి ఆయా షోరూంను ప్రకటించి పండుగ వాతావరణంలో విజేతలను ఎంపిక చేయడం. విజేతలను ప్రకటించిన ఒకటి రెండు రోజుల్లోనే అందరికీ బహుమతులను అందజేయడం. రూ. లక్ష రాలేని వారికి విలువైన పలు బహుమతులు లభ్యం కావడంతో అంతా ఆసక్తి చూపుతున్నారు. రూ. లక్ష నగదుతో పాటు బైక్‌లు, కారు, ఇతర బహుమతులు లభ్యం కావడంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరుగుతోంది.
ప్రధాన స్పాన్సర్‌గా ఎస్ఆర్ షాపింగ్‌మాల్ వ్యవహరిస్తుండగా, అందుకు సపోర్టెడ్‌గా వైభవ్ జ్యూవలర్స్, పవర్డ్‌గా సెల్‌పాయింట్‌తో పాటు కో- స్పాన్సర్స్‌గా గెలాక్సీ, బాయ్‌లండన్, వరుణ్ మారుతి, బీఈ షాపీ, వరుణ్‌బజాజ్, కళ్యాణి ఫ్యామిలీ షాపీ, శ్రీశ్రీనివాసా యమహా, క్రాంతి ప్రాపర్టీస్ వంటి సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ప్రత్యేక డ్రాలో విజేతలైన వారికి శ్రీ శ్రీనివాసా యమహా వారు యమహా ఆల్ఫా బైక్, వరుణ్ బజాజ్ వారు డిస్కవరీ-100 బైక్‌లను అందిస్తున్నారు. బంపర్ ప్రైై జ్ గా టాటా నానో కారును శివశంకర మోటార్స్ ప్రయివేట్ లిమిటెడ్, ఎస్ఆర్ఎంటీ లిమిటెడ్ వారు అందిస్తున్నారు. గిఫ్ట్ స్పాన్సర్లుగా టీఎంసీ, బీఈ షాపీ, గాయత్రీ హోం అప్లయెన్సెస్, సెల్కాన్ మొబైల్ వారు వ్యవహరిస్తున్నారు. కొనుగోలుదారులు ఈ నెల 23వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకూ పైన తెలిపిన ఏ షాపులోనైనా కొనుగోలు చేసి పొందిన కూపన్‌ను డ్రా బాక్సులో వేయాలి. ఏరోజుకారోజు తీసే డ్రాలో గెలుపొంది క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలు జరుపుకోవాలని నిర్వాహకులు కోరారు.