మకాం మార్చనున్న ఎంఎస్ ధోని
న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్‌గా రాజీనామా చేస్తున్నట్టు సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన ఎంఎస్ ధోని ఇళ్లు మారబోతున్నారు. ముంబాయి అంధేరి ప్రాంతంలోని హౌజింగ్ సొసైటీలో నాలుగు ఫ్లాట్స్‌ను ఆయన కొనుగోలు చేశారు. సొసైటీలో కొనుగోలు చేస్తున్న ఇళ్లలోకి ఆయన కుటుంబసభ్యులతో కలిసి మకాం మార్చబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంఎస్ ధోని జార్ఖాండ్‌లోని రాంచిలో హర్ము హౌజింగ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. స్థానిక బ్రోకర్లు సైతం ఆ సొసైటీ 'ధోని వాలీ' బిల్డింగ్‌గా లేబ్లింగ్ చేయబోతున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి.
ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలు విపుల్ షా, చిత్రాన్గడ సింగ్, ప్రాచి దేశాయ్, ప్రభు దేవా వంటి పలువురు ఇళ్లకి దగ్గర్లో ధోని ఈ ఫ్లాట్లను కొన్నారు. వన్డే, టీ-20 క్రికెట్ జట్ల కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్టు గత బుధవారం ధోని సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండియా- ఇంగ్లాండ్ ఓడీఐ సిరీస్ ముందు నిర్వహించిన తొలి వార్మప్ మ్యాచ్‌కు ఆయన చివరిగా కెప్టెన్‌గా నిర్వహించారు.